Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
ఉగాది శుభాకాంక్షలు

ఒక్కో ఉగాదికి ఒకే పేరు ఉంటుంది. ఆ పేరనే సంవత్సర నామధేయంగా వ్యవహరిస్తాం. అలా 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. పురాణగాధ ప్రకారం.. విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగుసంవత్సరాలు. కాలచక్రంలో వారి పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇచ్చిన కారణంగానే ప్రతి ఉగాదికి అవే నామధేయాలు అవుతున్నాయి.


హేమలంబ అనగా బంగారు తోరణమని అర్ధం.

ఈ ఉగాది *హేవళంబి/హేమలంబ* ఇచ్చే ఫలితం _ప్రజలకు ఆనందం_.

https://telegram.me/joinchat/AGbANkCyYVXIA8zbcg-X2g
భారత జాతి గుండె చప్పుడు ' రామనామం'

గుణం, రూపం, ధర్మం, జ్ఞానం, పరాక్రమం, కారుణ్యం, త్యాగం, సర్వ ధర్మాలనూ సమన్వయించడం, అన్నింటిలోనూ పరిపూర్ణతను ఏ ఒక్కరూ సాధించలేరు! ప్రతి లక్షణం కొద్దికొద్దిగా కలిసి ఉండటమూ అరుదు! ఇందులోని అన్ని లక్షణాల్నీ జీవితాంతమూ సమగ్రంగా కలిగి ఉండటం ఎంతో అపురూపం! అన్నీ పరిపూర్ణంగా ఉండే ఒక అద్భుతం జరగాలంటే, ఆ దేవుడే దిగి రావాలి! అలా దిగి వచ్చిన దేవుడే శ్రీరాముడు!

పరిపూర్ణమైనవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ రూపంలో వచ్చినా, దాని పరిపూర్ణతను పండించగలడు. అందుకే ఆదర్శమూర్తి రాముడిగా ఆ స్వామి పూర్ణత్వాన్ని ప్రకటించాడు. ఆ నిండుదనమే ఒక మణిదీపంగా మానవజాతికి వెలుగు పంచుతోంది.

అత్యంత ప్రాచీనమైన రామాయణాన్ని పరిశీలిస్తే, ఆనాటి మానవ సమాజం నాగరికంగా ఎంత ఎదిగిందో అవగతమవుతుంది. గ్రామ, జానపద, నగర ఆవాసాలు, పరిపాలనా పద్ధతులు, మానవ సంబంధాల మర్యాదలు ఎలా ఉండేవో అర్థమవుతుంది. వాగ్ధోరణిలో ఔచిత్యాలు, ప్రవర్తన సరళిలో సంస్కారాలు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు, కళారీతులు లాంటివన్నీ అభ్యుదయ స్థితిలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

అలాంటి కాలంలో మహా వ్యక్తిత్వంతో రఘురాముడు రాజిల్లాడు. అద్భుత పరిపూర్ణ వ్యక్తిత్వం వల్ల, ఆయనను భగవంతుడిగా కొలుస్తామంటారు కొందరు. భగవంతుడే ఒక నిండైన మహా వ్యక్తిగా అవతరించి, లోకానికి ఆరాధ్యుడయ్యాడని ఇంకొందరు చెబుతారు. ఈ రెండో అంశమే వాల్మీకాది మహర్షుల హృదయం.

ఆదర్శమూర్తి అయిన రాముడు నారాయణుడి అవతారంగా ఎందరికో ఆరాధ్యుడు. రావణాది రాక్షసుల వల్ల సడలిన ధర్మవ్యవస్థను చక్కదిద్దడానికి రుషులు, దేవతలు ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మను ఉపాసించారు. జగతికి ఆనందం కలిగించడానికి ఆ పరమాత్మను మంత్రం, తపస్సు, సాధనలతో ఆరాధించారు. వాటి ఫలంగా భగవంతుడు రాముడిగా అవతరించాడు!

రామారాధన అంటే, అది సాక్షాత్తు పరబ్రహ్మోపాసన. దీనికి తార్కాణంగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భిన్న భాషల్లో భిన్న రీతుల్లో పలువురు భక్తులు, యోగులు సాక్షాత్కరిస్తారు. తులసీదాసు, రామదాసు, కబీరు, త్యాగయ్య యింకా ఎందరో!

శ్రీరాముని పుట్టుక సమయంలో గ్రహబలం!

రామ జనన గాథలోనే విశేషం ఉంది! దాన్ని దేవ రహస్యం అనవచ్చు. రాముడు చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. అయిదు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా, అదితీనక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది.

ధర్మనిష్ఠులను, సామాన్యులను, ఆశ్రయించిన అభాగ్యులను ఆదు కోవడం రాముడి వైశిష్ట్యం. ధర్మ వ్యతిరేకులను, స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేవారిని శిక్షించడం ఆయనలోని విలక్షణం. ఒక సువ్యవస్థను రూపొందించడం ద్వారా సందర్భోచితంగా కారుణ్య, కాఠిన్యాలను సమన్వయించడం మరో విశిష్టత.

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు అంటే గట్టి నియమ పాలన గలవాడు శ్రీరాముడు. ఆయన మంచి నడవడి కలిగినవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, చూసేవారికి ప్రీతి కలిగించే స్వరూప స్వభావాలున్నవాడు. ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్వి, అసూయ లేనివాడు, ధర్మబద్ధమైన తన ఆగ్రహంతో దేవతల్ని సైతం శాసించగలిగేవాడు రాముడు. ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో, సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ!

భారతజాతి గుండె చప్పుడుగా 'రామనామం' మోగుతూనే ఉంది. ఆస్తిక జన హృదయాల్లో ఆయన దివ్యమంగళ విగ్రహం కొలువై ఉంది. రామ కథా సుధ తరగని జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది!

మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

https://telegram.me/joinchat/AGbANkCyYVXIA8zbcg-X2g
Channel name was changed to «telugu Devotional»
శాంతి మంత్రం 🖕
హనుమజ్జయంతి

హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

++++++++++++++++++++

హనుమజ్జయంతి:
జిల్లేడు వత్తులతో దీపమెలిగించండి!
చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపమెలిగిస్తే అష్టైశ్వర్యాలీ చేకూరుతాయి. హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు, పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి.

పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి.
పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యానశ్లోకములు, హనుమాన్‌చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.
స్వేచ్ఛ

మాటల్ని వల్లించడం సత్యం కాదు. శాస్త్రాల్ని తెలిసి ఉండడం సత్యం కాదు. మనిషి మాటల్లో మునిగిపోయాడు. మనిషి చెరసాలలో ఉన్నాడు. కానీ తాను స్వేచ్ఛగా ఉన్నానని అనుకుంటున్నాడు. అట్లాంటి మనిషికి స్వేచ్ఛ ఇచ్చినా అతను దాన్ని అనుభవించలేడు. బానిసత్వానికి అలవాటు పడితే మనిషికి స్వాతంత్య్రమిచ్చినా స్వీకరించలేడు. వాదాలతో, శాస్త్రాలతో, మాటలలో సత్యం మరుగున పడిపోయింది. అందువల్ల మనం వాటికి అలవాటు పడిపోయాం. సత్యాన్ని గుర్తించే అర్హతను కోల్పోయాం. దీన్ని బట్టి ఎవరయితే అస్థిత్వాన్ని గుర్తించలేరో, తమ లోలోతుల్లోకి వెళ్లి తమ అసలు స్వరూపాన్ని చూడలేరో వాళ్లు సత్యాన్ని గ్రహించలేరు. ఒక పర్వతం మీద ఒక సత్రం ఉండేది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు అందులో బస చేసేవాళ్లు. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వాళ్లు ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్లు. ఎందుకంటే ఆ పర్వతం మీద గొప్ప ఆలయముంది. ఆలయాన్ని సందర్శించాలనుకున్న వాళ్లు ఆ సత్రంలో దిగేవాళ్లు.

ఆ సత్రం యజమాని దగ్గర ఒక చిలుక ఉండేది. దాన్ని పంజరంలో పెట్టి సత్రం ముందు పంజరాన్ని వేలాడదీశాడు. దాన్ని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు. దానికి పళ్ళు, ఫలాలు తినిపించేవాడు. దానికి స్వేచ్ఛ అన్నమాట నేర్పించాడు. అది ఎప్పుడూ ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటల్ని వల్లిస్తూ ఉండేది. సత్రంలో దిగిన వాళ్లకు గొప్ప వినోదంగా ఉండేది. వాళ్ళు కూడా దానికి తినడానికి ఏమైనా పెట్టేవాళ్లు. వాళ్ళు పెట్టినది తింటూ అది ‘స్వేచ్ఛ,స్వేచ్ఛ’ అని అరుస్తుండేది. రాత్రయినా పగలయినా అవే మాటల్ని వల్లిస్తూ ఉండేది. నిజానికి ఆ పక్షికి స్వేచ్ఛ అనే మాటకు అర్థం తెలీదు. అది ఉన్నది పంజరంలో. తను స్వేచ్ఛగా లేనని, పంజరంలో ఉన్నానని, స్వేచ్ఛ అనే మాటకు తనకు అర్థం తెలీదని దానికి స్పృహ లేదు.

ఇట్లా ఉంటే ఒక సారి వివేకవంతుడయిన ఒక వ్యక్తి ఆ సత్రంలో దిగాడు. చీకటిపడుతుండగా ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించడంతో చుట్టూ చూశాడు. సతం ముందు పంజరంలో చిలుక ఆ మాటలు వల్లిస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. పంజరం దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. అతన్ని చూసి చిలుక ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంది. అది స్వేచ్ఛగా లేదని ఆమాటకు దాని అర్థం తెలీదని అది పంజరంలో ఉందని అతనికి తెలుసు. అతనికి స్వేచ్ఛ అంటే ఏమిటో స్వాతంత్య్రమంటే ఏమిటో తెలుసు. అతను వెంటనే పంజరం తలుపు తెరచి చిలుకను బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఆ చిలుక బయటకు రావడానికి ఇష్టపడలేదు. అతను బలవంతంగా బయటకు తీసి వదిలిపెట్టినా మళ్లీ పంజరంలోకి వెళ్లింది. ఎప్పటిలా ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అని అరవడం మొదలుపెట్టింది. రెండుమూడు సార్లు అతను ప్రయత్నించాడు. చివరకు నాలుగోసారి దాన్ని పట్టుకుని దూరంగా వెళ్లి ఆకాశంలోకి వదిలిపెట్టాడు. అది ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంటూ ఎగిరిపోయింది.

ఆవ్యక్తి ఆనందంతో సత్రానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు జామునే ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వనిపించాయి. నిద్రమత్తు వదిలించుకుని అతను లేచి సత్రం ముందుకు వచ్చి చూశాడు. చిలుక పంజరంలో దూరి ‘స్వేచ్ఛ!స్వేచ్చ!’ అంటూ ఉంది.

https://telegram.me/joinchat/AGbANkCyYVXIA8zbcg-X2g
ఇంతకూ ఎందరు దేవుళ్ళు...?
ఒక మత బోధకుడు దేశ సంచారం చేస్తూ చేస్తూ ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ ఊరి ప్రజలకు ఎందరో దేవుళ్ళ గురించి ఎన్నో కథలు చెప్పాడు. అందరు ఎంతో ఆశక్తితో విన్నారు. ఆయన చెప్పిన తీరుతో దేవుళ్ళందరూ తమతోనే ఉంటున్నారని గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అయ్యాయి. ఆ ఊళ్ళోకి మరొకడు వచ్చాడు. అతను అసలు దేవుడనే వాడు లేనే లేడు...మతబోధకుడు మాత్రమే కాదు ఎవరు ఏం చెప్పినా నమ్మకండి అని అన్నాడు. దేవుడు ఎందుకు లేడో అని నమ్మించేందుకు రకరకాల కథలు చెప్పాడు. అతను చెప్పే మాటలు విన్న వారిలో చాలా మంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నిన్నమొన్నటివరకు వాళ్ళందరూ మతబోధకుడు చెప్పిన మాటలు విని భయం భయంగా రోజులు గడపడం మొదలుపెట్టారు. తాము చేసే తప్పులకు దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో అని భయపడ్డ వారందరూ ఇప్పుడు దేవుడనే వాడు అసలు లేనే లేడు అని చెప్పిన వ్యక్తి మాటలతో కాస్తంత శాంతించారు. తాము చేసిన తప్పులకు శిక్ష పడదనుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి. కొత్తగా మరో వ్యక్తి వచ్చాడు. దేవుడనే వాడు ఒక్కడే ఉన్నాడు. తన మాట నమ్మించడానికి అతను ఎన్నో విషయాలు చెప్పాడు. అతని మాటలు విన్న వాళ్ళందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. అనేక మంది దేవుళ్ళు ఉంటే కొందరు దేవుళ్ళైనా తమ తప్పులు పట్టించుకోరని, చూసీచూడనట్టు ఉండిపోతారని అనుకున్నారు. కానీ ఒకడే దేవుడంటే తాము చేసిన తప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకుని భయపడ్డారు.

ఇంతలో ఇంకో మనిషి వచ్చాడు ఆ ఊరికి. అతను వచ్చీ రావడంతోనే దేవుళ్ళు ముగ్గురు ఉన్నారని, వారికి కరుణకు మారుపేరైన ఒక తల్లి ఉందని చెప్పాడు. ఇప్పుడు ఆ ఊరి ప్రజలకు కాస్త ఊరట కలిగింది. దేవుళ్ళు ముగ్గురు ఉండటం వల్ల తాము చేసింది తప్పో పాపమో కాదో అనే విషయంలో కచ్చితమైన నిర్ణయానికి వాళ్ళు రాలేకపోతారని, ఒకవేళ వాళ్ళు తాము చేసింది తప్పని ఒక నిర్ణయానికి వచ్చినా కరుణకు ప్రతిరూపమైన వారి తల్లి తమను దయ తలచి విడిచిపెడుతుందని అనుకున్నారు. ఈ విషయమంతా అలా ఉంటే ఆ ఊరి ప్రజలు ఇప్పటిదాకా మొత్తం ఎందరు దేవుళ్ళు ఉన్నారో అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేక సతమతమవుతున్నారు. దేవుడు అసలు ఉన్నాడా లేడా తెలియని అయోమయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సందిగ్ధంలో పడ్డారు. ఈ ఊరి జనంలాగే మనలో ఎక్కువ శాతం మంది ఇతరులు చెప్పే మాటలకు అతిగా విలువ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేక అలా ఉండచ్చు ఇలా ఉండచ్చు అనే అనుమానాలతో బతుకుతుంటారు. ఏవేవో ఆలోచనలతో ఉంటారు. కనుక ఎవరికి వారు ధ్యాన మార్గంలో జవాబు కనుక్కోవడం ఉత్తమం. లేకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలకు రెక్కలు వచ్చి అవి మనల్ని స్థిరంగా ఉండనివ్వక ఊపిరాడనివ్వక నజ్జుగుజ్జు చేస్తుందని తెలుసుకుని చైతన్యవంతంతో బతకాలన్నదే ఈ కథ సారాంశం.
https://telegram.me/joinchat/AGbANkCyYVXIA8zbcg-X2g
**తెలుగునాట సూర్యదేవాలయం**- **గొల్లల మామిడాడ**
హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. వైదిక కాలంలో, మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే! శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం దాదాపు 1500 సంవత్సరాలుగు భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడి స్వామిని కొలుచుకున్నవారి కష్టాలు తొలగి, హర్షంతో తిరిగి వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరుకి హర్షవల్ల అనే పేరు ఉండేది. అదే కాలక్రమేణా అరసవల్లిగా మారింది.

ఇక తెలుగు ప్రజలకి సైతం అంతగా తెలియన మరో పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం చెంతనే తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ఓ నమ్మకం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గొల్లల మామిడాడలో అంతే చరిత్ర కలిగిన ఆలయాలకీ కొదవ లేదు. 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం వాటిలో ప్రముఖమైనవి. ఊరిలోకి అడుగుపెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుచుకుంటారు.

గొల్లల మామిడాడలోని సూర్యనారాయణస్వామి దేవాలయం ఈనాటిది కాదు. ఎప్పుడో 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వేళ్లలో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే. ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలుపంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు.

గొల్లల మామిడాడలో సూర్య భగవానునికి ఆలయం ఉండటమే ఓ విశేషం అయితే, ఈ స్వామి ఉష, ఛాయ అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈసారి తూర్పు గోదావరికి వెళ్లినప్పుడు ఈ విశిష్టమైన దేవాలయాన్ని చూసే ప్రయత్నం చేయండి. చుట్టూ ప్రకృతి సోయగాల మధ్య, ఆ ప్రకృతికి పురుషునిలా భాసిస్తూ ఉండే సూర్యుని ఆలయాన్ని చూడటం ఓ గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది.

https://telegram.me/joinchat/AGbANkCyYVXIA8zbcg-X2g
కర్మ – విశ్రాంతి
చైనా తాత్వికుడయిన కన్‌ఫ్యూషియస్‌ దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళి నమస్కరించి ”అయ్యా! నేను జీవితంలో ఎంతో అలసిపోయాను. ఎన్నో పనులు చేసి విసిగిపోయాను. ఇప్పుడు విశ్రాంతి కోరుకుంటున్నాను. విశ్రాంతికి ఏదయినా మార్గముంటే తెలపండి. విశ్రాంతి ఉంటేనే నా జీవితానికి ఓదార్పు దొరుకుతుంది. మీలాంటి మహాపురుషులు మాత్రమే దానికి మార్గం చూపించగలరని నమ్ముతున్నాను” అన్నాడు.

కన్‌ఫ్యూషియస్‌ ఆ వ్యక్తి చెప్పినవన్నీ విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. లేచి ఆవ్యక్తిని తన వెంట రమ్మన్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచారు. నడిచేంతసేపూకూడా కన్‌ఫ్యూషియస్‌ ఏమీ మాట్లాడలేదు. వెంట నడుస్తున్న వ్యక్తికి అంతా అయోమయంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఈ వ్యక్తి ఎక్కడకు తీసుకెళుతున్నాడా? అని ఆశ్చర్యపోయాడు. కొంత దూరం నడిచి వెళ్లాక కన్యూఫ్యూషియస్‌ ఆగాడు. ఎదురుగా ఉన్న శ్మశానాన్ని చూపించాడు. ఆ వ్యక్తికి ఏమీ అర్ధం కాలేదు. ”ఎందుకు నన్ను శ్మశానానికి తీసుకొచ్చారు. ఎందుకు దాన్ని చూపుతున్నారు?” అని అడిగాడు. కన్‌ఫ్యూషియస్‌ ”విశ్రాంతి అన్నది శ్మశానంలో మాత్రమే ఉంది. సమాధిలో మాత్రమే ఉంది. శాంతి కావాలన్నా, విశ్రాంతి కావాలన్నా చనిపోవాలి. అనుదిన జీవన మన్నది విశ్రాంతికి పూర్తిగా వ్యతిరేకమైంది. కర్మ,విశ్రాంతి ఒకదానికొకటి వ్యతిరేకమయినవి. కర్మ జీవికి విశ్రాంతి ఉండదు. జీవితానికి అర్ధం పని. జీవితానికి విశ్రాంతి అన్నది వ్యతిరేకమయింది. నీకు జీవితం కావాలా? మరణం కావాలా? తేల్చుకో. మరణంలోనే విశ్రాంతి ఉంది” అన్నాడు.

ఆమాటలు విని ఆ వ్యక్తి బిత్తరపోయాడు. కన్‌ఫ్యూషియస్‌ చెప్పిందానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. జీవితానికి మరణమన్నది వ్యతిరేకం కాదు. మరణం జీవితానికి ఆఖరి మజిలీ. మృత్యువు విశ్రాంతి కాదు. బతుకులో ఉన్న అశాంతి మరణంలో కూడా వెంబడిస్తుంది. పీడిస్తుంది. మరణం జీవితానికి వ్యతిరేకం కాదు. అది జీవన సారాంశం. జీవితంలో కర్మ మాత్రమే ఉంటుందని, విశ్రాంతి ఉండదని అనడం సరికాదు. కర్మ అన్నది బాహ్య ప్రపంచానికి సంబంధించింది. శరీరానికి సంబంధించింది. బయటి ప్రపంచానికి సంబంధించినంత మేరకూ దేహికి సంబంధించినంతవరకు కర్మ అనివార్యం.

పని చేయడం తప్పనిసరి. కానీ మనిషి కేవలం శరీర మాత్రుడు కాదు. మనిషికి శరీరం ఒక్కటే లేదు. లోపల ఆత్మఉంది. అస్థిత్వ ముంది. చైతన్యముంది. అవి విశ్రాంతి కేంద్రాలు. తన బాహ్య కర్మను వ్యక్తి ఎప్పుడయితే సంపూర్ణంగా నిర్వహిస్తాడో అతడు అస్తిత్వపు కేంద్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అక్కడ విశ్రాంతి పొందుతాడు. జీవితంలో ద్వంద్వాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నాయి. రాత్రి,పగలు, పగలు శ్రమిస్తాం. రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. మనిషికి శరీరం ఉంది. ఆత్మ ఉంది. శరీరం కర్మను నిర్వహిస్తుంది. ఆత్మ విశ్రాంతినిస్తుంది.
https://telegram.me/joinchat/AGbANkCyYVXIA8zbcg-X2g
దూరంగా ఉండాల్సిందే!

దుర్జనః పరిహర్తవ్యో విద్యయాఽలంకృతోఽపి సన్‌ ।
మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః ॥

శిరస్సు మీద మణి ఉంది కదా అని సర్పాన్ని దగ్గరకి తీయలేం కదా! అలాగే దుర్గార్ముడికి ఎంత విద్య ఉన్నా అతనికి దూరంగా ఉండాల్సిందే! విద్య, విజ్ఞానం, ధనం, కీర్తి వంటి ఎన్ని సంపదలు ఉన్నా... అంతః సౌందర్యం లేని మనిషికి దూరంగా ఉండాలన్నది శతకకారుని భావన.

https://telegram.me/joinchat/AGbANkCyYVXIA8zbcg-X2g
సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ||
కిష్కింద రాజ్యం తెలుగువారిదేనా!
రామాయణం గురించి విన్నవారెవ్వరూ కిష్కిందను మర్చిపోరు. రాముడు సీతమ్మ జాడ కోసం తిరుగుతున్న కాలానికి కిష్కింద రాజ్యాన్ని వాలి పరిపాలిస్తున్నాడు. వాలికీ, అతని సోదరుడైన సుగ్రీవునికీ మధ్య తగని వైరం ఉండేది. అందుకే సుగ్రీవుడు రుష్యశృంగ అనే పర్వతం మీద తలదాచుకునేవాడు. ఆయన వద్ద హనుమంతుడు మంత్రిగా ఉండేవాడు. అలాంటి సమయంలోనే హనుమంతునికి, సీతాదేవి జాడ కోసం వెతుకుతున్న రామలక్ష్మణులు కనిపిస్తారు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే! ఆంజనేయుని సాక్షిగా రాముడు, సుగ్రీవునితో స్నేహం చేయడం... వాలిని చంపి కిష్కింద రాజ్యానికి సుగ్రీవుని రాజుగా నియమించడం జరిగిపోతాయి.
రాముడు, సుగ్రీవుని మధ్య జరిగే ఘట్టాలన్నీ కూడా ప్రస్తుతం కర్ణాటకలో చోటు చేసుకున్నాయని చెబుతారు. రుష్యమూక పర్వతమూ, సుగ్రీవుడు సీతమ్మవారి నగలని భద్రపరచిన గుహ, వాలి దహనమైన చోటు, హనుమంతుడు విశ్రమించిన చోటు... అంటూ హంపి చుట్టుపక్కల అనేక క్షేత్రాలని భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఈ క్షేత్రాలన్నీ హంపీ చుట్టుపక్కల ఉన్న బళ్లారి, కొప్పాల్ జిల్లాలలో కనిపిస్తాయి.

బళ్లారి, కొప్పాల్ జిల్లాలలో తెలుగువారి సంఖ్య చాలా ఎక్కువ. ఇప్పటికీ అక్కడ దాదాపు 50 శాతం మంది తెలుగువారే కనిపిస్తారు. కాబట్టి ఒకప్పుడు ఇవన్నీ తెలుగువారు నివసించే ప్రాంతాలే అనే వాదనలు లేకపోలేదు. విజయనగర రాజులు సైతం తెలుగువారేననీ, అందుకే వారు తెలుగువారికి దగ్గరలో ఉన్న హంపీనే తమ రాజధానిగా నిర్మించుకున్నారన్న వాదనలూ ఉన్నాయి. తెలుగు మీద శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న అభిమానం ఆ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది.

కొందరు పండితులు ఈ వాదనలను కాస్త ముందుకు తీసుకువెళ్లి... అసలు సుగ్రీవుడు తెలుగువాడేననీ, కిష్కింద రాజ్యం ఒకప్పుడు తెలుగువారు నివసించే ప్రదేశమేనని వాదిస్తూ ఉంటారు. తెలుగువారిలో ఒక భిన్నమైన తెగనే వానరులుగా చిత్రీకరించారని అనుమానించేవారూ లేకపోలేదు. అయితే ఇలాంటి వాదనలని ఇప్పుడు నిరూపించడం కష్టం. వీటి గురించి గట్టిగా మాట్లాడితే లేనిపోని వివాదాలూ రేగే ప్రమాదం లేకపోవచ్చు. కాబట్టి భగవద్ స్వరూపం అయినా ఆంజనేయుడూ, ఆయన సన్నిహితుడైన సుగ్రీవుడు... అందరివారూ అనుకుంటే ఏ బాధా లేదు!
బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు.
ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుఱ్ఱం మీద వెళుతు ఈ కేకలన్నీ విన్నాడు.. " ఏమైందిరా నీకు ! ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు ! అన్నాడు.
" మీకెమిటి ! మహారాజులు ! మిమ్మల్ని భగవంతుడు ఒక రాజు గారి కుమారుడిగా పుట్టించాడు ! మీరు చక్కగా మహారాజు అయిపోయారు....నా ఖర్మ ఇలా ఉంది..ఒక రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు.. చూడండి..దేవుడికి ఎంత పక్షపాతమో! అన్నాడు..
మహారాజు చిరునవ్వు నవ్వాడు " అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు !! చిల్లిగవ్వ కూడా ఇవ్వ లేదు అంతేగా ! "" అన్నాడు.
" నిజం చెప్పారు మా రాజా ! " అన్నాడు బిచ్చగాడు.
" ఒరేయ్ ! నీకు పది వేల వరహాలు ఇస్తాను .నీ అరచేయి కోసుకుంటా .ఇస్తావా ! అన్నాడు రాజుగారు.
" భలేవారే ! అర చేయి లేక పోతే ఎలా ! " అన్నాడు బిచ్చగాడు.
" సరే ! నీ కుడి కాలు మోకాలి వరకు కోసుకుంటావా...ఒక లక్ష వరహాలు ఇస్తాను..ఇస్తావా ! " అన్నాడు.రాజుగారు.
" ఎంత మాట ! ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో ! ఇవ్వను ! "అన్నాడు బిచ్చగాడు.
" అన్నింటినీ కాదంటున్నావు. ఆఖరిగా అడుగుతున్నా..పది లక్ష ల వరహాలు ఇస్తాను..నీ నాలుక కోసుకుంటా ..ఇస్తావా! అన్నాడు రాజుగారు.
" అమ్మో! మీరు నా జీవితాన్ని ఆడిగేస్తున్నారు. ఇవి లేకపోతే
నేను ఎలా జీవించను ?? అన్నాడు బిచ్చగాడు.
" ఓహో ! అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట !! నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి, లక్ష రూపాయిల కన్నా విలువైన కాళ్ళు, పది లక్షల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయా ?? మరి ఇంత విలువైన శరీరాన్ని
నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా
నిందిస్తావా !! ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో ! అందరూ అదే చేస్తున్నారు...పో ఇక్కడనుండి.!
అన్నాడు రాజుగారు.
Channel name was changed to «Devotional»
సింహాచలం ....... చందనోత్సవం
శ్రీ వరాహ నారసింహ స్వామి "ప్రహ్లాద వరదుదు కేవలం ప్రహ్లాదునీ రక్షించి ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం" అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహనృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలసి వున్నాడు శ్రీ లక్ష్మి వరాహ నారసింహుడు. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయగా చెప్పబడి స్వామికి సంవత్సర కాలంగా వున్న చందనపు పూతనంతటిని జాగ్రత్తగా వేరుచేసి, యధావిదిగా అర్చనాదులన్నింటిని జరుపి కొన్ని గంటలు మాత్రమే నిజ రూప దర్శనం భక్తులకు కల్పించడం ఆనాటి ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచో చందనం మొక్కుకొని కోర్కెలు తీర్చుకున్న భక్తులు రావడం, చందనం సమర్పించడం, స్వామి శరీరం నుండీ తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత.
శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం
వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం ||
అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ. అదే అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవము. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలములిస్తాయి. ఈ అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలదము.
సింహాచలము ... ప్రహల్లాదుడు
కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. మహా శివ భక్తుడైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహల్లాదుడు. ప్రహల్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. రాక్షస రాజులన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు మదబల గర్వితులై ముల్లోకాలను గడ గడ లాడించిన పరమ క్రూరులు. హిరణ్యాక్షుడు ఒకానొక సమయమున భూదేవిని చెరబట్టి చాప చుట్టునట్లు చుట్టి తీసుకవెల్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు శ్రీ వరాహావతారమెత్తి శిక్షించాడు. తమ్ముడైన హిరణ్యాక్షుడిని చంపిన శ్రీహరిపై తీవ్ర కక్షవహించి తనను మించిన అజేయుడు ముల్లోకముల్లోను ఉండరాదు, తనకు చావు రాకూడదు, తానూ వృద్ధుడు కారాదు అనే కోరికల సాధనకు హిరణ్యకశిపుడు మంద పర్వతమునకు వెళ్లి అచ్చట ఒంటికాలి బొటన వ్రేలిపై నిలబడి బ్రహ్మను గురించి తీవ్ర తపమాచరించాడు. అతని ఘోరతపస్సుకు ముల్లోకాలు దద్దరిల్లిపోయినాయి. సెగలు పోగలుగా లోకాలన్నిట వ్యాపించి జీవులను వణికించింది దేవతలు ఆలోచించారు. బ్రహ్మ హిరణ్యకశిపుని వద్దకు వచ్చారు.నాయనా హిరణ్యకశిపా లే, నీకే వరం కావాలో కోరుకో... నీ శరీరమంతా పురుగులు తినివస్తున్నాయి, ఎందుకింత కటిన తపస్సు అంటూ లేపాడు. లేచిన హిరణ్యకశిపుడు దేవదేవా, జగత్పితా, వచ్చావా, రా, నాకేం కావాలో అడుగుతాను విను నీవు సృష్టించి జీవరాసులలో దేని వలన నాకు చావు రాకూడదు. రాత్రిగానీ, పగలు కానీ, భూమిపైన గానీ, ఆకసమునగాని, బైటకానీ, ప్రాణమున్న ఆయుధముతోకానీ, ప్రనములేని ఆయుధముతోకాని నాకు చావురాకూడదు. సకల సంపదలూ, సకల గ్రహరాసులు నా ఆధీనములో వుండాలి. నాకెదురు వుండకూడదు. ఇవీ నా కోరికలు అన్నాడు. అది విన్నాడు బ్రహ్మ. సరే ఇచ్చాను పో అన్నాడు. విజయగర్వంతో వెళ్ళాడు రాక్షస రాజు .
హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడితో ఏదైనా ఉపాయం ఆలోచించి అతని తపస్సు భంగం చెయ్యమని ప్రాధేయపడ్డాడు. ఎంత ప్రయత్నిచిన అతని తపస్సు భంగంకాలేదు. ఇంద్రుడి దివ్య దృష్టితో హిరణ్య కశిపుని భార్య లీలావతి గర్భిణి అని గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అయి కూర్చుంటే, ఇంకా అతనికి కుమారుడు కలిగితే అపుడు ఇద్దరు రాక్షసులు చేరి దేవతలను ఇంకా హింసిస్తారని, అంతేకాక తన సింహాసనానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందనుకొని, మాయా రూపములో లీలావతి దగ్గరకు చేరి ఆమెను చేపెట్టి తనలోకానికి తీసుకొని పోతుండగా, దారిలో నారద మహర్షి కనిపించి ఓయీ ఇంద్రుడా నీవు చేస్తున్న పని ఏమి?, ఈ గర్భిణి స్త్రీ చెరబెట్టి తీసుకుపోతావా?, ఇంతనీచానికి దిగాజారుతావని నేననుకోలేదు. అని గద్దిస్తాడు, అప్పుడు ఇంద్రుడు తాను దురుద్దేశ్యంతో అలా చెయ్యడం లేదని దేవతల సంక్షేమానికి చెయ్యాల్సి వస్తుందని తెలిపాడు. అప్పుడు నారద మహర్షి అసలు విషయం తెలుపుతాడు, ఆమె గర్భలో ఉన్నది రాక్షసుడు కాదు ఒక గొప్ప హరి భక్తుడు, నీవు చింతించకు, ఆమెను నేను ఆశ్రమానికి తీసుకొని వెళతాను అని తన వెంట ఆమెను తీసుకొని వెళతాడు. ఆ తరువాత లీలావతి కుమారున్ని కనడం, హిరణ్యకశిపుడు రావడం జరిగిపోయినది.బాలుడు ప్రహల్లాదుడు అను పేర దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న కాలంలో హిరణ్యకశిపునికి సరిగ్గా ఆ సమయములోనే ప్రహల్లాదుని పరిస్థితి అర్ధం అయ్యింది. సరిదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఏమీ పనిచెయ్యలేదు. ఇక లాభంలేదనుకొని దండన ప్రారంభించాడు కొట్టించాడు. తిట్టించాడు, ఎన్నో చేసి విసిగి హరిభక్తి మానని కుమారుని సముద్రంలో పడవేయించి, పైకి లేవకుండా పర్వతాన్ని అతని పైకి వేయించాడు. శ్రీహరి వచ్చి తన భక్తుణ్ణి రక్షించుకున్నాడు.
ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆపైన వేసిన పర్వతమే సింహాచలము హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరస
ింహావతారం. ప్రహల్లాదుని కోరికమేరకు పిన తండ్రిని చంపిన వరహామూర్తి, తండ్రిని చంపిన నరసింహ అవతారం హిరణ్యకశిపుని వధించాక లక్ష్మీదేవితో కలిసి నేను ప్రహల్లాడునితో పూజలందుకుంటూ సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటాను అన్నాడు స్వామి.

స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని ( తెల్ల ) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, నెలలో దాగివున్నపాదాలు, ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తీసివేయగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. మళ్ళీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, చందన లేపనం తరువాత స్వామీ శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. ప్రసాదంగా స్వామీ నుంచీ తీసిన గంధం, అనగా చందనం ప్రసాదం ముఖాన పెట్టుకొని కొంత నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గుతాయని నమ్మకం.
దేవాలయంలో ఇంకెవరికీ నమస్కరించకూడదు

దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత, ఆ దైవాన్ని పూజించిన తర్వాత ఆ దైవానికన్నా శక్తివంతులు ఆ ఆలయంలో ఇంకెవరూ దర్శనీయులుగానీ, పూజనీయులుగానీ వుండరు. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ,దేవాలయాల్లోకూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా అన్నివిధాలా చిన్నవారే.అందుకనే దైవం ముందు మానవులకు నమస్కరించటం ఇరువురికీ మంచిదికాదు. మరి ఎలాగండీ తెలిసినవారు కనిపిస్తే పలకరించవద్దా అంటారా?పలకరింపులకు అనేక మార్గాలున్నాయి…చేతులు జోడించి నమస్కారమే కాదు.

కొందరు అక్కడవున్న అర్చకులపాదాలకు నమస్కరిస్తారు. అదికూడా మంచి పధ్ధతికాదు. నమస్కరించినవారు దైవంకన్నామానవులకు ఎక్కువ గౌరవాన్నిచ్చినట్లు..అలా చేయటంవల్ల వారికి పాపం. నమస్కారం అందుకున్నవారుకూడా దైవంకన్నా తాము అధికులమని అహంకరించినట్లు..వారికీ మంచిది కాదు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఎవరికైనా నమస్కరించాల్సివస్తే అక్కడవున్న దైవం పేరు చెప్పి నమస్కరించాలి. అంటే ఆ నమస్కారం ఆ దైవానికే చెందుతుంది.

ఆలయాల్లోనేకాదు, కొన్ని ప్రధాన ఆలయాలున్న కొండలమీదకూడా…అంటే తిరుపతి, శ్రీశైలం లాంటి ఆధ్యాత్మికంగా మహోన్నతమైన ఆలయాలున్న కొండలమీద ఆ ఆలయాల్లోనే కాదు, ఆ కొండలమీదకూడా ఎవరికీ నమస్కరించకూడదు.అక్కడి దైవం పేరుచెప్పి నమస్కరించాలి..అంటే వారిలోకూడా ఆ స్వామినే చూసి ఆ స్వామికి నమస్కరించినట్లు.

https://t.me/devotional
దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళాలా

చాలామందికి దేవాలయానికి వెళ్ళాలంటే అదో పెద్ద పనిష్ మెంట్ కింద అనుకుంటారు. మనసులో దేవుడంటే భక్తి వున్నా, నమ్మకం వున్నా, దేవాలయానికి వెళ్ళటమంటే అదో పెద్ద పనిగా బధ్ధకిస్తారు. పైగా దేవుడు మనలోనే వున్నాడు, మనింట్లోనూ వున్నాడు, ఎక్కడపడితే అక్కడ వున్నాడు..మళ్ళీ గుడిదాకా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలా అని వాదిస్తారు. అలాంటివారికి ఒక్కటే సమాధానం. దేవాలయానికి వెళ్ళటంవల్ల అనేక ఉపయోగాలు వున్నాయి. అందుకని తప్పనిసరిగా వెళ్ళాలి. మీకు ఆలయాలంటే ఇంటరెస్టు ఎక్కువ, అందుకే అలా చెబుతారంటున్నారా? నాకే కాదు దేవాలయానికి వెళ్ళటంవల్ల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకీ వచ్చే లాభాలేమిటో చెబుతాను.


దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట సమయంలో కొన్ని యంత్రాలనుకూడా స్ధాపిస్తారు. వాటికీ, రోజూ పూజలందుకునే భగవంతుడికీ కొంత శక్తి వుంటుంది. మనం దైవ దర్శనం చేసుకున్నప్పుడు ఆ శక్తి మనకందుతుంది. (బయటకొచ్చి కండలు చూసుకోకండి ఎంత పెరిగాయో ఆ శక్తితో అని..). ఇంక అభయముద్రతో వున్న దైవ స్వరూపాన్ని చూసేసరికి మానసిక ప్రశాంతత ఏర్పడి, మన జీవిత బాటలో మనల్ని ఆదుకునేవారున్నారు అనే నమ్మకం, తద్వారా మనో బలం లభిస్తాయి. ఆధ్యాత్మకి ప్రశాంతత లభిస్తుంది. ఆలయంలో పైన వుండే కలశంద్వారా ప్రాణ శక్తి ఆ ఆవరణనీ, అందులోకి వెళ్ళినవారినీ ఉత్తేజ భరితుల్ని చేస్తుంది. ఈ విధంగా రకరకాల శక్తుల ప్రభావం అక్కడికెళ్ళినవారిమీద పడటంతో వారిలోని అనేక పాపాలు, దోషాలు పరిహరింపబడతాయి.


కొత్త ప్రదేశాలలో ఆలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ చారిత్రాత్మక విషయాలు, పురాణగాధలు, అంతకుముందు అక్కడ నివసించిన మహనీయులు, అక్కడివారి ఆచార వ్యవహారాలు, శిల్ప కళలో వైవిధ్యాలు, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇంట్లోనే వుంటే కూపస్ధ మండూకంలా ఒక పరిధిలోనే వుంటాయి మన ఆలోచనలు వగైరా.


ఇలా, ఏ విధంగా చూసినా ఆలయ దర్శనం వల్ల ఎవరికైనా ఉపయోగమే.

https://t.me/devotional
ఇంట్లో దేవుడి విగ్రహాలు ఏ విదంగా కడగాలి ?


చాలామంది దేవుడి విగ్రహాలను ఇంట్లో పాత్రలు శుభ్రపరచుకునే సబ్బుతోనో, డిటర్జెంట్ పౌడర్ తోనో తోముతుంటారు. నిత్యం అభిషేకం చేసేవాటిని తోమక్కరలేకపోయినా, వెండి, రాగి మొదలగు కొన్ని లోహాలు తేమ గాలికి నల్లబడి, మెరుపు తగ్గుతాయి. అందుకని వాటిని తోమి శుభ్రపరచటం అవసరం.


అయితే విగ్రహాలకు మనం ప్రాణ ప్రతిష్టచేసి, అర్చన చేసి, నైవేద్యం పెడతాం. భగవంతుని శక్తి వాటిలో వుంటుంది. మరి వాటిని ఎలా పడితే అలా తోమెయ్యకూడదుకదా. మరెలా చెయ్యాలంటే ఆలయాల దగ్గర విభూతి వుండలు అమ్ముతూ వుంటారు. అవి తెచ్చి వాటితో వెండి విగ్రహాలను అతి సున్నితంగా పసి పిల్లలకు స్నానం చేయిస్తున్నట్లు జాగ్రత్తగా తోమాలి. అలాగే రాగివాటిని శనగపిండిలో పెరుగు వేసి దానితో తోమాలి. చింతపండు, నిమ్మకాయ వాడితే మరు రోజుకి నల్లబడతాయి. దేవుళ్ళ విగ్రహాలను సబ్బులు, యాసిడ్లు, డిటర్జంట్లతోకాకుండా పైన చెప్పిన విధంగా పసి పిల్లలకి స్నానం చేయిస్తున్నంత సున్నితంగా శుభ్రం చెయ్యాలి. అవి భగవత్ స్వరూపాలు మరి.

https://t.me/devotional