Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
నేడు చక్కని సంతానాన్నిచ్చే గరుడ పంచమి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉


కశ్యప ప్రజాపతికి వినత .. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి ... 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.

శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్పభయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే ' గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.

సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా ... లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది.

అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన ... ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.

#Garuda #Panchami
జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్రివిష్ణు సహస్ర నామ పారాయణం

( జన్మ నక్షత్ర పాదమును బట్టి శ్లోకము పైన తెలిపిన ప్రకారము ఆ శ్లోకమును 108 సార్లు పారాయణము చేయవలెను)

హరిః ఓమ్..

అశ్వని 1వ పాదం
విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః 01
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

అశ్వని 2వ పాదం
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ
అశ్వని 3వ పాదం
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
అశ్వని 4వ పాదం
సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః 04
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః
భరణి 1వ పాదం
స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః05
అనాదినిదనో ధాతా విధాతా ధాతు రుత్తమః
భరణి 2వ పాదం
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః 06
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవి రో ధ్రువః
భరణి 3వ పాదం
అగ్రాహ్య శ్వాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 07
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్
భరణి 4వ పాదం
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః 08
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః
కృత్తిక 1వ పాదం
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 09
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్
కృత్తిక 2వ పాదం
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః
కృత్తిక 3వ పాదం
అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః 11
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః
కృత్తిక 4వ పాదం
వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమిత స్సమః 12
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః
రోహిణి 1వ పాదం
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః 13
అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః
రోహిణి 2వ పాదం
సర్వగ స్సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః 14
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః
రోహిణి 3వ పాదం
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 15
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః
రోహిణి 4వ పాదం
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 16
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః
మృగశిర 1వ పాదం
ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః 17
అతీంద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః
మృగశిర 2వ పాదం
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః 18
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబ లః
మృగశిర 3వ పాదం
మహాబుద్ది ర్మహావీర్యో మహాశక్త ర్మహాద్యుతిః 19
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్
మృగశిర 4వ పాదం
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః 20
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః
ఆరుద్ర 1వ పాదం
మరీచి ర్దమనో హంసః సుపర్ణో భజగోత్తమః 21
హిరణ్యనాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః
ఆరుద్ర 2వ పాదం
అమృత్యు స్సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిర ? 22
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా
ఆరుద్ర 3వ పాదం
గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః 23
నిమిషో నిమష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః
ఆరుద్ర 4వ పాదం
అగ్రణీ ర్గ్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః 24
సహస్రముర్దా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్స్రపాత్
పునర్వసు 1వ పాదం
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః 25
అహ స్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః
పునర్వసు 2వ పాదం
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృడ్ విశ్వభుగ్ విభుః 26
సత్కర్తా సత్కృత స్సాధుః జహ్ను ర్నారాయణో నరః
పునర్వసు 3వ పాదం
అసం ఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృ చ్ఛుచిః 27
సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిర స్సిద్ధిసాధనః
పునర్వసు 4వ పాదం
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదదః 28
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః
పుష్యమి 1వ పాదం
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః 29
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశ నః
పుష్యమి 2వ పాదం
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః 30
బుుద్ధ స్స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః
పుష్యమి 3వ పాదం
అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః 31
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః
పుష్యమి 4వ పాదం
భూతభవ్య భవన్నాథః పవనః పావనోనలః 32
కామహా కామకృత్ కాన్తః కామః కామప్రదః ప్రభుః
ఆశ్లేష 1వ పాదం
యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః 33
అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనన్తజిత్
ఆశ్లేష 2వ పాదం
ఇష్టో విశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః 34
క్రోధహః క్రోధకృత్ కర్తా విశ్వబాహు ర్మహీధరః
ఆశ్లేష 3వ పాదం
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః 35
అపాంనిధి రధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః
ఆశ్లేష 4వ పాదం
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః 36
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవ: పురన్దరః
మఖ 1వ పాదం
అశోక స్తారణ స్తారః శూర శ్శౌరి ర్జనేశ్వరః 37
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః
మఖ 2వ పాదం
పద్మనాభో రవిందాక్షః పద్మగర్భ శ్శరీరభృత్ 38
మహర్ధి బుుద్దో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః
మఖ 3వ పాదం
అతుల శ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః 39
సర్వ లక్షణ లక్షణ్యో
లక్ష్మీవాన్ సమితింజయః
మఖ 4వ పాదం
విక్షరో రోహితో మార్గో హేదు ర్దామోదర స్సహః 40
మహీధరో మహాభాగో వేగవా నమితాశనః
పుబ్బ 1వ పాదం
ఉద్భవ: క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః 41
కరణం కారణం కర్తా వికర్త గహనో గుహః
పుబ్బ 2వ పాదం
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః 42
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్ట శ్శుభేక్షణః
పుబ్బ 3వ పాదం
రామో విరామో విరతోమార్గో నేయో నయో నయః 43
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవి దుత్తమః
పుబ్బ 4వ పాదం
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః 44
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః
ఉత్తర 1వ పాదం
బుుతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః 45
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ :
ఉత్తర 2వ పాదం
విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ 46
అర్థో నర్థో మహాకోశో మహా భోగో మహాధనః
ఉత్తర 3వ పాదం
అనిర్విణ్ణ స్థ్సవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః 47
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామ స్సమీహనః
ఉత్తర 4వ పాదం
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః 48
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్
హస్త 1వ పాదం
సువ్రత స్సుముఖ స్సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్49
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః
హస్త 2వ పాదం
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ 50
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః
హస్త 3వ పాదం
ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదసక్షర మస్తక్షరమ్ 51
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః
హస్త 4వ పాదం
గభస్తినేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః 52
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్ గురుః
చిత్త 1వ పాదం
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః 53
శరీరభూతభృ ద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః
చిత్త 2వ పాదం
సోమపో మృతప స్సోమః పురుజిత్ పురుసత్తమః 54
వినయో జయ స్సత్యసంధో దాశార్హ స్సాత్వతాంపతిః
Continued .....

చిత్త 3వ పాదం
జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః 55
అంభో నిధి రనంతాత్మా మహోదధిశయోంతకః
చిత్త 4వ పాదం
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోద నః 56
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః
స్వాతి 1వ పాదం
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః 57
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్
స్వాతి 2వ పాదం
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ 58
గుహ్యో గ భీరో గహనో గుప్త శ్చక్ర గదాధరః
స్వాతి 3వ పాదం
వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢ స్సంకర్షణో చ్యుతః 59
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః
స్వాతి 4వ పాదం
భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః 60
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః
విశాఖ 1వ పాదం
సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః 61
దివిస్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః
విశాఖ 2వ పాదం
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ 62
సన్న్యాసకృ చ్ఛమ శ్శాంతో నిష్ఠాశాంతిః పరాయణః
విశాఖ 3వ పాదం
శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః 63
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః
విశాఖ 4వ పాదం
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః 64
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః
అనురాధ 1వ పాదం
శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః 65
శ్రీధర శ్శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః
అనురాధ 2వ పాదం
స్వక్ష స్స్వం గ శ్శతానందో నంది ర్జ్యోతి ర్గణేశ్వరః 66
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః
అనురాధ 3వ పాదం
ఉదీర్ణ స్సర్వతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్థిరః 67
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః
అనురాధ 4వ పాదం
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః 68
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః
జ్యేష్ఠ 1వ పాదం
కాలనేమి నిహావీర శౌరిః శూర శ్శూరజనేశ్వరః 69
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః
జ్యేష్ఠ 2వ పాదం
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః 70
అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరో నంతో ధనంజయః
జ్యేష్ఠ 3వ పాదం
బ్ర హ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః 71
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః
జ్యేష్ఠ 4వ పాదం
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః 72
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః
మూల 1వ పాదం
స్తవ్య స్త్సవప్రియ స్త్సోత్రం స్తుత స్త్సోతా రణప్రియః 73
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః
మూల 2వ పాదం
మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః 74
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః
మూల 3వ పాదం
సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః 75
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః
మూల 4వ పాదం
భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః 76
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః
పూర్వాషాడ 1వ పాదం
విశ్వమూర్తి ర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ 77
అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తి శ్శతాననః
పూర్వాషాడ 2వ పాదం
ఏకో నైక స్స వః కః కిం యత్తత్పద మనుత్తమమ్ 78
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః
పూర్వాషాడ 3వ పాదం
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చంద నాంగదీ 79
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః
పూర్వాషాడ 5వ పాదం
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ 80
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః
ఉత్తరాషాడ 1వ పాదం
తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః 81
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః
ఉత్తరాషాడ 2వ పాదం
చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః 82
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్
ఉత్తరాషాడ 3వ పాదం
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః 83
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా
ఉత్తరాషాడ 4వ పాదం
శుభాంగో లోకసారంగః సుతన్తు స్తనువర్ధనః 84
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః
శ్రవణం 1వ పాదం
ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః 85
అర్కో వాజసని శ్శృంగీ జయంతః సర్వవిజ్జయీ
శ్రవణం 2వ పాదం
సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః 86
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః
శ్రవణం 3వ పాదం
కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో నిలః 87
అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః
శ్రవణం 4వ పాదం
సులభ ససువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః 88
న్యుగ్రోధోదుమ్బరో శ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః
ధనిష్ట 1వ పాదం
సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః 89
అమూర్తి రనఘో చింత్యో భయకృత భయనాశనః
ధనిష్ట 2వ పాదం
అణుర్ బృహత్ కృశః స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్90
అధృత స్స్వదృత స్స్వాస్థ్య: ప్రాగ్వంశో వంశ వర్ధనః
ధనిష్ట 3వ పాదం
భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః 91
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః
ధనిష్ట 4వ పాదం
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః 92
అపరాజిత స్సర్వసహో నియంతా నియమో యమః
శతభిషం 1వ పాదం
సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః 93
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః
శతభిషం 2వ పాదం
విహాయసగతి ర్జ్యోతిః సురచి ర్హుతభు గ్విభుః 94
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః
శతభిషం 3వ పాదం
అనంత హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః
95
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః
శతభిషం 4వ పాదం
సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః 96
స్వస్తిద స్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః
పూర్వాభాద్ర 1వ పాదం
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః 97
శబ్ధాతిగ శ్శబ్ద సహః శిశిర శ్శర్వరీకరః
పూర్వాభాద్ర 2వ పాదం
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః 98
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః
పూర్వాభాద్ర 3వ పాదం
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః 99
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః
పూర్వాభాద్ర 4వ పాదం
అనంత రూపో నంతశ్రీః జితమన్యు ర్భయాపహః 100
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః
ఉత్తరాభాద్ర 1వ పాదం
అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 101
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః
ఉత్తరాభాద్ర 2వ పాదం
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 102
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణ :
ఉత్తరాభాద్ర 3వ పాదం
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణ జీవనః 103
తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మమృత్యు జరాతిగః
ఉత్తరాభాద్ర 4వ పాదం
భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః 104
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః
రేవతి 1వ పాదం
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః 105
యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ
రేవతి 2వ పాదం
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః 106
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః
రేవతి 3వ పాదం
శంఖభృత్ నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః 107
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః
(శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి)
రేవతి 4వ పాదం
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ| 108
శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
(పై శ్లోకములు రెండింటిని రెండుమార్లు చ‌దువ‌లెను)
శయన నియమాలు
పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:

1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు.
దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.
(మనుస్మృతి)

2. పడుకుని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.
(విష్ణుస్మృతి)

3. విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.
(చాణక్య నీతి)

4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.
(దేవీ భాగవతము)
పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.
(పద్మ పురాణము)

5. తడి పాదము లతో నిద్రించవద్దు.
పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి(ధనం)ప్రాప్తిస్తుంది.
(అత్రి స్మృతి)
విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం.
(మహాభారతం)

6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.
(గౌతమ ధర్మ సూత్రం)

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది.
(ఆచార మయూఖ్)

8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు.
కానీ జ్యేష్ఠ మాసం లో
1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.
(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.
(బ్రహ్మా వైవర్తపురాణం)

10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు గంటల) తరువాతనే పడుకోవాలి

11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.

12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు.
యముడు మరియు దుష్ట గ్రహము ల నివాసము ఉంటారు.
దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది.
మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా
అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

13. గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.

15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది)

16. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం అశుభం కావున పడుకొనే ముందు తీసివేయండి.

ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు.

#sleeping #rules #Sleep
#Tags can be used anywhere in Search bar of telegram

When you use #Sleeping #Sleep in Search bar, the above articles comes less than 2 seconds,
శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే...
చాలా సంవత్సరాల క్రితం కాంచీవరం లో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండే వాడు. అతను బంగారు నగలు తయారు చెయ్యడంలో నిపుణుడు.‌‌

అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్లు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా, నడుముకి ధరించే, వడ్డాణం అతను చేస్తే చాలా బాగా అమరేది.‌ అతను చేసినంత బాగా నడుముకి పెట్టుకొనే నగ చేయడం ఇంకెవరి వల్లనా అయేది కాదు. దానివల్ల అందరూ‌ అతని చేతే నగలు చేయించుకోవాలని ఉబలాటపడేవారు.

స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగు ఉండేది కాదు. ‌ కానీ అతను అపర శివ భక్తుడు.‌‌విష్ణువు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు.‌

దాని వలన‌ అతను కేవలం శివ భక్తులకి మాత్రమే నగలు చేసేవాడు. అదీ కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోడం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన‌ అతను ధనార్జన గురించిగానీ, రాజాశ్రయం గురించి గానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు.

ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహా విష్ణుకి ఆలయం కట్టించాలని‌ కోరిక కలిగింది. ఆమె తనకి స్వామి కలలో కనపడి కోవెల కట్టమని ఆదేశించినట్టు చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణ కారులు తయారు చేసేసారు. అయితే, స్వామి వారి నడుముకి పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదర లేదు.

మహారాణీకి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకి శివయ్య గురించి చెప్పీ తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకి పెట్టే నగలు తెప్పించి రాణీ గారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహా రాణీ మైమరచిపోయింది. శివయ్య చేత స్వామి వారి‌ నగ చేయించాలని వెంటనే నిర్ణయించి, శివయ్య ని పిలిపించింది.

ఈ విషయం‌ తెలీని శివయ్య, రాణీగారి వద్దకు వచ్చేడు.‌ రాణీగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుని‌ తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పేడు. మహా రాణీ కి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చెయ్యడు? అన్న పంతం వచ్చింది.‌

అక్కడ శివయ్య గురించి‌ తెలిసిన వారు జోక్యం చేసుకొని శివయ్య తో ఇలా చెప్పేరు.

" శివయ్యా! ఇది మహారాజుతో వ్యవహారం.‌ ఈ ఒక్కసారికీ, ఈ నగ చేసీ! లేకుంటే, అనవసరంగా, శిక్షకి గురి కావలసి ఉంటుంది. " అయితే శివయ్య, నేను విష్ణు ఆలయంలోకి వెళ్లను కదా! కొలతలు లేకుండా నగ ఎలా చెయ్యాలి? అని అడిగేడు.

దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు ఇస్తాము. నువ్వు దాని ప్రకారం, నగ చేసెయ్యి, చాలు అని స్వామి వారి నడుము కొలతలు తీసి శివయ్య కి అంద జేసారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకి తన ఊరు వెళ్లడానికి అనుమతి ఇమ్మని అడిగేడు.

రాణీ ఆలయ పెద్దలతో, ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తెడు చిన్నది అయింది.

మళ్లీ మహా రాణి శివయ్య ని నగ సరి చేసి ఇమ్మంది.‌ శివయ్య చేసి ఇచ్చేడు. మళ్లీ అలాగే చిన్నది అయింది. ఇలా‌‌ మూడు సార్లు జరిగే సరికి శివయ్యే ఆశ్చర్య పోయేడు. కొలత సరిగా ఇవ్వటం లేదేమొ అందుకే సరిగా అమరటం లేదేమో అని అన్నాడు.‌‌మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది.

కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా! దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పేడు. ." నువ్వు కళ్లకి గంతలు కట్డుకొని రా! మేము నీకు సాయం చేస్తాం" అన్నారు శివయ్యకి ఇష్టం లేక పోయినా, ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదాని, కళ్లకి గంతలు కట్టుకొని గుడికి బయలుదేరేడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది.

గుడిలో శివయ్య స్వామి వారి నడుము చుట్టూ కొల తీసిందికి చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివ లింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కి పడి, ఇదేమిటి? ఇది శివాలయమా! అనుకుంటూ కళ్ల గంతలు తీసేసాడు.

ఎదురుగా విష్ణు విగ్రహం. చటక్కున కళ్లు మూసుకొని మళ్లా కొలతలకని నడుముని తాకేసరికి, ఈసారి చేతికి నెలవంక, నాగుపాము తగిలేయి. మళ్లీ ఆశ్చర్యంతో కళ్లు తెరిచి చూసేసరికి శ్రీ మహా విష్ణువే! మళ్లీ కళ్లు మూసుకొని కొలత తియ్యబోతే అర్ధ నారీశ్వరం లా తోచింది. కళ్లు తెరిస్తే మహా విష్షు కళ్లు మూస్తే శివుడూ లా గోచరిస్తూ ఉండేసరికి శివయ్య కే కనువిప్పు అయింది.‌

వెంటనే చెంపలు వాయించుకుంటూ
" స్వామీ ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించేవా! శివ కేశవులు ఒకరే అన్న గొప్ప నిజం తెలిసినా, అహంకారం చేత విష్ణువు కన్నా, శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసినా, ఈ‌ దీనుడికి అసలు నిజం బోధపడేట్టు రుజువు చేసేవు.‌ఇహ పై నా జీవితం శివ కేశవ సేవకే వినియోగిస్తాను" అని పాదాభిషేకం‌ చేస్తున్న శివయ్య ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ముందుగా మహారాణి తేరుకొని, శివయ్యా! నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే, స్వామి నీద్వారా శివకేశవులు ఒకటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ తెలియజెప్పేరు. ఇహపై ఎవరూ శివ కేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం వేయించుతున్నాను " అని ప్రకటించింది ప్రజలందరూ హర్షం‌ ప్రకటించేరు.

ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో
అలంకరించేసరికి అతికినట్డు సరిపోయింది.

******************************

నీతి: శివ కేశవలనే కాదు. ఏ దేవుళ్ల గురించైనా, కలహాలు తప్పు. పక్క వాళ్ల నమ్మే దైవాన్ని తూలనాడరాదు. పక్క వాళ్లు నమ్మే దైవాన్ని నిలబెట్టేందుకు అందరూ సముఖంగా ఉండాలి. ఒంకొకళ్ల దేవుడి నీ మతాన్నీ ప్రతీ ఒక్కరూ గౌరవించి బతకనిస్తే దేశం నందనవనం‌ కాదూ!

🌸🌸🌸🌸🌸🌸
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శారదా దేశము
➖➖➖✍

మన...
కాశ్మీరు లోని అనేక నగరాల, ప్రదేశాల
మూల నామాలు, ఇప్పటి నామాలు...!

కాశ్మీరు--దీని మూల నామము --శారదాదేశము!
ఇక్కడ ఆచార్య శంకర భగవత్పాదులు శారదాదేవి సమక్షములో పాండిత్యాన్ని ప్రదర్శించి, తల్లి భారతి అనుగ్రహాన్ని పొందిన ప్రదేశము.
ఇక్కడి మూల నివాసులు శారదా భక్తులు, మరియు సంస్కృత పండితులు.
అష్టాదశ శక్తిపీఠాల శ్లోకము లో ఇలాగుంది...

|| వారణ్యస్యమ్ విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ || అని వ్యాఖ్యానము.

నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని ... అని భక్తితో పాడుకుంటాము.

కాశ్మీరము కేవలము హిందువులది. తురుష్క ముష్కరుల దాడిలో లక్షల కాశ్మీర పండితులు తమ స్వస్థానాలను వదలి ప్రాణాలు నిలుపుకొనుటకోసము వలస వెళ్ళారు.

కాశ్మీరుకు పూర్వ వైభవము, ప్రాచుర్యము, సాంస్కృతిక ప్రాధాన్యము వస్తాయనుటలో ఎటువంటి సందేహము లేదు.


ఇంకా కాశ్మీరు లోని పట్టణాల పేర్లు
* *వరాహ మూల* --బారాముల్లా
* *జంబూదేశ* -- జమ్ము
* *కర్ణరాజ పురం* -పీర్ పంజల్
* *సూర్య పుర* --సోపుర్
* *అవంతీ పురం* --పుల్వామా
**జయపురం* - సంబల్

ఒకప్పుడు కాశ్మీరులో ఐదు లక్షలకన్న ఎక్కువ మంది ఉన్న కాశ్మీర పండితులు ఈ నాడు రెండు వేల కన్నా ఎక్కువ లేరు.

కాశ్మీరు మన భారతపు శిరోభాగము.

అక్కడ శారదా సర్వజ్ఞ పీఠము ఉంది. దానికి నాలుగు ద్వారాలు. భారత దేశపు నాలుదిశల జ్ఞానానికి అది సంకేతము. అక్కడ శారద విశ్వవిద్యాలయము ఉండినది.

శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దపు చివర అక్కడికి వెళ్ళి పండితుల వాదములో గెలిచి దక్షిణ దిక్కున ఉన్న ద్వారాన్ని తెరచి దక్షిణ భారత పేరు నిలబెట్టారు.

కాశ్మీరము శైవ సాంప్రదాయ మూలాలు కలిగినది.
ఇక్కడ వుండే వేలాది మందికి తత్త్వ, సిద్ధాంత, ఆధ్యాత్మ, సంగీతము--ఇలాగ వేర్వేరు అంశాల- విచారాల ఆలవాలమై ఉండినది.

హిందూ, బౌద్ధ , శిక్ఖు ధర్మాలు ఇక్కడ ప్రాచుర్యము పొందినాయి. ఇక్కడ శిల్పకళ యొక్క భవ్యమైన పరంపర ఉండినది.
ఇక్కడి లిపి, ’ శారదా లిపి ’. భాష కాశ్మీరీ.

రండి, " శారదా సర్వజ్ఞ పీఠాన్ని " మరలా తెరచి పూజ చేద్దాము.


యతిద్వయం సంకల్పానికి శారదా అనుగ్రహము తోడై శారదా దేశము మనదిగా మారిన ఈ శుభవేళ అందరికీ అభినందనల అభివందనాలు🙏...✍

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సప్తమంగైయర్ స్ధలాలు

సర్వాంగభూషితుడై పరమశివుడు ప్రసాదించే దర్శనాన్ని, ' సర్వేశ్వర దర్శనం' అంటారు.

శిరస్సు న గంగ, చంద్రమౌళి, నుదుటన త్రినేత్రం, కంఠాన నాగాభరణం, చేతను ఢమరుకం, త్రిశూలమును ధరించి, శివపాద దర్శనంతో కూడిన దర్శనమే 'సర్వేశ్వర దర్శనం' అంటారు.

ఈ అలంకారశోభితుడైన పరమేశ్వరుని దర్శించాలని అఖిలాండేశ్వరి అమ్మవారు వాంఛించింది. అమ్మవారి కోరిక తెలుసుకున్న సప్తమాతృకలు, తాము పూజించే స్వయంభూ శైవక్షేత్రాలలో సర్వేశ్వరుని దర్శించ వచ్చని, అఖిలాండేశ్వరిని ఆ ఏడు స్ధలాలకి తీసుకుని వెళ్ళారు. అఖిలాండేశ్వరి ఆ సప్త క్షేత్రాల సర్వేశ్వరుని పూజించి తరించింది .

ఆ ఏడు స్ధలాలు...

1. హరి మంగై,
2. చక్రమంగై,
3. నంది మంగై,
4. శూలమంగై,
5. తాళ మంగై,
6. పశుమంగై,
7. పుళ్ళమంగై,

ఈ స్ధలాలో వెలసిన ఈశ్వరుని...

1. హరి ముక్తీశ్వరుడు,
2. చక్రవాగేశ్వరుడు,
3. జంబుకేశ్వరుడు,
4. కృత్తివాగేశ్వరుడు,
5. చంద్రమౌళీశ్వరుడు,
6. పశుపతీశ్వరుడు,
7. బ్రహ్మపురీశ్వరుడు...

అనే నామాలతో అర్చించి ఆరాధిస్తారు.

ఈ ఏడు పుణ్యక్షేత్రాల
పేర్లు *'మంగై'* అనే పేరు తో పూర్తి అవుతున్నందున, వీటిని
సప్త మంగైయర్ స్ధలాలుగా ప్రసిధ్ధి చెందాయి.

ఈ ఏడు శైవ క్షేత్రాలు తమిళనాడులో కుంభకోణం- తంజై మార్గంలో వున్నాయి.
శ్రీ ఆంజనేయ నవరత్న మాల స్తోత్రం


వాల్మీకి రామాయణమునకు సుందరకాం డ తలమానికము. సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.రత్ననములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామివారికి సమర్పంచబడినది.

ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. శ్లోకము తత్‌సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తె లుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.

మాణిక్యం (సూర్యుడు)
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.

ముత్యం (చంద్రుడు)
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |

స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||

అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.

ప్రవాలం (కుజుడు)
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||

అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.

మరకతం (బుధుడు)
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||

అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.

హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||

అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.

ఇంద్రనీలం (శని)
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||

అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.

గోమేదికం (రాహువు)
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||

అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

వైడూర్యం (కేతువు)
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||

అర్థము : శ త్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.
కాశ్మీరు ఎవరిది ?
👉 *దయచేసి పూర్తిగా చదవండి, మీకుటుంబ సభ్యులకు తెలియచేయండి.*
*(ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి దైవభక్తి, దేశభక్తి చాటండి.)*
[ వాట్సాప్ లో వచ్చిన కన్నడ వ్యాసానికి తెలుగు సేత --ఇది, ’ వింగ్ కమాండర్ సుదర్శన్ ’ గారి రచన]

ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము " మైరా " అనే సంస్కృత పదానికి అర్థము " సరోవరము " అని. ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒక్కరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి, బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ఇచ్చి వివాహము చేస్తాడు.

కశ్యప గోత్రము ఆరంభమయ్యేదే ఇక్కడినుండీ. వీరి సంతానములో , దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు-మొదలుగా సర్వజీవులూ చేరి ఉన్నారు.

నీలమత పురాణము ప్రకారము, ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశములో ’ సతీసరము ’ అనే అతిపెద్ద సరోవరము ఉండినదంట. శివుడు, సతీదేవి--ఇద్దరికీ అది చాలా ఇష్టమైన సరోవరము అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమానముగా ఇచ్చినాడు.

అయితే ఆ సరోవరములో ’ జలోద్భవుడు ’ అనే రాక్షసుడు దాగిఉండి, కశ్యపుడి సంతానానికి వేధింపులు చేసేవాడు. అప్పుడు , కశ్యపుడు, తన కొడుకైన ’ అనంత నాగుడి’ తో కలసి, ఒక వరాహ ముఖము [ ఇప్పటి బారాముల్లా] అనబడు కాలువను తవ్వి, ఆ సరోవరపు నీటిని బయటికి ప్రవహింపజేస్తాడు.

ఈ విధముగా ప్రవహించిన నీరు పశ్చిమములోనున్న మరొక కాలువ కు చేరుతుంది. దానిని కశ్యప సాగరము [ ఈనాటి కాస్పియన్ సముద్రము] అని పిలుస్తారు.

ఆ తరువాత సరోవరమునుండీ బయట పడిన జలోద్భవుడిని విష్ణువు సంహరిస్తాడు.

ఇలాగ నిండుకున్న సరోవరపు ప్రక్కన ’ వేద వ్యాసంగముల కోసము’ విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మిస్తారు. దానిని " కశ్యప మైరా " అని పిలిచేవారు.

అదే కాలక్రమేణా ’ కశ్య మైరా’ అనీ, " కశ్మీర " అనీ నామాంతరము చెందింది.

ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీ దేవి, గణపతి తో పాటు హిమాఛ్చాదితమైన ఒక పర్వత మార్గము ద్వారా తరచు వచ్చేది. దానిని " గౌరీ మార్గ " అని పిలిచేవారు. అదే నేటి గుల్మార్గ్ .

’నీలమతి పురాణము ’ మరియూ దాని ఆధారముగా లిఖింపబడిన " రాజతరంగిణి" --ఇవి, కాశ్మీరపు పౌరాణిక మరియూ ఐతిహాసిక దాఖలాలు.

పన్నెండవ శతాబ్దములో " కల్హణుడు " అనే పండితుడు వ్రాసిన గ్రంధాల శృంఖల , విశ్వములోని అన్ని చోట్లా అత్యంత కుతూహలముతోను, శ్రద్ధాభక్తులతోను అభ్యసించబడుతున్నాయి.

భారత్ లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకొనుట లేదు. ఎందుకంటే , మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే.

కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువులలోనే లేదు. దురదృష్టము...

*ఇది ఎవరి కాశ్మీరము ?*

ఇది శారదాదేవి యొక్క కాశ్మీరము.
|| నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని|
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే ||

ఇలాగ శారదా దేవిని స్తుతి చేసేది ’ కాశ్మీర పురవాసిని’ అనే!.
కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా ?

అది ’ శారదా లిపి ’
అప్పటి కాశ్మీర వేద విద్యాలయాలను ఏమని పిలిచేవారు ? ....
" శారదా పీఠము "

ఇదంతా ఎందుకు ,? ఆనాడు పూర్తి కాశ్మీరాన్నే " శారదా దేశము " అని పిలిచేవారు.

కాకపోతే, శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు ....?

అక్కడి కృష్ణగంగా నది యొక్క తీరములోనున్న శారదాపీఠపు సొగసును చూసి, అదే పద్దతిలో దానిని ప్రతిబింబించేలాగ ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్రా తీరపు శృంగేరి లో స్థాపించుటకు ప్రేరణ దొరికినది ఆ కాశ్మీర శారదాపీఠము వల్లనే!

శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీరు నుండే శృంగేరికి తరలించినారట.

కాశ్మీరానికి తమ కొందరు శిష్యులతోపాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు, ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నారు.

మొదటి దినమే శంకరాచార్యుల పాండిత్యానికి విస్మయము చెందిన ఆ పండిత దంపతులు, వారిని మరికొంతకాలము తమ అతిథిగా ఉండి సత్కారాలను స్వీకరించమని మనవి చేసుకున్నారట.

దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు, ఒక నిబంధన పెడతారు. ఏమనగా, ’ నా వంట నేనే చేసుకుంటాను ’ అని. ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరముగా తోచిననూ, వారిష్ట ప్రకారమే, కావలసిన సంభారములనూ, వంటపాత్రలు, వంట చెరకు లను ఇచ్చి విరమిస్తారు.

అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడము మరచిపోతారు.
మరొకసారి ఆ దంపతులను పిలచి ఇబ్బంది పెట్టరాదని తలచి శంకరాచార్యులు, అలాగే ఆకలితో నకనకలాడుతూనే పడుకుని నిద్రిస్తారు.

మరునాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి మాట్లాడిస్తుండగా, వంట సామగ్రి అంతా అలాగే పడి ఉండుట గమనించి, ’ఎందుకని’ విచారించగా, వారి శిష్యులు, అగ్ని లేని కారణాన శంకరాచార్యులు వంట చేసుకోలేదు-అని సమాధానమునిస్తారు.

తక్షణమే ఆ గృహిణి, అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెలమీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని మండనారంభిస్తాయి.

ఈ ప్రహసనము వల్ల, శంకరాచార్యులకు, తాము ఇంకా చాలా నేర్చుకోవలసినది ఈ శారదా దేశములో ఉంది--అనిపించి, ఇంకొన్ని దినాలు అక్కడే నివశిస్తారు.

వారు నిలచిన ఆ ప్రదేశము--ఒక గుట్ట -ను ఈనాటికీ
శంకరాచార్య గుట్ట అనె పిలుస్తారు. ఆ పేరుతోనే అది ప్రసిద్ధమైనది. అదొక పుణ్యక్షేత్రము అనిపించుకున్నది.

ఇది శ్రీనగరపు నట్ట నడుమ ప్రసిద్ధమైన ’ దాల్ ’ సరోవరపు ప్రక్కనే ఉంది.
ఆనాటి శారదాపీఠము , దురదృష్టవశాత్తూ ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది.

అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు. [ఈ శారదాపీఠపు శిథిల చిత్రాలు ఈ మధ్యనే ఎవరో పోస్ట్ చేశారు.. ఉన్నవారు పంచుకోగలరు ]

ఆ శారదా పీఠము శిథిలమై, దినదినానికీ కుంగిపోవుతున్నది.

" విశిష్టాద్వైతము " అనే సిద్ధాంతము, " నాథ ముని " ద్వారా ప్రారంభమైనది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానిని యమునాచార్యులు విస్తరించినారు.

మరియూ *రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్టులో ప్రతిపాదించి, " శ్రీ భాష్యము " అనె మేరుగ్రంధాన్ని సృష్టించినారు. ఇదే, శ్రీవైష్ణవుల మూలగ్రంధము.* ఇటువంటి మహద్గ్రంధాన్ని సృష్టించుటకే రామానుజులు తమ శిష్యుడైన ’ కురుత్తాళ్వార్ ’ [ ఖురేషీ ] తో కలసి బ్రహ్మసూత్రాన్ని వెదకుతూ కాశ్మీరానికి వెళ్ళినారు. వారికి అప్పటికే అరవై యేళ్ళు!

✍✍👌👌🙏🙏🏻
Copied post
🚩🇮🇳తప్పకుండా చదవండి🇮🇳🚩
నమ్ముతారా..? చంద్రయాన్-2కు వేదగణిత బాటలు వేసింది ఈ స్వామీజీ..!!
చంద్రయాన్-2 ప్రయోగానికి అంతా రెడీ… కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి… తెమలడం లేదు, తేలడం లేదు… లెక్క తెగడమే లేదు… 900 కోట్ల ప్రాజెక్టు… కోట్ల మంది భారతీయుల ఆశలు… ప్రపంచం కన్ను… ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు… ఇస్రో శివన్ కూడా ప్రతిదీ వినే తరహా… దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు… ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు…’ తను ఓ క్షణం విస్తుపోయాడు… ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు… స్వామివారినే శ్రీహరికోటను రమ్మని ఆహ్వానించారు… ఆయన వచ్చాడు… చూశాడు… ఆ లెక్కను చిటికెలో సాల్వ్ చేసేశాడు శంకరాచార్య అలియాస్ నిశ్చలానంద సరస్వతి… ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్… ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది…
అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు… ఉత్త ఫేక్… అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే… కాకపోతే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇలాంటివి పట్టవు… అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్… ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్ 145… ఈయన 143వ శంకరాచార్యుడు భారతకృష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు… ఆయన వేదగణితంలో దిట్ట… ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్ చేసేవాడు… ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు…
ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి… లెక్కలంటే లెక్కలే… ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు… రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి… కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది… ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది… ‘‘ఇందులో వింత ఏమీ లేదు… ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు… వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది… మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి… నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు… 11 పుస్తకాలు రాశాడు తను దీనిపై… చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు… సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు…’’ అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ రత్తా…
నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు… చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు… రెండేళ్ల క్రితం అహ్మదాబాద్ స్పేస్ రీసెర్చ్ స్టేషన్‌కు వెళ్లి… దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు… అహ్మదాబాద్ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్ పాఠాలు కూడా చెప్పాడు… సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి… ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు… ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు… తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు… విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు… అవసరమైన వేళల్లో..!!
వరలక్ష్మీ వ్రతకల్పము
#varalakshmi vratha kalpam
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వరలక్ష్మి వ్రతం:
శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది. శ్రావణ పూర్ణిమ ముందువచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని 'వరలక్ష్మి' పేరుతో అర్చించడం మన సాంప్రదాయం. సర్వవిధ సంపదలను అనుగ్రహించే వ్రతమిది. కలశాన వరలక్ష్మిని ఆవాహనచేసి షోడశోపచారాలతో పూజించడం ఈ వ్రతాచరణ విధి. స్త్రీలందరూ లక్ష్మీమయంగా అలంకరించుకొని అమ్మవారిని అర్చిస్తారు. 

వరలక్ష్మి వ్రత కధ (శ్రావణ శుక్రవారం కధ):
ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము" అని కధ చెప్పెను. 

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో 

లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం| 
దాసీభూత సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం| 
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర గంగాధరాం| 
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం|| 

అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.