Devotional Telugu
3.46K subscribers
106 photos
23 videos
19 files
62 links
An attempt to bring our Hindu Devotional information
Download Telegram
Forwarded from utubebot
Audio
SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM WITH TELUGU MEANING
🙏ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్య శ్రీం
రోజుకు 108 సార్లు
48 రోజులు పటించడం వలన
ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుటే కాక మన శరీరం నందు, మన మున్నా ప్రదేశమందు ఉన్న ఋణావేస శక్తి నిర్ములన జరిగి, ధనవేశ శక్తి ప్రసరింపబడును
ప్రయత్నించి చుడండి🙏
🙏జై శ్రీరామ్🙏
''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్''

అనే మహామృత్యుంజయ మంత్రాన్ని మహాశివరాత్రి రోజున పఠిస్తే అనుకున్న కార్యాలు విజయంవంతంగా పూర్తవుతాయి.

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పునర్జన్మంటూ వుండదు.

మహాశివరాత్రి రోజున ''ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నో రుద్ర: ప్రచోదయాత్'' అనే శివ గాయత్రి నామంతో శివునిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి.

ఈ మంత్ర జపంతో శివుని అనుగ్రహం పొందవచ్చు. ఈ రెండు మంత్రాలను శివరాత్రి రోజున 108 సార్లు జపించినట్లైతే దీర్ఘాయువు, ఆరోగ్యం చేకూరుతుంది. ప్రశాంతత, ఆనందం చేకూరుతుంది. భయం తొలగిపోతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహాశివరాత్రి రోజునే కాకుండా ఓ రోజైనా పగలు లేదా రాత్రి పూట ఈ మంత్ర జపంతో పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.
ప్రతీ మంగళవారం విజయనగరం పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, నివేదన జరుగుతుంది. ఆ ఫోటోలను ఆలయ అధికారుల సహకారంతో కుదిరినంతవరకు ఈ గ్రూపు ద్వారా అందేలా ప్రతి వారం ప్రయత్నం చేస్తున్నాము.
ఇది నేటి అలంకరణ చిత్రం.🙏
Lord Ganesh seen in Vijaya Ganapathi Homam at Vijaya Ganapathi Temple, Dwarakanagar Vishakhapatnam
ఒకరోజు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అపుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశంవైపు చూపి
'ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా "' అని అడిగాడు.

అర్జునుడు " అవును కృష్ణా! అది పావురమే " అన్నాడు.

మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు.

" అబ్బే! అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు "

" అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణా" అన్నాడు అర్జునుడు.

కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళి కాసేపటికి ఇలా అన్నాడు.

" అర్జునా! అది గ్రద్ధ కానేకాదు. అది చిలుక సరిగ్గ చూడు ఒక్కసారి"

" నిజమే కృష్ణా! అది చిలుకనే" అన్నాడు అర్జునుడు.

చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు.

" అయ్యో! అది చిలుక కూడా కానేకాదు. అది కాకి అర్జునా!
ఒక్కసారి పరికించి చూడు"

" అరే! నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణా! అన్నాడు అర్జునుడు.

కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.

" అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా?
సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంత
పాడుతున్నావు " అన్నాడు.

దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు.

" ఓ సర్వాంతర్యామీ! నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను.
నువ్వు ఏదంటే నేనూ అదే! మీరు పావురమే కదా అన్నా రు
నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది.
నాకు అన్నీ మీరే. మీ మాటే నాకు వేదం కృష్ణా!

ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది.

దేవుడిపైన అనుమానం అక్కరలేదు.తనపైన నిజమైన నమ్మకాన్ని
ఉంచండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే
శక్తి ఆ పరమాత్మునికి ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి
తెలుసు. ఎప్పుడు మనకు ఇవ్వాలో మన నుండి ఎప్పుడు తీసుకోవాలో
అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవించు...
🙏🙏🙏🙏🙏🙏