మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.
మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి
ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని
నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది.
నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.
నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.
చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.
మనిషికి నిజమైన అలంకారం అతడి మాటతీరే
మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.
శ్రీరాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.
సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.
ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.
_‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. *తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’* అన్నారు స్వామి వివేకానంద._
ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.
మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.
మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది._
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
_అలాంటివారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు._
మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో అతి మధురమైన పదాలు, మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.
_ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి._
మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది._
_భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది._🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దేవీ నవరాత్రుల విశిష్టత
ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ" గుర్తుకు రావటమే! అమ్మ అంటే మరి ఎవరోకాదు ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో వున్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది.
ఈ సృష్టిలోగల జ్యోతిర్మండలాలు మానవనిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగానూ, పరాశక్తిగానూ, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.
శ్లో!! సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వీయుజమాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈదేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి మూడురోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.
దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గములేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.
ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కోరోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కుష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయనీ
7. కాళరాత్రి
8. మహాగౌరి
9. సిద్ధిధాత్రి
అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవీ "శ్రీకృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోఢశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో
శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!
అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.
అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతోపాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యమూ
గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము.

Audio
పుట్టిన రోజు ఎలా జరుపుకుంటే శుభం కలుగుతుంది How to Celebrate our Birthday by Chaganti Koteswara Rao
*తులసీ ప్రదక్షిణం పాట***
పెద్దవాళ్లు ఒకప్పుడు పాడేవారు.
గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా
ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా !వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా
రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నిండైన సందలు నాకియ్యవమ్మా
మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! ముత్తైదువతనం నాకియ్యవమ్మా
నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నవధాన్య రాసులను నాకియ్యవమ్మా
అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !ఆయువై దోతనం నాక్య్యవమ్మా
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! యమునిచే బాధలు తప్పించవమ్మా
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా
పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా ! పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా
ఎవ్వరు పాడినా ఏకాశి మరణం ! పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం
రామతులసీ , లక్ష్మీ తులసీ ! నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా

ఆధ్యాత్మిక దీప్తి
భగవంతుడి అనుగ్రహాన్ని పొందడమెలా? అష్టోత్తరాలు, సహస్ర నామార్చనలు, పంచామృతాభిషేకాలు, పుష్పాలంకరణలు, షడ్రసోపేతమైన పదార్థాల నివేదనలు- ఇవన్నీ దైవకృప సాధించడానికి ఉపకరిస్తాయని భావిస్తుంటారు. పరమాత్ముడు నిజంగా వీటికే సంతృప్తి చెందుతాడా? దైవభక్తి అంటే ఇదేనా? భక్తుల నుంచి భగవంతుడు ఆశించేదేమిటి, భగవంతుడికి ప్రియమైన భక్తులెవరు? బుద్ధిగతంగా, ఆత్మశుద్ధితో తమను తాము ఉద్ధరించుకుంటూ నిత్య చైతన్య స్వరూపులుగా మసలుకునేవారే దైవానికి ఇష్టమైనవారని గీతాసందేశం.
దయగల హృదయమే పూజామందిరం. కరుణ నిండిన మనసే ప్రేమానురాగాల కలువల కొలను. మానవతా పరిమళాలు గుబాళించాలంటే మదిని మల్లెల తోటగా మలచుకోవాలి. ‘జీవితంలో మధురిమల్ని ఆస్వాదించాలనుకుంటున్నావా? అయితే నీ దృష్టిని ఆధ్యాత్మికత వైపు మళ్లించు. అద్భుతమైన ఫలితాన్ని గమనించు’ అని వివేకానందుడు సూచించారు. జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగిఉంటూ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ జీవించడమే ఆధ్యాత్మికత.
మనసును దైవంతో, వాక్కును ప్రియ సంభాషణలతో, కర్తవ్యాల్ని ధర్మకార్యాలతో మమేకం చేసిన వ్యక్తులే దేవుడి కొలువు కూటమిలో ముందువరసలో ఉంటారని ఆదిశంకరుల ప్రబోధం. ‘నిన్ను నువ్వు తెలుసుకో... తెలివిగా మసలుకో’ ఇదే నా ఉపదేశసారం అని రమణ మహర్షి ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించారు. హృదయంలో అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు, ప్రతికూల ఆలోచనలనే గాఢమైన చీకట్లు ఉంటే పరమాత్మ చూపు మనపై ఎలా ప్రసరిస్తుంది? శరీరాన్ని శుద్ధజలంతో పరిశుభ్రం చేసుకోవచ్ఛు కానీ, అంతరింద్రియమైన మనసును శుభ్రం చేయడమెలా? సత్వగుణాలతో, ఆధ్యాత్మిక చింతనతో, రుజువర్తనతో మనసును నిరంతరం ప్రక్షాళన చేస్తుండాలి. ఆత్మవిద్యలో, సాధుజీవనమనే తపస్సుతో మనసు సదా నిర్మలంగా ఉంటుందని భాగవతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. యోగసాధన, ఆత్మశోధన ద్వారా జీవుడు అమృత స్థితిని సాధించవచ్ఛు ‘అసంపూర్ణత్వం నుంచి పూర్ణత్వం, సంకుచితత్వం నుంచి అనంతత్త్వం, మృత్యువు నుంచి అమృతత్వాన్ని అందుకోవడానికి భౌతిక, ప్రాణిక, మానసిక స్వభావాలతో పరివర్తన జరగాలి’ అనేది అరవిందయోగి సూచించిన దివ్యమార్గం.
ఏ మనసు నిరంతరం జ్ఞానాన్వేషణలో నిమగ్నమవుతుందో, ఏ హృదయంలో హితకరమైన ఆలోచనలు పరిఢవిల్లుతాయో, అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ శుభకరమైన సంకల్పాలు చేస్తారు. మనసు చేసే సంకల్పాలన్నీ కల్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆక్షాంక్షించింది. కపటత్వాన్ని కాదు, కల్మషంలేని మంచి పనులనే భగవంతుడు హర్షిస్తాడు. ప్రపంచానికి ఉపయుక్తమైన రీతిలో జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆధ్యాత్మికత నిర్దేశిస్తుంది. ధైర్యవంతులు నడిచే రాచబాట ఆధ్యాత్మికత.
గడ్డిమొక్క త్వరగా విస్తరించి వేళ్లూనుకుంటుంది. అదే మామిడి మొక్క వృక్షంగా ఎదిగి, మధుర ఫలాల్ని అందించడానికి నియమిత సమయాన్ని తీసుకుంటుంది. సహనమే మన సంస్కృతి. ఆధ్యాత్మికత అభ్యున్నతి సాధించడానికి సహనశీలత అవసరం. నిర్మలభక్తి సాధనకు నిత్యం కృషి చేయాలి. భక్తి, ఆధ్యాత్మికతల వల్ల హృదయ కమలం విస్ఫారితమవుతుంది. ఆ పుష్పాన్ని భగవదర్పితం చేయడమే అసలైన పుష్పార్చన. హృదయంలో ఉప్పొంగే దయామృతాన్ని దీనులపట్ల జాలువార్చడమే దైవానికి అమృతాభిషేకం. సత్కర్మల ద్వారా చేకూరే ఫలితాన్ని దైవానుగ్రహంగా భావించడమే భక్తి నివేదన. జీవితాన్ని వెలుగు తరంగంగా, ఆనందోత్సవంగా మార్చుకోవడానికి ఆధ్యాత్మిక జ్యోతే దారిదీపం!

ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ
సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం
నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గాః ప్రకీర్తితాః
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
త్రిశక్తి స్వరూపిణి.. అష్టాదశభుజ.. అయిన మహాదేవి ఆ దుర్గమ్మ తల్లి నవ దివ్య రూపాలు ఇవి. దక్షిణాదిన జరిపే నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని కనకదుర్గ, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీమహాలక్ష్మి, దుర్గ, మహిషాసుర మర్దిని అలంకారాల్లో పూజిస్తాం. ఉత్తరాదిన జరిపే శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని ఇలా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి రూపాల్లో నవదుర్గలుగా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది నామాలనూ సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పినట్టు పురాణ ప్రతీతి. ఈ శ్లోకాన్ని భక్తిపూర్వకంగా తొమ్మిదిసార్లు పఠిస్తే సకలశుభాలూ కలుగుతాయి. అవతార పురుషుడైన శ్రీరాముడు సైతం.. రావణునితో యుద్ధానికి ముందు ఆ జగన్మాతను పూజించాడు. అజ్ఞాతవాసం విజయవంతం కావాలని పాండవులు వేడుకున్నదీ అమ్మవారినే. శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని శంభరాసురుడు ఎత్తుకుపోతే అతణ్ని కాపాడి కృష్ణుడి వద్దకు చేర్చిన తల్లి ఆ జగదీశ్వరియే. నిరక్షర కుక్షి అయిన పూర్వాశ్రమపు కాళిదాసు.. కాళికాదేవి అపార అనుగ్రహంతో ‘‘మాణిక్యవీణా ముపలాలయంతీం’’ అంటూ ఆదిలోనే అమ్మవారిని కీర్తించి అనేక కావ్యాలు నాటకాలు రచించి ఖ్యాతుడైనాడు. బెంగాల్లో రామకృష్ణుడు.. శ్రీరామకృష్ణ పరమహంసగా పరిణతి చెందినది కాళికా రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి అనుగ్రహం వల్లనే. జగన్మాత దయవల్లనే.. ఆయనచేత ప్రభావితుడైన వివేకానందుడు ఆధ్యాత్మికతను, ఆధునికతను మేళవించి భారతీయ తత్వాన్ని, సంస్కృతిని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఇతర దేశాలకు ప్రబోధించాడు. భద్రకాళిగా అభయప్రదానం చేసే ఆ తల్లి.. దుష్టులు విజృంభించినప్పుడు కపాలం ధరించి ఉగ్రరూపిణిగా దుష్టశిక్షణ చేస్తుంది. అతి క్రూరులైన రక్త బీజుడు, మధుకైటభులు, శుంభనిశుంభులు, చండముండులు.. ఇలా ఎందరో రాక్షసులను సంహరించి లోకహితంగావించింది. ఆ జగన్మాత త్రిమూర్తులకు మూల విరాట్టు అని శ్లాఘింపబడింది. సాక్షాత్తూ విష్ణుమూర్తే ఒక సందర్భంలో ‘ఆ దివ్య శక్తికి మేం స్వాధీనులం’ అని ప్రకటించాడు. ఉగ్రరూపంలోని అమ్మవారిని అష్టోత్తరాలతో, సహస్రనామాలతోనూ.. శాంతి రూపిణిగా శ్రీ లలితా సహస్రనామాలతోను కొలవడం కద్దు. ఎవరు ఎలా పూజించినా.. భక్తుల కోర్కెలను అవ్యాజమైన ప్రేమతో, అపారమైన కరుణతో తీరుస్తున్న ఆ తల్లి.. కోరి కొలిచినవారి కొంగుబంగారం.

మనసు తీరు తెలుసుకో!
మనిషి ఒక్కోసారి ఉన్నది పోగొట్టుకొని బాధపడతాడు. అర్హత లేకపోయినా లేనిదాని కోసం ఆరాటపడి, అహరహం శ్రమించి పని సాఫల్యం చేసుకుంటాడు. కార్యం సఫలం కాకపోతే ఖిన్నుడవుతాడు. నిజానికి తాను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేప్పుడు ఏమి తెచ్చాడని, తాను ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడాలి?!
చిన్న పిల్లలు చూసిన ప్రతిదీ కావాలని మారాం చేస్తారు. ఏమీ తోచనప్పుడు ఏడుపు లంకించుకుంటారు. అప్పుడు వారు ఆడుకొనేందుకు తల్లి ఏదో ఒక ఆట వస్తువును ఇస్తుంది. సహజంగా సగటు మనిషి మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వాన్ని పోలి ఉంటుందంటారు వైజ్ఞానికులు! మనిషి సహజ రీతిలో బాల్యం నుంచి కౌమార, యౌవన దశలకు చేరుకున్నవాడే. పసిబిడ్డలకు కావలసిన ఆట వస్తువులు పెద్దలకు అక్కరలేదు. కొందరు పెద్దలు శిశు మనస్తత్వంతో పెద్దపెద్ద కోరికలే కోరుకుంటారు. భారీ కోరికలు సులభంగా తీరేవి కాదు కాబట్టి మనిషి అసంతృప్తితో జీవించ వలసి వస్తుంది. అలౌకిక ఆనందాన్ని పొందగల జ్ఞానశక్తి, బుద్ధి కుశలత ఉండికూడా మానవుడు దుఃఖితుడై ఆనందానికి దూరం కావడం నిజానికి విచారించవలసిన విషయం!
భయం, కోపం, అసహ్యతా భావం, లోభం, పరవస్తు వ్యామోహం వంటివి రజో గుణ, తమోగుణ ప్రధాన లక్షణాలు! వీటికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రాలు బోధిస్తాయి. సాత్విక గుణ సంపన్నత, సాధించి తీరవలసిన అంశం. సత్వ రజస్తమో గుణ లక్షణాలకు అనుగుణంగా దేహం ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా అనుభవాలు వస్తాయి. అవే సుఖదుఃఖాలు! మనిషి తీవ్రంగా భయపడినప్పుడు రోగలక్షణాలు పొడచూపుతాయి. చిత్తం ప్రశాంతమైనప్పుడు రోగాలు పూర్తిగా అదుపులో ఉంటాయి. భయం విసర్జనీయ లక్షణమని శాస్త్రాలు చెప్పిన అంశాన్ని మానవ దేహం రుజువు చేస్తున్నదా అన్నట్లు ప్రశాంత చిత్తాన్ని సాధించిన సాధకుడు ఆందోళనలు తగ్గి ఆనందభరిత జీవనం చేస్తాడు. భారతీయ తత్వచింతన, శాస్త్ర పరిజ్ఞానం ఒకే బండికి కట్టిన ఎద్దుల్లా సమన్వయం చెంది ముందుకు సాగడం సనాతన ఆధ్యాత్మికవాదులు హర్షించే విషయం!
కల్మషాలు తొలగించిన అనంతరం పరిసరాలు పరిశుభ్రమై ఆహ్లాద భరితమైనట్లు త్రిగుణాల్లోని దోషాలు తొలగిన అనంతరం సాధకుడి చిత్తస్థితి నిర్మలమై అమందానందానుభూతితో ప్రకాశిస్తుంది.
యోగా అధ్యాపకులు అభ్యాస సమయంలో శరీరంలో జరిగే మార్పులను గమనించమని విద్యార్థులకు చెబుతారు. శ్వాస నియంత్రణ భంగిమల వల్ల రక్త ప్రసరణలో ఆరోగ్యానికి మేలు చేసే సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని యోగశాస్త్రం చెబుతుంది.
మనుషులందరూ ఒకే అవయవ అమరిక కలిగిఉన్నా స్వభావరీత్యా వారివి భిన్న మనస్తత్వాలు. కొందరు కలుపుగోలువారు. మరి కొందరు ముభావ స్వభావులు. కొందరు మనసులోని మంచి భావాలను వెల్లడించి తోటివారి మనసులు చూరగొనే అవకాశం వచ్చినా తమ అభిప్రాయాలను పంచుకోరు. సానుకూల మనస్తత్వ శోభితులు ఇంకొందరు, ఎదురుపడినవారిని పలకరించకుండా ముందుకు సాగరు. ఆప్యాయతలను వ్యక్తపరచడం వల్ల బంధాలు బలపడతాయి.
మనసు చంచలమేగానీ అది మాయా మర్మం ఎరగనిది. లోకానికి వెల్లడి కాకపోయినా అది మన నుంచి మనకు బోధపడగల ఏ సత్యాన్నీ దాచదు. మన (ఆత్మ)తీరుకు అనుగుణంగా మనసును మలచుకొని రాజమార్గంలో నడిపిస్తే అది కష్టాలను కొని తేదు. ఇరుకు దారుల్లో దాని పయనం సాగనీయకపోతే మన మనసు వల్ల మనకే కాదు, ఎదుటివారికీ కష్టాల బెడద ఉండదు. జీవితం శుభప్రదమై ఆనందాలు వెల్లివిరుస్తాయి.

విజయదశమి
ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్లపక్షంలో దశమీ తిథినాడు సాయం సంధ్యాకాలంలో ‘విజయం’ అనే పేరు గల ముహూర్తం సంభవిస్తుందని, అది సకలార్థసాధకమని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. మంగళకరమైన ఆ సమయంలో శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) పూజిస్తే జీవితంలో అన్నీ విజయాలే కలుగుతాయని సంప్రదాయం చెబుతోంది. శమీవృక్షాన్నే ఎందుకు పూజించాలనే సందేహానికి శాస్త్రగ్రంథాలు సమాధానం చెప్పాయి. జమ్మిచెట్టు పాపాలను దూరం చేస్తుంది. శత్రువులను తరిమికొడుతుంది. పూర్వం త్రేతాయుగంలో రావణాసురుణ్ని సంహరించే సమయంలో రాముడికి అద్వితీయ శక్తిని ప్రసాదించింది. ద్వాపరయుగంలో అర్జునుడికి దివ్యమైన ధనుర్బాణాలను ప్రసాదించి, యుద్ధంలో విజయుణ్ని చేసింది. ఇలా శమీవృక్షం విజయాలకు కారణం కావడం వల్ల ‘విజయదశమి’ గొప్ప పండుగగా రూపొందింది. ప్రాచీనకాలం నుంచి ప్రజాపాలకులైన రాజులకు విజయయాత్రా ముహూర్తంగా ఈ పవిత్రదినం పూజలను అందుకొంటున్నది. పూర్వం రాజులు వర్షకాలం ముగిసిన తరవాత శరత్కాలం ప్రారంభంలో విజయయాత్రలు చేసేవారు. ఆ శుభముహూర్తమే విజయదశమి.
ఆశ్వీయుజ శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు గల తొమ్మిది దినాలు శక్తిపూజకు ఎంతో ముఖ్యమైనవి. నవరాత్రదీక్షతో తొమ్మిది రోజులు శక్తిని పూజించిన దీక్షాపరులు, విజయదశమినాడు దీక్షను ముగిస్తారు. ముగింపు సూచనగా గ్రామం పొలిమేరలు దాటి వెళ్లి, విజయసంకేతం అయిన పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టును పూజించడం పరిపాటి. పూజించిన జమ్మిఆకులను పవిత్రంగా భావించి, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి వారి శుభాకాంక్షలను, ఆశీస్సులను అందుకొంటారు.
విజయదశమినాడు ప్రకృతిలో ‘అపరాజిత’ అనే శక్తి ఆవహించి ఉంటుందని, ఆ శక్తిని పూజించడం వల్ల పరాజయాలు లేని భావిజీవితం సంప్రాప్తిస్తుందని లోకుల విశ్వాసం. అపరాజితాశక్తి విజయాలను మాత్రమే కాకుండా మోక్షాన్నీ ప్రసాదిస్తుందని స్కాందపురాణం చెబుతోంది.
శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ శుక్లదశమినాడే ‘విజయ’ముహూర్తం సంభవిస్తుందని ఆర్షవాక్కు. ఈ పుణ్యదినం రోజునే పూర్వం దేవదానవులు పాలకడలిని చిలికి, అమృతాన్ని సాధించారని పురాణాల కథనం. అమృతాన్ని సాధించి పెట్టిన దినం కనుక ఇది విజయదశమిగా సార్థకమైంది. అమృతసాధక పుణ్యదినమైంది!
విజయదశమిని ‘దసరా’ అనీ పిలుస్తారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుక ‘దశహరా’ అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో ‘దసరా’ అని వాడుకలోకి వచ్చిందని పెద్దలు అంటారు. దసరా నాడు రావణకుంభకర్ణుల బొమ్మలను కాల్చివేస్తూ ‘రావణదహనం’ అని, ‘రామలీల’ అని పెద్దయెత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే ఈ ఉత్సవాల్లోని పరమార్థంగా కనిపిస్తుంది.
ప్రాకృతికంగా పరిశీలించినప్పుడు శరదృతువు ప్రసన్నతకు నిలయంగా కనిపిస్తుంది. అప్పటిదాకా వర్షాలతో చిత్తడి చిత్తడిగా మారిన నేలలన్నీ శరదృతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవడం వల్ల ఎండిపోయి నిర్మలం అవుతాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తాయి.
శరత్కాలంలో చంద్రుడి కళలు ఉత్కృష్టంగా ఉంటాయి. పాడ్యమి నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరిగే ఈ దివ్యకళలను చూస్తే మనిషిలో కలిగే ఆనందోత్సాహాలు జీవితంపై ఆశాచంద్రికలను వెదజల్లుతాయి. ఈ కారణంతో విజయదశమి మానవాళికి ఆశాదీపమై కనిపిస్తుందనడంలో సందేహం లేదు.

జీవితం అంటే...
జీవితంలో నిజంగా మనం జీవిస్తున్నామా? ఇది అంతుచిక్కని ప్రశ్న. వ్యధలతో, బాధలతో, అసంతృప్తులతో, నిరాశా నిస్పృహలతో జీవితమంతా గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే చివరకు మిగిలేది ఏమిటి? అనంతమైన పశ్చాత్తాపం కళ్ల ముందు సాకారమవుతుంది. దేవుడిచ్చిన బహుమానమైన ఈ జీవితం ఇలా నిష్ఫలంగా ముగిసిపోతుందనే చింతన చరమాంకంలో వేధిస్తుంది. అందుకే ముందే మేల్కోవాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
శాశ్వతంకాని దేహం మీద మమత్వాన్ని వదిలిపెట్టి శాశ్వతుడైన పరబ్రహ్మను భజించమని జగద్గురువు ఆదిశంకరులు మహోపదేశం చేశారు. అవిద్య, రాగద్వేషాలు, జీవితంపట్ల నిర్లక్ష్యం, మానవీయత లేకపోవడం, జడత్వం- వీటిని పంచ మహాదుఃఖాలుగా పతంజలి మహర్షి అభివర్ణించారు. జీవితమంటే చావు వచ్చేంతవరకు కొనసాగించే పయనం ఎంత మాత్రమూ కాదు. ‘మృత్యువు నిన్ను నీడలా ఎల్లప్పుడూ అనుసరిస్తుంది. అది నిన్ను అక్కున చేర్చుకోకముందే, దాన్ని జయించాలి. మరణించే నువ్వు జీవించాలి’ అని ఉపనిషత్తులు ప్రబోధించాయి. అన్ని దుఃఖాలకంటే మరణ దుఃఖం అతి భయంకరమైనది. మరణ దుఃఖాన్ని, మృత్యుభీతిని అధిగమించడం ఎలా? పరమాత్ముడికి ప్రియమైన రీతిలో మనం జీవన సంవిధానాన్ని అవలంబించడం ద్వారా మృత్యువునైనా ప్రియమైన మిత్రుడిగా మార్చుకోవచ్చు. నిష్కామ భావంతో కర్మాచరణ చేస్తూ, ధర్మపథంలో పయనించడం ద్వారా, చింతనామృతాన్ని నిరంతరం ఆస్వాదించడం ద్వారా జీవన మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. మాననీయమైన మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడిపినవారే చిరంజీవులు. అలాంటివారే అసలైన కీర్తిశేషులు!
మనిషి తన జీవితాన్ని ధర్మానికి అనుగుణంగా మలచుకుంటే మరణ భయం నుంచి బయట పడవచ్చు. తన కోసం, సమాజం కోసం, దైవం కోసం ఎలాంటి కర్తవ్యాల్ని ఆచరించి తరించాలో తెలుసుకుని మసలుకోవచ్చు. తనను తాను తెలుసుకోలేనివాడు సామాన్యుడు. ఆ జ్ఞానాన్ని పొందినవాడు మాన్యుడు. సమస్త ప్రాణులపట్ల అనురక్తిని ప్రదర్శిస్తూ, సర్వభూతాల పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉంటూ, సకల జనుల పట్ల దయాభావాన్ని ప్రకటిస్తూ, అహంకార రహితులై, సుఖదుఃఖాల్లో సమభావం కలవారే తనకు ప్రియమైనవారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. క్షమ, నిగ్రహం, ప్రేమ, సత్యసంధత, రుజువర్తన, వినయం, భూతదయ, సేవాతత్పరత ఈ అష్టసూత్రాల్ని జీవితానికి అనుసంధానించుకోవడం ద్వారా లోకాన్ని వశం చేసుకోవచ్చని భాగవతం ప్రతిపాదించింది.
జీవన రథానికి ఇంధనం ఆత్మవిశ్వాసం. ‘బతుకు అనేది మెతుకుల కోసం పోరాటం కాదు. బతుకు గతుకుల మయం కాకూడదు. బతుకు అతుకుల బొంతగా కనిపించకూడదు. ఈ బతుకు దయగల భగవంతుడిచ్చిన అపురూప అవకాశం. దాన్ని అందిపుచ్చుకో. చరితార్థుడిగా మిగిలిపో!’- ఓ సూఫీ కవిత వెల్లడించిన జీవన సత్యమిది.
జీవితం పట్ల భయం ఉండకూడదు. భక్తి ఉండాలి. శేష ప్రశ్నగా మిగిలే భవిష్యత్ జీవితంపట్ల వర్తమానంలో ఆందోళన అనవసరం. ధీరచిత్తంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సదా సమాయత్తంగా ఉండాలి. ఇదే ఉదాత్త చరితుల ఉత్తమలక్షణం. ధైర్యం, నిర్భయత్వమనేవి ఆత్మజ్ఞానంతోనే సిద్ధిస్తాయి. సర్వశుభంకరమైన ధర్మకర్మల్ని ఆచరిస్తూ కర్మసాక్షి అయిన భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడనే ఎరుకను కలిగిఉండాలి. తరతరాలుగా అనుసరిస్తున్న ఆధ్యాత్మిక జీవన సంవిధానాన్ని పాటించాలి. నైతికశీల సంపత్తితో వేదవిహితమైన విధివిధానాలతో జీవన సంగీతపు మధురిమల్ని ఆస్వాదించాలి. జీవితనౌకను వెలుగు తీరానికి చేర్చాలంటే ముందు అంతర్వీక్షణతో మనలో కాంతిని నింపుకోవాలి. హృదయాలయంలో జ్ఞానజ్యోతుల్ని ప్రజ్వలింపజేసుకోవాలి!

విజయ సారథ్యం
లోకంలో ప్రతి మనిషీ తన సంకల్పం సఫలీకృతం కావాలని, తన ప్రయత్నం విజయవంతం కావాలనే ఆకాంక్షను బలంగా కలిగి ఉంటాడు. కృషి ప్రారంభించకుండానే, ఫలితాలను ముందుగానే తమకు అనుకూలంగా ఉంటాయని కొందరు ప్రకటిస్తుంటారు. సర్వసాక్షి, సర్వేశ్వరుడు అహంకారం లేశమంత ఉన్నా సహించడు. ఆ దేవుని ఆత్మకాలుష్యం గిట్టదు. గర్వం తలెత్తినప్పుడల్లా ఎంతటి భక్తుడికైనా గుణపాఠం నేర్పకమానడు.
అర్జునుడు, బలరాముడు ఇలాంటి పాఠాలు నేర్చినవారే. మహాశివ భక్తుడైన రావణుడు, అహంకారంతో కైలాసగిరిని తలకెత్తుకుని, తలకిందులు కాక తప్పలేదు.
భక్తిలో సర్వశరణాగతి తప్ప ఇంకేమీ ఉండకూడదు. భక్తి ఒక మహామధుర భావన. దానిలో నలుసంత స్వార్థం కలిసినా మాధుర్యం కోల్పోతుంది. అందుకే సాధకులు, బంగారం కొలిమిలో కాల్చిన విధంగా అనేక కఠిన పరీక్షల్ని తట్టుకుని, చెదరని బుద్ధితో ఉండగలగాలి. దేవుడు మనలను పరీక్షలకు గురిచేస్తున్నాడంటే, ఆయన మనల్నెంతో ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ప్రతి పరీక్షకూ మూల్యాంకనం ఉంటుంది. అది నూటికి నూరు కాగానే ఇక పరీక్షలుండవు. మనం దేవునికి ఆంతరంగికులమైపోతాం. అదృష్టవంతులకు ఆయన నిత్య జీవితంలో ప్రమేయం పెట్టుకుంటున్న సందర్భాలు అనుభవంలోకి వస్తాయి. కొందరు వాటిని తమ అదృష్టమనుకుంటారు. దైవానుగ్రహమే మన అదృష్టంగా రూపొందుతుంది.
అద్భుతాలు చేయగలవాడు సర్వేశ్వరుడు ఒక్కడే. ఇతరులు గారడీలు మాత్రమే చేయగలరు. గారడీ అంటే భ్రమావిష్కరణ. అది అంతలోనే అదృశ్యమైపోతుంది. మన జీవితంలో ఎక్కువ భాగం నమ్మకం- అపనమ్మకం, సందేహాలు, సంకోచాల ఊగిసలాటలో గడిచిపోతుంది. నిజభక్తులు బహుకొద్దిమందే ఉంటారు.
పరమాత్మ ప్రతినిధులుగా ఇహంలో శ్రమిస్తున్నవారంతా అనేక పద్ధతుల్లో పరమసత్యాన్ని, దివ్యజ్ఞానాన్ని అందరికీ అందించాలని ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ప్రసాదం రుచికరంగా ఉందని సంబరపడతారేగానీ, అందులోని దివ్య భావనను గ్రహించరు.
ప్రసాదం అంటే పరమాత్మ అనుగ్రహం.
భౌతిక భావన నుంచి ఆధ్యాత్మికంలోకి వెళ్తే- పరమాత్మ మందహాసం, అనుగ్రహవదనం ప్రసాదంలో అనుభవానికి వస్తాయి. అలా వచ్చినప్పుడు ప్రసాదం దివ్య ఆధ్యాత్మికానుభవాన్ని కలిగిస్తుంది.
ఇహానికి ప్రాధాన్యం ఇచ్చినంతకాలం ‘పరం’ అర్థంకాదు. ‘పరం’ అర్థమయ్యాక’, ఇహం’ మీద విరక్తి కలుగుతుంది. ‘భక్తి’ అనే పాయసంలో విశ్వాసమనే కుంకుమపువ్వు రుచి, రంగులీనుతూ ఉంటుంది.
అర్జునుడు, దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు సహాయంకోసం శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లిన సన్నివేశం ఎన్నో సందేశాలకు నిలయం.
ఎక్కడ తప్పుచేస్తాడోనని ముందుగా కోరుకునే అవకాశాన్ని అర్జునుడికే ఇస్తాడు కృష్ణుడు. ఒకవేళ ముందుగా దుర్యోధనుడు తననే కోరుకుంటే, పాండవులు నిస్సహాయులు, వ్యర్థులుకాక తప్పదు, అందుకే, తాను ముందుగా చూశాననే వంకతో అర్జునుడికి అవకాశం ఇస్తాడు. ఆయుధం ధరించననడం- దుర్యోధనుడిని చిత్తభ్రమకు లోనుచెయ్యడానికే. అతడు దైవస్వరూపుడైన శ్రీకృష్ణుని ఒక సామాన్య వ్యక్తిగా భావించాడు తప్ప జయాపజయాలను శాసించగల సర్వేశ్వరుడిగా గ్రహించలేకపోయాడు.
అర్జునుడు అలాకాదు. స్థిరభక్తితో శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు. అందుకే అన్నీ తానేఅయి కురుక్షేత్రంలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నా పాండవులకు ధర్మవిజయాన్ని అనుగ్రహించాడు. సంఖ్యాబలాన్ని, యోధుల్ని నమ్ముకున్న దుర్యోధనుడు సర్వనాశనం కాకతప్పలేదు.
ప్రతి మనిషీ ప్రపంచమనే కురుక్షేత్రంలో రణవీరుడే. నమ్ముకోవాల్సింది ధన, జన బలాలను; అధికార హోదాలను కాదు. అంతరంగంలో కొలువుండి, అనుక్షణమూ మార్గదర్శనం చేయగల దేవుని. ఆయన విజయసారథ్యమే మన జన్మలను సార్థకం చేస్తుంది.

చిరంజీవ... సుఖీభవ!
వేదం నాదం
అపమృత్యు భయాన్ని పోగొట్టేది, ఆధ్యాత్మిక చింతనా ధోరణిని పెంచేది మృత్యుంజయ మంత్రం. దీన్నే మహా మృత్యుంజయ మంత్రం, త్య్రంబక మంత్రం, రుద్ర మంత్రం, మృత్యు సంజీవని మంత్రం అని కూడా అంటారు. జీవితంపైనే కాదు మృత్యువుపైనా అవగాహన కల్పిస్తుందీ మంత్రార్థం.
‘త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’
ఇది రుగ్వేదం ఏడో మండలం యాభై తొమ్మిదో సూత్రంలో పన్నెండో మంత్రం. యజుర్వేదంలో, తైత్తరీయోపనిషత్తులోనూ ఈ మంత్ర ప్రస్తావన ఉంది. మార్కండేయుడు ఈ మంత్రాన్ని జపించే శివుడి అనుగ్రహాన్ని, చిరంజీవత్వాన్ని పొందాడని, అందుకే ఈ మంత్రం అపమృత్యు దోషాన్ని నివారిస్తుందని నమ్ముతారు. ఈ మంత్రంలోని ప్రకంపనలకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని కొందరు భావిస్తారు.
సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే మూడు కన్నులున్న ఓ పరమేశ్వరుడా నిన్ను నేను పూజిస్తున్నాను. ఈ పూజకు ప్రతిఫలంగా తొడిమ నుంచి దోసపండు విడిపోయినంత సులభంగా సంసార బంధనాల నుంచి విడిపోయేలా అనుగ్రహించు. అన్నది మంత్ర భావం. ఈ మంత్రంలో మోక్షం అనేదాన్ని అమృతంతో సమానమైందిగా చెబుతారు. సంసార బంధనాల్లో పడి కొట్టుకుంటూ, కనీసం దైవనామ స్మరణ చేయలేనివారు చాలా మంది ఉంటారు. వారంతా ఎలాంటి వారంటే తీగకు అంటిపెట్టుకుని ఉన్న దోసకాయల్లాంటి వారు. పచ్చి దోసకాయ తీగకు వేలాడుతున్నప్పుడు దాన్ని తెంపడం అంత సులభం కాదు. పైగా దాన్ని తెంచే ప్రయత్నం చేస్తే కాయతోపాటు తీగంతా కదిలి అల్లకల్లోలం అవుతుంది. కానీ దోసకాయ బాగా పండినప్పుడు తీగ నుంచి తొడిమ సులభంగా విడివడుతుంది. నిజానికి నా కుటుంబం, నా వాళ్లు, నా సంపద అనే భావన నుంచి బయటపడడం అంత సులభం కాదు. దీనికి ఏకైక మార్గం భగవంతుడిని ఆశ్రయించడమే. ప్రతివారూ ముక్తిసాధన కోసం భగవంతుడిని స్మరించాలి. ఆ ముక్తి అమృతం లాంటిదని, దాన్ని అనుగ్రహించమని పరమేశ్వరుడిని స్తుతిస్తున్నట్లు కనిపిస్తుందీ మంత్రం.
శివుడు త్య్రంబకుడు. త్రిగుణాతీతుడు. త్రిజన్మ పాప సంహారుడు. అలాగే ఆ శివుడి కరుణ సుగంధం వ్యాపించినట్లు భక్త జనావళి అందరిపై వ్యాపిస్తుంది. ఆ స్వామి పుష్టిని పెంపొందిస్తుంటాడు. అలాంటి స్వామి దయతో అమృతత్త్వంలాంటి ముక్తి లభించాలని కోరుకోవడమే ఈ మంత్రంలోని విశేషం.

దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
దీపదేవ నమోస్తుతే.
"దీపం" పరమాత్మకు ప్రతిరూపం.
"దీపం" మన సంస్కృతిలో విడదీయరాని భాగం.
"దీపం" పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక.
మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు.

శివకేశవుల మాసం కార్తీకమాసం..!!
విష్ణుదేవుడితో సమానమైన దేవుడు,
గంగతో సమానమైన తీర్థం,
కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని మహర్షులు చెపుతున్నారు.
కార్తీకమాసం శివకేశవులకు ఇష్టమైంది.
ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం, మహిమాన్వితమైనది.
శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి.
కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి నుండి కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఎంతో పవిత్రంగా వ్రతాలను చేస్తుంటారు
కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మిక సాధనకు అనువైన పండుగలు అని అంటారు.
కార్తీకమాసంలో చేసే దీప దానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది.
కార్తీకమాసంలో దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం చాలా శుభప్రదం.
కార్తీకమాసంలోని మొదటి రోజు నుండీ సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టమైనది.
కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీళ్ళతో స్నానం చేసిన తరువాత సూర్యాస్తమయం తరువాత సంధ్యాదీపం పెట్టడం, తులసి పూజ, గౌరీపూజ చేయడం ఈ మాసంలోని ప్రత్యేకతలు.
కార్తీకమాసంలో కార్తీక శుద్ధనవమిని అక్షయ నవమిగా, తరువాత వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని,
కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ధిద్వాదశి అని,
కార్తీక శుద్ధ త్రయోదశి రోజున స్వాయంభువ మన్వంతరం ప్రారంభమయిందని అంటారు.
కార్తీక శుద్ధ చతుర్థశిని మహాకార్తి అని కూడా అంటారు. అలాగే కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం,
కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు.
కార్తీక బహుళ ఏకాదశి రోజున బోధనా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు.
కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా 'కార్తికదామోదర ప్రీత్యర్థం' అని ఆచరించాలని శాస్త్రోక్తి. శరదృతువులో నదీప్రవాహంలో ఔషధాల సారం ఉంటుంది, అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు.
కార్తీకమాసంలో మానసిక శారీరక రుగ్మతులను తొలగించి ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ప్రముఖమైనది,
పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో ఉదరభాగం మునిగేలా స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు నయమవుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే కార్తీకమాసం సూర్యోదయానికి పూర్వమే విష్ణు సన్నిధిలో విష్ణు కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలం, కీర్తనలకు వాయిద్యం వాయించేవానికి వాహపేయ యజ్ఞఫలం,
నాట్యం చేసేవానికి సర్వతీర్థ స్నానఫాలం,
అర్చనా ద్రవ్యాలను సమర్పించి వానికి అన్ని ఫలాలూ, దర్శనాదులు చేసేవారికి ఈ ఫలాలలో ఆరవవంతు ఫలం లభిస్తుంది.
సూర్యోదయకాలంలో నిద్ర మేల్కొని విష్ణు, శివాలయాలలో భగవంతుణ్ణి ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వల్ల వేల గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.
విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో..
ఇతర దేవాలయాలలో..
లేకపొతే రావిచెట్టు మొదట్లో గాని,
తులసీవనంలో గాని ఉండి భగవత్ స్మరణ చేయాలి. ముఖ్యమైన సూచన ఏమిటంటే తడిబట్టలతో దీపారాధన చేయకూడదు అలాగే శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో స్త్రీలు తులసిచెట్టు ముందు ప్రతిరోజూ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి.
తులసిలో సర్వతీర్థాలు ఉన్నాయని అంటారు.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్
అని శ్లోకం చదువుతూ భక్తితో తులసికి నమస్కరించాలి. కార్తీకమాసంలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి చంద్రని అనుగ్రహం పొందడానికి అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుని ఆరాధించాలి.
కార్తీకమాస సోమవారాలు.
శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం.
అందులోనూ శివకేశవులకు యిష్టమైన కార్తీకమాసంలోని సోవారాలు స్నాన, జపాలు ఆచరించేవారు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతారు.
కార్తీకమాస సోమవారాల్లో ఆరు రకాల వ్రత విధి ఉంది. అవి ...
ఉపవాసం:
శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో (అభోజనం) గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే సేవించాలి.
ఏకభుక్తం:
ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట.
ఉదయం స్నానం చేసి దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి,
రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.
నక్తం:
పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.
అయాచితం:
భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం
స్నానం :
పైవాటికి వేటికీ శక్తిలేని వాళ్ళు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.
తిలదానం:
మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.
పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి.
గరళకంఠుడైన పరమశివుడు తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు
అందుకే ఈ నెలలో సోమవా

రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
కార్తీకమాసంలో పాడ్యమి నుంచి కార్తీక వ్రతం ప్రారంభించాలి.
దామోదరుడైన (పద్మనాభుడైన మహావిష్ణువు)ను ఉద్దేశించి దీన్ని చేయాలి.
ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీమహావిష్ణువు నివశించి ఉంటాడు.
నదులు, చెరువులు, బావులు, గుంటలలో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభం అయినట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది.
కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రం, గురు గ్రహం, సోమవారం కలిసివస్తే దాన్ని పరమపవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది.
శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది.
ఈ నక్షత్ర పురుషుని వర్ణన, విశ్వాంతరాళపు నక్షత్రసీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది.
నక్షత్ర పురుషునికి..
కృత్తికలు కటి (నడుము) స్థానంగా,
మూలా నక్షత్రం పాదాలుగా,
రోహిణి నక్షత్రం తొడలుగా,
అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి.
కాగా పూర్వాషాఢ నక్షత్రం, పురుషాఢ నక్షత్రం,
ఫల్గునీ నక్షత్రాలు మర్మస్థానాలుగా,
భాద్రపద నక్షత్రాలు భుజాలుగా,
రేవతి నక్షత్రం కుక్షిగా,
అనూరాధ నక్షత్రం వక్షస్థలంగా,
విశాఖ నక్షత్రం ముంజేతులుగా,
హస్త చేతులుగా,
పునర్వసు నక్షత్రం వేళ్ళుగా,
జ్యేష్ఠ కంఠంగా,
పుష్యమి నక్షత్రం ముఖంగా,
భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి.
కార్తీక స్నాన సంకల్పం.
సర్వపాప హారం పుణ్యం స్నానం కార్తిక సంభవం !
నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తు తే !!
అనుకుంటూ ఆచమనం చేసిన తరువాత .సంకల్పం:
దేశాకాలౌ సంకీర్త్య గంగా వాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌన్దరీ కాశ్యమేధాది సమస్తక్రాటు ఫలా వాప్త్యార్థం, ఇహజన్మని జన్మాంతర రేచ బాల్య యౌవన కౌమార వార్థకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యవస్థాసుజ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వతః ప్రేరణయా సంభావితానాం, సర్వేషాం పాపాన మపనోడ నార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ద్యర్థం, క్షేమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం, శ్రీ శివకేశావానుగ్రహ సిద్ద్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తికమాసే ... వాసర (వారం పేరు), యుక్తానాం ..... తిథౌ (తిథి) శ్రీమాన్ (గోత్రనామం) గోత్రాభిజాతః --- (పేరు) నామదేయోహం - పవిత్ర కార్తిక ప్రాతఃస్నానం కరిష్యే!
మంత్రం:
తులా రాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ !
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తు తే!!
మంత్రం చదువుతూ ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖంగా స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీళ్ళను తీసుకుని, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరం వైపు చల్లి, తీరం చేరుకొని, కట్టుబట్టల కొనలను నీళ్ళు కారిపోయేలా పిండాలి. దీన్నే యక్షతర్పణం అని అంటారు.
ఆలయానికి వెళ్ళి, శివుడు లేదా విష్ణువుకు అర్చన చేసి ఆవునేతితో దీపారాధన చేయాలి.
తరువాత స్త్రీలు తులసి మొక్కని..దీపాన్ని,
పురుషులు కాయలు ఉన్న ఉసిరి కొమ్మను..దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణతో దానం చేయాలి.
కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు.
దానిలో ఒకటి క్షీరాబ్ధిద్వాదశి,
రెండవది కార్తీకపౌర్ణమి.
కార్తీక పౌర్ణమి రోజున దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులు పెట్టి దీపాలు పెడతారు, నదులలో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
కార్తిక పౌర్ణమి రోజున కృత్తికా శివయోగం అనే పూజా విధానాన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తారు.
మరికొన్ని ప్రాంతాలలో శివాలయాల దగ్గర జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటలను రక్షించమని కోరుకుంటారు.
జ్వాలాతోరణం అంటే కార్తికపౌర్ణమి రోజున గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి పార్వతీదేవి విగ్రహాన్ని మూడుసార్లు ఆ మంటకిందుగా తిప్పుతారు.
జ్వాలాతోరణం నిర్వహించడానికి కారణం ఈ విధంగా చెబుతారు.
దేవతలు రాక్షసులు సముద్రమథన చేసిన సమయంలో హాలాహలం వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భంలో ప్రజారక్షణ చేసినందుకు సంకేతంగా జ్వాలాతోరణం జరుపుతారట.
ఉదయం పూట శ్రీహరి పూజ,
సంధ్య వేళ శివారాధన, దీపాల అలంకరణ, ఆకాశ దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తున్నది.
దీపదాన మంత్రం:
సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం !
దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ !!
జ్ఞానం, సంపదలు, శుభాలనూ కలిగించేదైన,
దీపదానాన్ని చేస్తున్నాను.
దీనివల్ల నాకు నిరంతరం శాంతి సుఖాలు ఏర్పడుగాక' అని చెపుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి..
ఓం నమః శివాయ...ఓం కార్తీక దామోదరాయ నమః..!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
శ్రీ మాత్రే నమః

హరిహరులకు ప్రీతికరం కార్తీక మాసం
తెలుగు మాసాల్లో ఒక్కో నెలకు ఒక్కో విశిష్టత ఉంది. ఇందులో కార్తికమాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో పూర్ణిమ రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో తిరుగుతూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తికం అనే పేరు వచ్చింది. ఖగోళ విజ్ఞానంలో.. భూగోళ జీవరాశికి ఉన్న అవినాభావ సంబంధానికి కార్తికం ఒక అద్భుత ఉదాహరణ. శ్వేత వరాహకల్పపు వైవస్వత మన్వంతరంలో ఇది 28వ మహాయుగం. కృతయుగం వైశాఖ తదియ నాడు, త్రేతాయుగం కార్తిక శుద్ధ నవమి నాడు, ద్వాపరం భాద్రపద కృష్ణ త్రయోదశి నాడు, కలియుగం మాఘ పూర్ణిమ నాడు ప్రారంభమయ్యాయని ఖగోళ విజ్ఞాన వేత్తల ఉవాచ.
‘‘న కార్తిక సమో మాసః’’ అని స్కాంధపురాణం చెప్పినట్లు.. కార్తికంతో సరితూగే నెల లేదు. శివకేశవులిద్దరికీ ఇష్టమైన నెల ఇది. ఈ మాసంలో మహా విష్ణువును తులసీ దళాలు, జాజి పూలతో.. పరమశివుడిని మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మారేడు దళాలు, జిల్లేడు పూలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. ఆరుగురు కృత్తికలు తల్లులై పాలివ్వడంతో.. ఆరు ముఖాల కుమార స్వామిని కార్తికేయుడని అంటారు. ఆయన ఆధిపత్యం ఉన్న నెల కావడం వల్లే ఈ మాసానికి కార్తికం అని పేరు వచ్చింది. ఈ నెలలో కృత్తికా నక్షత్రం, బృహస్పతి గ్రహం, సోమవారం కలిసి వస్తే.. దాన్ని పరమ పవిత్ర దినంగా గుర్తించాలని వేదం ఘోషిస్తోంది. ఈ మాసంలో శుద్ధ చవితిని నాగుల చవితిగా, శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశిగా, ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా.. చిలుక ద్వాదశిగా, పౌర్ణమిని కార్తిక పౌర్ణమిగా జరుపుకొంటాం. కార్తిక శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని నక్షత్ర రూపం కనిపిస్తుంది. ఇది సర్పాకారంలో ఉంటుంది. కాబట్టి.. నాగుల చవితిని జరుపుకొంటాం. ఆశ్వయుజ బహుళ అమావాస్య (దీపావళి) నుంచే కార్తిక స్నానాన్ని ఆరంభించాలి.
నెల రోజులూ కార్తిక స్నానం చేయడం వీలుకాని పరిస్థితుల్లో.. శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా విధిగా ఆచరించాలి. ఈ మాసంలో పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామున నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. గరళ కంఠుడైన పరమేశ్వరుడి తమోగుణ స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. అందుకే.. ఈ నెలలో సోమవారాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కార్తిక సోమవారాల్లో ఉపవాసం ఉండటం ఆనవాయితీ. ఈ నెలలో వెలిగించే దీపం కోటి పుణ్యాల ఫలాన్ని అందిస్తుంది. కార్తిక పౌర్ణమి రోజున చేసే దీపారాధన ఎన్నో రెట్ల పుణ్యాల ఫలాన్నిస్తుంది. ఈ మాసంలో దీపారాధన, దీపదానం స్వర్గలోకప్రాప్తిని కలిగిస్తుంది. వీటితోపాటు ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం, అయాచితం, తిలదానం విధిగా పాటిస్తారు. వనాలలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి, వన భోజనాలు చేయడం పుణ్యఫలాలనిస్తుంది. ఈ నెలలో కార్తిక పురాణం చదివినా.. విన్నా మంచిది. ఆ పురాణంలో చెప్పిన విధులన్నింటినీ నెరవేరుస్తూ.. సత్సంగత్యంతో సర్వ మానవాళి తరించాలని ఆశిద్దాం.

కార్తీకపురాణం 1 అధ్యాయం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కార్తీక మాసం విశేషం
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.
శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.
పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.
అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.
మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.
దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.
కార్తీక వ్రతవిధానం
”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.
వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, వి

ష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.
ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.

Kartika Puranam - 2
కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం
అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.
కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారి