స్వయంకృతాపరాధం
ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషినీ ఎవరూ నాశనం చేయరు. అతడి చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఇది రమణ మహర్షి మహితోక్తి.
సృష్టిలో మనిషి ఉత్కృష్టజీవి, తెలివిగల ప్రాణి. అటువంటి మనిషి పతనానికి ఎవరు కారకులని ప్రత్యేకించి వెదకనక్కర్లేదు. తన వినాశనానికి తానే కారకుడు. జీవిత గమనంలో మనం చేసే పనులకు ఆలోచనలే ప్రాతిపదిక. వాటికి క్షేత్రం మనసు. నేలలో వేప విత్తనం నాటితే వేపమొక్క మొలుస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు తయారవుతుంది. మనిషి జీవన సాఫల్యవైఫల్యాలకు మనసులోని ఆలోచనలే కారణమవుతాయి. ఏ మనిషినైనా శిఖరాగ్రం మీద నిలబెెట్టాలన్నా, అధఃపాతాళానికి తొక్కేయాలన్నా- ఆ పని ఎవరో పని కట్టుకుని చేయనక్కర్లేదు. అతడి ఆలోచనా విధానమే ఆ కార్యం నిర్వహిస్తుంది. గౌతమబుద్ధుడు ప్రవచించిన అష్టాంగమార్గంలో ఒకటి ‘సమ్యక్ ఆలోచన’. మన ఆలోచనలు సవ్యంగా సక్రమంగా ఉండాలని దీని భావం. మన మనసు ఒక ఇల్లనుకుంటే ఇంటి దొంగలు ఆరుగురు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అందరికీ తెలిసినవారే. తెలిసినా అప్రమత్తంగా ఉండం. చొరబాటుకు అవకాశం ఇస్తాం. నష్టపోయాక విచారిస్తే ఏం లాభం?
అందరికంటే అధికంగా సంపాదించాలి... ఎలాగైనా, ఏం చేసైనా సంపాదించాలి... అందులోనే ఆనందం ఉంది... అదే జీవిత పరమార్థం- ఇలా సాగుతుంది ఒకడి ఆలోచన. అందరికీ నేనే పెద్దగా ఉండాలి. అందరిపైనా పెత్తనం చలాయించాలి. పెద్దరికంకోసం, అధికారం కోసం వంచన, కుట్ర, కుతంత్రం... ఏం చేసినా తప్పుకాదు- ఇలా ఆలోచించేవాళ్లు నేడు చాలామంది కనిపిస్తున్నారు. తనకంటే మంచి స్థితిలో ఉన్నవాణ్ని చూసి, సమర్థుణ్ని, ప్రతిభావంతుణ్ని చూసి అసూయపడటం, వారిని ఎలా నాశనం చేయాలని ఆలోచించడం చాలా మందికి అలవాటు. చూసినదల్లా నాకు దక్కాలి- అది దేశసంపదైనా, పరాయివాడి భార్య అయినా- నేనాశించింది అందాల్సిందేనని తపనపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. వీరంతా శారీరకంగానూ సంపదల్లోనూ బలవంతులే. కానీ నైతికంగా అతి దుర్బలురు. వారి ఆలోచనలన్నీ బలహీనమైనవే.
రావణుడు వేదవేదాంగ పారంగతుడు, శివపూజాతత్పరుడు, వరదాన బలాన్వితుడు. మహాబలసంపన్నుడు, శత్రుజన భయంకరుడు. యుద్ధతంత్రకోవిదుడు... ఇన్ని మేలిమిగుణాలు గల వ్యక్తిలో రెండే రెండు బలహీనతలు. స్వాతిశయం, కాముకత. రజస్తమోగుణాలు వాటి మూలకందాలు. స్వాతిశయం రావణుడిలో మొదటి నుంచీ రగుల్కొన్నది. మధ్యలో మొలకెత్తింది, ముదిరింది- కాముకత. మొత్తానికి రెండూ విషపు కోరలతో అతణ్ని కాటువేశాయి. దుష్టుల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాయి. భారతీయులు పరమ పవిత్రంగా భావించే దాంపత్య జీవితాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని భగ్నం చేయడానికి పూనుకోవడమే రావణుడు చేసిన మహాపాపం.
అసూయ, క్రోధం, దురభిమానం మనసునిండా నింపుకొన్న దుర్యోధనుడి పతనానికి ఇతరులెవరూ కారణం కాదు. అతడు సుయోధనుడు అభిమాన ధనుడు. ‘ధర్మమేమిటో నాకు తెలుసు కాని నా మనసు ధర్మమార్గంలో వెళ్లలేదు. అధర్మమార్గమంటే ఏమిటో కూడా తెలుసు. అది నన్ను విడిచిపెట్టడం లేదు, అని ఒక దశలో అతడే చెబుతాడు.
ఎన్ని ప్రజ్ఞలున్నా ఎంత అర్థఅంగ బలమున్నా మనసులో మంచి ఆలోచనలు పుట్టకపోతే, అధర్మమార్గంలో ప్రవర్తిస్తే- ఎంతటివారికైనా... పతనం తప్పదు.

విమర్శ ఎలా ఉండాలి?
‘ప్రపంచంలో సలహాలివ్వడం కంటే విమర్శించడం చాలా తేలిక’ అన్నాడో ఫ్రెంచ్‌కవి. సలహా ఇవ్వాలంటే ఎదుట ఓ మనిషి ఉండాలి. విమర్శించడానికి ఎదుట ఎవరూ ఉండనక్కర్లేదు. నేటి సమాజంలో సమయం, సందర్భం లేకుండా, విమర్శలు విపరీతమైపోయాయి.
ఒక కావ్యాన్నో కవితనో లేదా ఏదైనా ప్రణాళికనో అంశాన్నో విశ్లేషించేవారికి- ఆ కవి లేదా ఆవిష్కర్తకన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి.
తార్కికంగా, నిష్పాక్షికంగా, అర్థవంతంగా చేసే విమర్శలు మనోవికాసానికి, ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. విమర్శ మంచి గంధంలా పరిమళించాలి. మలయ మారుతంలా మనసును తాకాలి. విన్నవారి హృదయాలు నొచ్చుకోకుండా, వారి ఆలోచనా సరళిని ప్రభావితం చేయాలి.
వ్యక్తిని చూడకుండా, మిత్రుడా, శత్రువా అన్న ఆలోచనతో నిమిత్తంలేకుండా కేవలం అతడి సృజనాత్మకతను మంచిని మంచిగా, చెడును చెడుగా విడమరచి చేసే విమర్శ- సద్విమర్శ. ఈ సద్విమర్శ ఉభయులకు (రచయితకు, విమర్శకుడికి) ఎంతో శ్రేయస్కరం.
రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల్లో మనకు విమర్శలు కోకొల్లలుగా కనబడతాయి. తన బోధలను, హితవును లక్ష్యపెట్టక పుత్రవ్యామోహమనే హాలాహల సాగరంలో మునిగిపోయిన ధృత రాష్ట్రుణ్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు విదురుడు. మరిగే నీటిలో మన ప్రతిబింబం కనపడనట్లే- అతివ్యామోహంలోనూ అత్యంత ఆగ్రహంతోనూ రగిలి పోయేవాడికి విమర్శలు, హితబోధలు చెవికెక్కవు. మిడిమిడి జ్ఞానం కలవాళ్లు, సహనం లేనివాళ్లు, విచక్షణ తెలియనివాళ్లు- తమ దోషాలను ఇతరులు ఎత్తి చూపినప్పుడు అసలు సహించరు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న మొండివాదనకు సిద్ధపడతారు. రాజసూయయాగం చేయాలని ధర్మజుడు తలపెట్టి, కృష్ణుణ్ని అగ్రపూజకు ఆహ్వానించిన తరుణంలో, శిశుపాలుడు అజ్ఞానంతో, అహంకారంతో వాసుదేవుణ్ని అనేక విధాలుగా దూషిస్తూ కువిమర్శ చేసి, చివరకు ప్రాణాలు కోల్పోతాడు. రావణుడు తన అకృత్యాలను విమర్శించిన మండోదరిని, విభీషణుణ్ని లెక్కచేయడు. సత్యభామ పలుమార్లు సవతులను నిందించి, విమర్శించి, తగిన దుష్ఫలితం పొందింది.
విమర్శ గురించి విశ్లేషిస్తూ స్వామి వివేకానంద ‘మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించాలి. బలహీనపరచే ప్రతి ఆలోచననూ తిరస్కరించాలి’ అంటారు.
విమర్శలను సహృదయతతో, వినమ్రతతో స్వీకరించడమే సంస్కారం. ప్రతి రచయితలోనూ ఓ విమర్శకుడూ ఉండి తీరాలన్నది అనుభవజ్ఞుల మాట.
రచయితలు ఏది రాసినా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. స్వయం విమర్శ చేసుకోవాలి. విమర్శకులపైన వ్యక్తిగతమైన విరోధం పెట్టుకుని ఎదురు దాడికి దిగడం శ్రేయస్కరం కాదు.
‘వినడానికి కటువుగా ఉన్నా, మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి’ అనేవారు ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
విమర్శలకు గురైనప్పుడు కుంగిపోకూడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
అదేపనిగా ఇతరులలోని ప్రతి అంశాన్నీ, ప్రతి లోపాన్నీ ఎత్తి చూపడమే వృత్తిగా పెట్టుకునేవాడు తననుతాను ఉద్ధరించుకోలేడు. పొరపాట్లను ఎత్తి చూపేవారు సరిదిద్దే సూచనలు కూడా ఇవ్వడం సమంజసం. నిరాధారమైన విమర్శకు, నిర్మాణాత్మకమైన విమర్శకు మధ్యగల భేదాన్ని గుర్తించడం అవసరం. ఆ పరిజ్ఞానమే వ్యక్తి అభ్యున్నతికి శ్రీరామరక్ష.

రాఖీ పూర్ణిమా, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి జయంతి, శ్రావణ సోమవార ఈశ్వర ప్రీతి ఇత్యది పర్వదినయక్త శుభోదయము
మనిషి శరీరంలో ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో ఉంటుంది. ఆలోచనా శక్తికది కేంద్రం. వేలితో కుంకుమను ధరిస్తూ భృకుటి దగ్గర నొక్కడం వల్ల.. ఆజ్ఞాచక్రం ప్రచోదనం చెంది జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందని చెబుతారు. శరీరం కూడా ఉత్తేజితమవుతుంది. కుంకుమ ధరించే సమయంలో..
‘ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం
ఆగమ విపిన మయూరీ మార్యామంతర్విభావయే గౌరీం’ అనే శ్లోకాన్ని పఠించాలని చెబుతారు..

ఈ రోజు వ్యాస పౌర్ణమి
వ్యాసోచ్చిష్టం జగత్సర్వం... ఈ లోకంలో ఉన్న వాజ్ఞ్మయమంతా ఆ వ్యాస భగవానుడి ప్రసాదమే. నాలుగు ముఖాలు లేకున్నా ఆయన చతుర్ముఖుడైన బ్రహ్మతో సమానం. నాలుగు చేతులు లేకున్నా వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుతో సమానం. నుదుటి భాగంలో మూడో కన్ను లేకున్నా కైలాసవాసి అయిన పరమశివుడితో సరితూగుతాడని వర్ణిస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ... వేదమయుడు, వేద రక్షకుడైన శ్రీ మహావిష్ణువే వ్యాసుడిగా అవతరిస్తుంటాడనీ చెబుతారు. ఆయన గురువులకే గురువు... గురు పరంపరలో తొలిగురువు.
ఎవరీయన?
వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థం. వేదాలను విభజించినవాడు వేదవ్యాసుడయ్యాడు. వేద వ్యాసులైన వారందరికీ వేరే పేర్లున్నాయి. ఈ అవతార విశేషాలు విష్ణుపురాణం మూడో అధ్యాయం, దేవీ భాగవతం ఒకటో అధ్యాయంలో కనిపిస్తాయి.
కృత, త్రేత, ద్వాపర, కలి అనే నాలుగు యుగాలను కలిపి ఒక మహా యుగమంటారు. ఇలా అనేక మహాయుగాలు కాలగమనంలో వస్తూపోతూ ఉంటాయి. ప్రతి మహాయుగంలోని ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా వ్యాసుడి రూపంలో అవతరిస్తాడు. వేదరాశిని విభజిస్తాడు. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. ఇందులో ఇప్పటికి 27 మహా యుగాలు గడిచిపోయాయి. ఇరవై ఎనిమిదో మహాయుగంలో కలియుగం జరుగుతోంది. అంటే ఈ మన్వంతరంలో ఇప్పటికి 28 మంది వేదవ్యాసులు అవతరించారు.
వేద వ్యాసులు వీరు...
1.స్వాయంభువుడు 2.ప్రజాపతి 3.ఉశనుడు 4.బృహస్పతి 5.సవిత 6.మృత్యువు 7.ఇంద్రుడు 8.వసిష్ఠుడు 9.సారస్వతుడు 10.త్రిధాముడు 11.త్రివృషుడు 12.భరద్వాజుడు 13.అంతరిక్షుడు 14.ధర్ముడు 15.త్రయ్యారుణి 16.ధనుంజయుడు 17.కృతంజయుడు 18.సంజయుడు 19.భరద్వాజుడు 20.గౌతముడు 21.ఉత్తముడు (ఇతన్ని హర్యాత్ముడు అని కూడా పిలుస్తారు) 22.వేనుడు (ఇతన్ని వాజశ్రవుడు అని కూడా పిలుస్తారు) 23.సోమశుష్మాయణుడు 24.రుక్షుడు 25.శక్తి 26.పరాశరుడు 27.జాతూకర్ణుడు 28.కృష్ణద్వైపాయనుడు. ఈ వరస క్రమంలో పన్నెండు, పందొమ్మిది మహా యుగాల్లో వేదవ్యాసుల పేర్లు ఒకటే కావడం విశేషం. ఇరవై తొమ్మిదో మహాయుగంలో అశ్వత్థామ వ్యాసుడిగా అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

పాలకుడు ఎలా ఉండాలంటే..!
రాజు ఎంత నిజాయతీపరుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఒక తప్పయినా చేస్తాడు. అలా తప్పు చేసినవాడికి నరకం తప్పదు. అందుకే ‘రాజ్యాంతే నరకం ధ్రువం’ అన్నారు. మరి ఎలా పరిపాలించాలి. తప్పు జరగకుండా పాలకుడు ఎలా ఉండాలి. దీనికి సమాధానం శ్రీరామచంద్రుడి పరిపాలన. ‘రామో రాజ్య ముపాసిత్వా’ అన్నాడు వాల్మీకి. మనం ఒక భగవంతుడి మంత్రాన్ని ఎంత పవిత్రంగా ఉపాసిస్తామో, జపిస్తామో శ్రీరాముడు తన రాజ్యాన్ని అంత పవిత్రంగా, చిత్తశుద్ధితో పరిపాలించాడు. అందుకే ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి సరాసరి పుణ్యలోకానికి వెళ్లిపోయాడని రామాయణం చెబుతోంది. ఈ సూత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయం.

జన్మాష్టమి... శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాలు ఇవే
మనం ప్రతి రోజూ శ్రీకృష్ణుడికి పూజలు చేస్తూనే ఉంటాం. కానీ జన్మాష్టమి సందర్భంగా చేసే పూజలకు ఎంతో విశిష్టత, విశేషం ఉంటుంది. శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం ఆయనకు ఎంతో ఇష్టం
వెన్న - గోపాలుడికి చిన్నప్పటి నుంచే వెన్న తినే అలవాటుంది. ఆయన్ని వెన్న దొంగ అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికి వెన్న తినడం అంటే చెప్పలేనంత ఇష్టం. జన్మాష్టమి ప్రసాదాల్లో వెన్న తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
ధాన్యాలు, పాలు, తేనె, గడ్డ పెరుగు, బెల్లం... వంటి వాటితో చేసే ప్రసాదమంటే గోపాలుడికి ఎంతో ఇష్టం. చరణామృత కృష్ణుడు వాటిని తనివితీరా తినేస్తాడు. అందువల్ల వాటిని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.
జన్మాష్టమి రోజున పాయసం తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే... శ్రీకృష్ణ భగవానుడికి పాయసమంటే ప్రాణం. ఎంత ఇచ్చినా ఆరగించేస్తారు. అందువల్ల స్వామి వరాలివ్వాలంటే... పాయసం సమర్పించాల్సిందే!
బాదం, జీడిపప్పు వంటి పప్పులతో చేసిన లడ్డూలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. అవి గానీ నైవేద్యంలో పెట్టారంటే... ఇక మీ ఇంట్లోనే ఉండిపోతాడు. అన్నీ తింటూ... మిమ్మల్ని ఆశీర్వదించేస్తారు స్వామి.
సగ్గుబియ్యంతో చేసే కిచిడీ అంటే... నల్లనయ్యకు చాలా ఇష్టం. జన్మాష్టమి పూజ చేసినప్పుడు... సగ్గుబియ్యంతో ఇలాంటి వంటకం ఏదైనా చేసి పెడితే చాలా మేలు జరుగుతుంది.
జన్మాష్టమి రోజున పూజలో కచ్చితంగా లడ్డూ ఉండేలా చేసుకోవాలి. అది ఏ లడ్డూ అయినా పర్వాలేదు. బట్... లడ్డూ లేకపోతే మాత్రం స్వామి అలుగుతారు. పక్కింటికి వెళ్లిపోతారు. సో, ఆయన్ని మన ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలంటే... పూజలో రుచికరమైన లడ్డూలు ఉండేలా చూసుకోండి మరి.

మనిషి జయించవలసిన 6 దోషాలు
వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతినిద్ర, బద్ధకం, భయం, క్రోధం, అలసత్వం, ఎడతెగని ఆలోచన అనే ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే.. నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. రెండో లక్షణం బద్ధకం.
ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. ఇక, క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. అలాగే.. ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.