VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,
"Pensioner-Cluster Mapping" screen enabled.
Pls check.
*SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం*

• SSC పరీక్షల కోసం APSRTC కీలక నిర్ణయం

• SSC పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

• హాల్ టికెట్‌తో SSC విద్యార్థులకు ఫ్రీ బస్ ట్రావెల్

• మార్చి 16 నుంచి SSC విద్యార్థులకు APSRTC ఉచిత సౌకర్యం

• హాల్ టికెట్ చూపిస్తే చాలు – ఉచిత ప్రయాణం

• 10 వ తరగతి పరీక్షా రోజులలో విద్యార్థులకు ఉచిత బస్సు సేవలు

• 6.42 లక్షల SSC విద్యార్థులకు APSRTC సౌకర్యం

• విద్యార్థుల సౌకర్యార్థం తగిన సంఖ్యలో బస్సులు నడపాలని APSRTC ఆదేశం

• పరీక్షా రోజుల్లో బస్ పాస్ అడగవద్దని సిబ్బందికి సూచనలు.
🍚 ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది.

✅ ఇకపై వారంలో 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు.
✅ అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు.
✅ పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు.

👶 బాలామృతంలో కూడా మార్పులు
🔹 జూనియర్ బాలామృతం – 7 నెలలు నుంచి 12 నెలల పిల్లలకు
🔹 సీనియర్ బాలామృతం – 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలకు
రైస్ కార్డు చేంజెస్ కి అమౌంట్ రివైస్ అయ్యాయి గమనించగలరు. స్ప్లిట్టింగ్ కి 200 యాడ్డింగ్ డిలేషన్ కి 100 రూపాయలు మార్పులు చేయడం జరిగింది గమంచిగలరు
రైస్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్ ల పెంపు🧾

- రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను పెంచిన ప్రభుత్వం
- కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డ్ లో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా రుసుము పెంపుదల.
- గతంలో రూ. 24/- సేవా రుసుం కలిగిన సేవలు రూ.100/- లకు పెంపు
- గతంలో రూ.48/- సేవా రుసుముగా గల రైస్ కార్డ్ విభజన సేవ రూ.200/- లకు పెంపు
- మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసినదే.
Unified Family Survey 1.14 Updated to Version 08.03.2026

Missing Questions

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
📢 ఏపీ కుటుంబ సర్వే లేటెస్ట్ అప్డేట్ (V1.14) 📢

తేదీ 08-03-2026న కొత్త వెర్షన్ విడుదలయ్యింది. ముఖ్యాంశాలు:

✅ కొత్తగా 'Missing' ఆప్షన్: 15-59 ఏళ్ల మధ్య ఉండి, గతంలో Education & Employment వివరాలు నమోదు చేయని వారి కోసం ఈ ఆప్షన్ ఇచ్చారు.
✅ ముఖ్య గమనిక: వీరికి కేవలం ఆ రెండు విభాగాల డేటా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మొత్తం కుటుంబానికి అవసరం లేదు.
✅ Edit ఆప్షన్: గతంలో తప్పుగా నమోదు చేసిన వివరాలను సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
పీఎం కిసాన్ 22వ విడత విడుదల తేదీ ఇంకా అధికారంగా ప్రకటించలేదు... మార్చి 13 విడుదల అవుతుంది అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్త అంచనాలు మాత్రమే.
*గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొత్త నిబంధనలు*
📢 రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

ఏపీ ప్రభుత్వం రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తోంది. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఈ పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

📘 కొత్త పాసు పుస్తకాల ముఖ్యాంశాలు:
✅ ప్రభుత్వ రాజముద్రతో ఉచితంగా పాసు పుస్తకాలు
✅ క్యూఆర్ కోడ్‌తో భూ రికార్డుల భద్రత
✅ రికార్డులు తారుమారు చేస్తే వెంటనే గుర్తింపు
✅ రాష్ట్రంలోని రైతులందరికీ పంపిణీ

⚠️ భూ అక్రమాలపై కఠిన హెచ్చరిక

భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

📌 2027 చివరి నాటికి రాష్ట్రంలోని భూవివాదాలన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

🌾 రైతులకు భూ హక్కుల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
🐔 కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా? రూ.50 లక్షల వరకు లోన్ 50% సబ్సిడీ

కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా కోళ్ల ఫారం ప్రారంభించేందుకు రూ.50 లక్షల వరకు లోన్ ఇస్తోంది. ఇందులో 50% వరకు సబ్సిడీ కూడా పొందే అవకాశం ఉంది.

📌 పథకం ముఖ్యాంశాలు:
• గరిష్ట లోన్: ₹50 లక్షలు
• సబ్సిడీ: 50% వరకు
• కనీసం 1 ఎకరం భూమి అవసరం
• DPR రిపోర్ట్ తప్పనిసరి
• మంచి CIBIL స్కోర్ ఉంటే లోన్ సులభం
📢 *ముఖ్య గమనిక: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నిధుల వాపసుపై ఆదేశాలు*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (SERP) ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి పంపిణీ కాకుండా మిగిలిపోయిన (Undisbursed) నిధులపై కీలక ఆదేశాలు జారీ చేసింది:

నిధుల వివరాలు: ప్రభుత్వం నెలకు సుమారు 62.76 లక్షల మంది పెన్షనర్ల కోసం ₹2,725.79 కోట్లు విడుదల చేస్తోంది.

గడువు నియమం: పెన్షన్ పంపిణీ ముగిసిన 2 పని దినాలలోపు పంపిణీ కాని మొత్తాన్ని చలాన్ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి.

గత బకాయిలు: 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 వరకు పేరుకుపోయిన పాత అన్-స్పెంట్ (Unspent) నిధులను కూడా వెంటనే వెనక్కి పంపాలి.

డెడ్ లైన్: పెండింగ్‌లో ఉన్న పాత నిధులను మార్చి 13, 2026 లోపు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాలి.
చర్యలు: నిర్దేశించిన సమయంలోగా నిధులు జమ చేయని పక్షంలో సంబంధిత సిబ్బంది/అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

ముఖ్య ఉద్దేశం: అనేక జిల్లాల్లో పంపిణీ కాని నిధులు ప్రభుత్వానికి తిరిగి రాకపోవడంపై సీరియస్ అయిన SERP CEO, దీనిని అత్యవసరంగా (Specially Urgent) పరిగణించాలని స్పష్టం చేశారు.
🌾 ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లోకి ₹6,000 జమ!

ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త. అన్నదాత సుఖీభవ + PM కిసాన్ పథకాల డబ్బులు మార్చి 13న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి.

💰 మొత్తం డబ్బు: ₹6,000
• PM కిసాన్ – ₹2,000
• అన్నదాత సుఖీభవ – ₹4,000
🚨 సైబర్ అవగాహన సందేశం 🚨

⚠️ మ్యూల్ అకౌంట్‌లపై జాగ్రత్త ⚠️


❓ మ్యూల్ అకౌంట్ అంటే ఏమిటి?

👉 ఇతరుల పేర్లతో ఉన్న బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఉపయోగించి మోసపూరితంగా సంపాదించిన డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే ఖాతాలను “మ్యూల్ అకౌంట్స్” అంటారు.

👉 కొంతమంది కమిషన్ కోసం లేదా తెలియకుండానే తమ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఇస్తారు.
ఇది చట్టపరంగా నేరం.


⚠️ ఇలా చేయొద్దు

❌ మీ బ్యాంక్ అకౌంట్ / ATM కార్డ్ ఇతరులకు ఇవ్వొద్దు
❌ OTP, PIN, పాస్‌వర్డ్ ఎవరితోనూ పంచుకోకండి
❌ కొద్దిపాటి డబ్బు కోసం మీ ఖాతా వినియోగానికి ఇవ్వొద్దు


✅ జాగ్రత్తగా ఉండండి – సైబర్ మోసాలను అరికట్టండి

📞 సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే
1930 కి కాల్ చేయండి

🌐 ఫిర్యాదు చేయండి:
www.cybercrime.gov.in


📢 ప్రజల కోసం అవగాహన సందేశం
📢 ఏపీ అక్షర ఆంధ్ర - FLNAT 2026 పరీక్ష మార్గదర్శకాలు విడుదల! ✍️

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "ఉల్లాస్-అక్షర ఆంధ్ర" పరీక్షకు సంబంధించి కీలక షెడ్యూల్ మరియు పాస్ మార్కుల వివరాలను ప్రకటించింది.

✅ పరీక్ష తేదీ: మార్చి 15, 2026 (ఆదివారం)
✅ సమయం: ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు (మీ వీలును బట్టి 2 గంటలు)
✅ ముఖ్య అంశాలు:

ఉచిత పెన్ను, స్టేషనరీ మరియు సర్టిఫికెట్ 📜

ప్రతి విభాగంలో 17 మార్కులు వస్తేనే పాస్.

ఫెయిల్ అయ్యే వారికి 5 గ్రేస్ మార్కుల సదుపాయం! 🎁