VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
04.10.2026 న గౌరవ రాష్ట్ర స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు శాఖామాత్యుల వారి సమీక్ష యందు. తెలియజేసిన సూచనలు.

1. స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డు సిబ్బంది ఎవరైనా అనధికార డెప్యూటేషన్ లో ఉన్న వారికి ఈ మాసం నుండి జితభత్యం చెల్లించబడదు( హాజరు ట్రాకింగ్ చెయ్యబడును)
2. ఏ శాకాధికారులైన, జిల్లా కలెక్టరు గారైనా సిబ్బందిని డెప్యూటేషన్ ఉత్తర్వులు ఇచ్చినచో సదరు డెప్యుటేషన్ స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డు డైరెక్టరు ద్వారా రెగ్యులరైజేషన్ చేయించుకొనవలయును
3. స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డు సిబ్బంది ప్రతి ఒక్కరు PGRS 3 to 5 తప్పని సరిగా ఉండవలయును
4. DA,WEA,Mahila Police మల్టిపర్పస్ ఫంక్షనరి ఏ పనినైనా చెయ్యాలి ( అనగా DA లేనిచో WEA
WEA కూడా లేనిచో GMSK చెయ్యాలి ఈ మూడు డేసిగ్నెషన్ మల్టిపర్పస్
5. సిటిజన్ సర్వీస్ ఫీడ్ బ్యాక్ పెరగాలి మరియు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు నందు సర్వీసెస్ పెంచాలి
6. PPP మరింత పెరగాలి స్టేట్ ఆవరేజ్ కన్నా తక్కువ ఉన్నది
7. ఇంజినీరింగ్ సహాయకులు వారి పరిధిలోని ప్రతి హాస్టల్స్ నందు వాటర్ ట్యా0క్స్ పరిశీలించి వాటర్ టెష్టింగ్ చెయ్యాలి
8. వాట్సాప్ గవర్నన్స్ వినియోగం పెరగాలి.
యం.జి.ఓ లు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రతి స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు నిర్ణయించిన ప్రకారం తనిఖీ చెయ్యాలి ముఖ్యంగా 3 to 5 ప్రతి సిబ్బంది PGRS కి హాజరు అవుచున్నారా లేదా విషయం తనిఖీ చెయ్యాలి మరియు జిల్లా అధికారి రేండంగా తనిఖీ చెయ్యాలి.
*7న కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమావేశం*

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) కలెక్టర్లు, ఎస్పీలతో ఈ నెల 7న సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని కార్యాలయం నుంచి ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు.
Dear All,

These below services have been enabled under the Apseva Portal citizen login .

1. Re-Issuance of Integrated Certificate
2.Re-Issuance of Income Certificate
3.Water Tax Application
4.Printing of Title Deed-cum-Passbook
📢 *స్థానిక సంస్థల ఎన్నికలు.. కీలక అప్‌డేట్*
🗳️ AP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభమైంది.
🔹 SEC వారు కలెక్టర్లకు, SP లకు కీలక సూచనలు చేశారు.
📌 నోటిఫికేషన్ వచ్చిన 18 రోజుల్లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం.
📌 15వ రోజు ఎన్నికలు నిర్వహించి, 18వ రోజున ఫలితాలు వెల్లడించాలి.
📌 పంచాయతీ ఎన్నికలను నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లోగా పూర్తి చేయాలి.
📌 MPTC, ZPTC ఎన్నికల ఫలితాలను 25వ రోజుకు వెల్లడించాలి.

Received
*📢రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు*

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు రేపటి (OCT 10) నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 22 వరకు, ఇంటర్ కాలేజీలకు ఈనెల 21 వరకు సెలవులు ఉన్నాయి. ఇక ఏపీలో ఈనెల 21 వరకు విద్యాసంస్థలకు హాలిడేస్ ఉండనున్నాయి. విద్యాసంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 నుంచి సెలవులు ప్రారంభం కావాల్సి ఉండగా రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో హాలిడేస్ రెండు రోజుల ముందే స్టార్ట్ అయ్యాయి.
💥 *త్వరలో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సిబ్బంది యొక్క DDO ల మార్పు*

ప్రస్తుతం ఉన్న పంచాయితీ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్లు స్థానంలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ప్రత్యేక అధికారులు అయిన *స్వర్ణ ప్రత్యేక అధికారి (MSO), అర్బన్ స్వర్ణ ప్రత్యేక అధికారి (USGO)* లను *DDO* (Drawing & Disbursement officer) లు గా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.
📊 *భారత జనగణన (Census) రెండో దశ షెడ్యూల్ వివరాలు విడుదల (2027)* 📊

భారత జనగణన రెండో దశ జనగణన షెడ్యూల్ ఇలా ఉంది:

🖥️ ఆన్‌లైన్ స్వీయగణన (Self-Enumeration):

👉తేదీలు: 2027 జనవరి 10 నుండి జనవరి 24 వరకు ..వ్యవధి: 15 రోజులు

🏡 2. ఇంటింటి గణన (House-to-House Census):

👉తేదీలు: 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు..వ్యవధి: 35 రోజులు

📝 3. రివిజనల్ రౌండ్ (Revisional Round):

👉తేదీలు: 2027 మార్చి 1 నుంచి మార్చి 5 వరకు...వ్యవధి: 5 రోజులు.
📢 *AP పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు - నవంబరు 1 నుంచి అమల్లోకి!*

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పింఛన్ల చెల్లింపు విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై పింఛను మొత్తం రెండు మార్గాల్లో అందనుంది.

🔹 *కొత్త మార్పులు ఇవే:*
• *రాష్ట్ర వాటా:* సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నేరుగా నగదు రూపంలో అందుతుంది.
• *కేంద్ర వాటా:* డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ (*DBT*) ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది.

💰 *కేటగిరీల వారీగా చెల్లింపు వివరాలు:*
1️⃣ *వృద్ధులు, ఒంటరి మహిళలు (మొత్తం ₹4,000):*
• రాష్ట్ర వాటా నగదు: *₹3,800*
• కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో (DBT): *₹200*

2️⃣ *దివ్యాంగులు (మొత్తం ₹6,000):*
• రాష్ట్ర వాటా నగదు: *₹5,700*
• కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో (DBT): *₹300*
*14 వ తేదీ (లేదా) దసరా పండుగ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు??*

*అమరావతి : 14 వ తేదీ సాయంత్రం లేదా దసరా పండగ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం*
🛒 *ఏపీ ప్రజలకు పండుగ వేళ గుడ్ న్యూస్! - డీ-మార్ట్ కంటే తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు!*

ఆంధ్రప్రదేశ్‌లోని 151 రైతుబజార్లలో తక్కువ ధరలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

🍚 *బియ్యం ధరల వివరాలు:*
🔹 BPT సన్నబియ్యం – కిలో ₹49
🔹 26 కేజీల బియ్యం బ్యాగ్ అందుబాటులో
🔹 నెల్లూరు KNM బియ్యం – కిలో ₹50
🔹 మార్కెట్ ధర ₹85గా మంత్రి వెల్లడి

🛍️ పండుగ సందర్భంగా డీ-మార్ట్ ధరల కంటే 35% తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి ప్రకటించారు.

📍 విజయవాడ రైతుబజారులో బియ్యం పంపిణీ ప్రారంభించారు.
*రాష్ట్రంలో విలీన గ్రామపంచాయితీలు.. కీలక ఉత్తర్వులు జారీ*

▪️మున్సిపాలిటీల్లో విలీనం చేసిన 112 గ్రామ పంచాయతీల కారణంగా ప్రభావితమైన మండల ప్రజా పరిషత్‌లను, వాటి పరిధిలో మిగిలిన గ్రామ పంచాయతీలతో తిరిగి ఏర్పాటు చేసినట్లుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️విలీనం కారణంగా ప్రభావితమైన మండల ప్రజా పరిషత్‌లను, వాటి పరిధిలో మిగిలి ఉన్న గ్రామ పంచాయతీలతో తిరిగి ఏర్పాటు చేసినట్లుగా పరిగణించాలని ప్రభుత్వం ప్రకటించింది.
▪️ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 148(3) ప్రకారం ఈ చర్య చేపట్టారు.
▪️ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 01-10-2026న W.A.No.1063/2026 మరియు సంబంధిత కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
▪️జీవో అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
🗳️ *ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 2026 విడుదల!*

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, జడ్పీటీసీ/ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) షెడ్యూల్ ఖరారు చేసింది. *అక్టోబర్ 14* నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది.

🗓️ *ముఖ్యమైన పోలింగ్ తేదీల వివరాలు:*

▫️ *మున్సిపాలిటీలు / కార్పొరేషన్లు:*
• పోలింగ్: *అక్టోబర్ 28*
• కౌంటింగ్ & ఫలితాలు: *అక్టోబర్ 30*

▫️ *MPTC & ZPTC ఎన్నికలు:*
• పోలింగ్: *నవంబర్ 3*
• ఫలితాల వెల్లడి: *నవంబర్ 5*

▫️ *గ్రామ పంచాయతీ ఎన్నికలు (సర్పంచ్/వార్డులు):*
• 1వ విడత పోలింగ్ & కౌంటింగ్: *నవంబర్ 26*
• 2వ విడత పోలింగ్ & కౌంటింగ్: *నవంబర్ 29*
• 3వ విడత పోలింగ్ & కౌంటింగ్: *డిసెంబర్ 2*
📢 ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - 2,721 టీచర్ పోస్టుల భర్తీ! 👨‍🏫👩‍🏫

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ద్వారా AP DSC-2026 (APTRT) సంక్షిప్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,721 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

📌 ఖాళీల వివరాలు:
• జనరల్ టీచర్లు (SGT, SA): 2,111 పోస్టులు
• స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు: 350 పోస్టులు
• సొసైటీలు / గురుకులాలు: 260 పోస్టులు
• మొత్తం పోస్టులు: 2,721

📝 ముఖ్య సమాచారం:
• పోస్టులు: SGT, స్కూల్ అసిస్టెంట్, ప్రిన్సిపాల్, PGT, TGT, పీఈటీ తదితరాలు.
• ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (CBT).
• పూర్తిస్థాయి నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
📢 *ఏపీలో ఇమామ్‌లు, మౌజన్లకు రూ.22.45 కోట్ల గౌరవ వేతనం విడుదల!*

ఆంధ్రప్రదేశ్‌లోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు ప్రభుత్వం 3 నెలల కాలానికి సంబంధించిన గౌరవ వేతనం నిధులను విడుదల చేసింది.

📌 *కీలక వివరాలు:*
• *మొత్తం విడుదలైన నిధులు:* రూ.22.45 కోట్లు
• *మొత్తం లబ్ధిదారులు:* 9,982 మంది
• *వ్యవధి:* 3 నెలల కాలానికి

💰 *నెలవారీ గౌరవ వేతనం:*
• *ఇమామ్‌లు (4,991 మంది):* నెలకు ₹10,000
• *మౌజన్లు (4,991 మంది):* నెలకు ₹5,000
*ఎన్నికల కోడ్: ఏం చేయకూడదు? (❌ చేయకూడనివి)*

*ఫ్లెక్సీలు, వాల్ రాతలు:*

ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రాతలు ఉండరాదు.

*ప్రలోభాలు:*
ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు పంచడం లేదా ఉచితంగా వస్తువుల పంపిణీ చేయడం తీవ్ర నేరం.

*మత/కుల ప్రచారాలు:* కులాల, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా లేదా వ్యక్తిగత దూషణలతో ప్రసంగాలు చేయకూడదు. ప్రార్థనా మందిరాలను (గుడులు, మసీదులు, చర్చీలు) ప్రచార వేదికలుగా వాడరాదు.

*ప్రభుత్వ వనరులు:* అధికార పక్షం వారు ప్రభుత్వ వాహనాలు, నిధులు, భవనాలను లేదా ప్రభుత్వ పథకాల ప్రచారాలను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.

*కొత్త పథకాలు/పనులు:* ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేదా కొత్త నిధుల మంజూరు చేయకూడదు.

*అనుమతి లేని మైకులు:*
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మైకులు, లాడ్‌స్పీకర్లు వాడకూడదు. పగటిపూట కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి.

*నగదు రవాణా:*
సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 50,000 కంటే ఎక్కువ నగదును రవాణా చేయకూడదు.
Dear All,

Please be informed that the below services have been enabled on Apseva Portal DA/WEDS (employee) login .

1.Re-Issuance of Integrated Certificate
2.Re-Issuance of Income Certificate
3.Water Tax Application
4.Printing of Title Deed-cum-Passbook
Election Nomination Update
*HOLIDAYS - Declaration of General Holiday on the occasion of MAHARNAVAMI on 19.10.2026 (Monday) - The Second Saturday of November (14-11-2026) be working day in lieu of Holiday on 19-10-2026 All the personnel engaged in the election process /election related activities be continue to attend to their assigned duties Notification Issued.*