VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*సదరం స్లాట్లు బుక్ చేసుకొనుటకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి !!!*
> ఏపీలో అర్నాబ్ తుఫాన్ డేంజర్ బెల్స్.. తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కి.మీ వేగంతో కదులుతున్న అర్నాబ్ తుఫాన్.. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా అర్నాబ్.. అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి కోస్తాంధ్రపై విరుచుకుపడే ప్రమాదం.. కోనసీమకు పొంచి ఉన్న పెను ముప్పు.. ఏపీ, ఒడిశాలకు రెడ్ అలర్ట్ జారీ.. బుధవారం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
కాకినాడ జిల్లాలో రేపు ఎల్లుండి(27 & 28)అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు అన్ని కూడా సెలవు ప్రకటించడమైంది. - జిల్లా కలెక్టర్
అర్నబ్ తుఫాను ప్రభావం అక్టోబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 29వ తేదీ వరకు కొనసాగుతుంది 🌀
*IMPORTANT MESSAGE

In view of the severe Cyclone Arnab and as per the instructions of the Respected District Collector Sir, local holidays are hereby declared for all management schools on 27.10.2026 (Tuesday) and 28.10.2026 (Wednesday) to compensate for the ensuing public holidays*


Regards,
*DEO, Krishna*
⚠️ తుఫాను హెచ్చరిక – ఆంధ్రప్రదేశ్

🌪️ అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మంగళవారం, బుధవారం (అక్టోబర్ 27, 28) విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం.
*RRRకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ*
*రేపు మ.12 గంటల నుంచి....*
📢 విశాఖపట్నం జిల్లా పాఠశాలలకు సెలవుల ప్రకటన
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మరియు కరస్పాండెంట్లకు తెలియజేయునది ఏమనగా, అర్నబ్ తుఫాను అంచనాల నేపథ్యంలో, జిల్లా కలెక్టర్, విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు 2026 అక్టోబర్ 27, 28 తేదీలలో విశాఖపట్నం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడమైనది.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, పాఠశాలలకు రాకపోకల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవడమైనది.
ప్రస్తుతం ప్రకటించిన సెలవులకు బదులుగా ఇతర రోజుల్లో పనిదినాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడతాయి.
జిల్లా విద్యాశాఖాధికారి (DEO)
విశాఖపట్నం జిల్లా
🌊🌧️*అర్నాబ్ తుఫాను ప్రభావం వలన రేపు(27), ఎల్లుండి (28) స్కూళ్లకు ఇప్పటివరకు సెలవులు ప్రకటించిన జిల్లాలు*
*1. తూర్పుగోదావరి*
*2.కాకినాడ*
*3.కోనసీమ అంబేద్కర్*
*4.కృష్ణా**
*5. విజయనగరం*
*6. కాకినాడ*
*7. NTR*
*8. విశాఖపట్నం*
పత్రికా ప్రకటన ఏలూరు, అక్టోబర్, 26: జిల్లాలో అర్నాబ్ తుపాను తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27, 28 సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు. ------------------------------------------------------ ( జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది)
📢 *ముఖ్యమైన ప్రకటన – పాఠశాలలకు సెలవులు*

అన్ని డిప్యూటీ విద్యాశాఖాధికారులు (DYEOS), మండల విద్యాశాఖాధికారులు (MEOS) మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
“అర్నబ్” తుఫాను కారణంగా 27.10.2026 మరియు 28.10.2026 తేదీలలో అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించడమైనది.

కావున, అన్ని డిప్యూటీ విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకొని, ఈ రెండు రోజుల్లో ఏ యాజమాన్యానికి చెందిన పాఠశాలలు కూడా నిర్వహించకుండా అన్ని పాఠశాలలకు సమాచారం అందించవలసిందిగా కోరడమైనది.

*ముఖ్యమైన సూచనలు:*
1. MEO కార్యాలయాలు యథావిధిగా పనిచేయాలి.
2. మండల విద్యాశాఖాధికారులు (MEOలు), MRC సిబ్బంది మరియు CRMTలు విధిగా కార్యాలయాలకు హాజరు కావాలి.
3. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలి.

జిల్లా విద్యాశాఖాధికారి (DEO)
విజయనగరం జిల్లా
*అత్యవసర సమాచారం – అర్నాబ్ తుపాను ప్రభావం*

NTR జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలకు రేపు 27.10.2026 మరియు ఎల్లుండి 28.10.2026 సెలవులు ప్రకటించబడినవి.

తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోబడింది.

🌧️ అందరూ గమనించి, సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలి.

District Educational Officer,
NTR District,Vijayawada.
📢 అతి ముఖ్యమైన సూచన

తుఫాను ప్రభావం దృష్ట్యా పాఠశాలలకు సెలవుల ప్రకటన – సంబంధించి.

డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ‘అర్నబ్’ తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు తేదీలు 27.10.2026 మరియు 28.10.2026 నాడు కాంపెన్సేటరీ సెలవులు ప్రకటించడమైనది.

కావున, పై ఆదేశాలను సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు గమనించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది.

జిల్లా విద్యాశాఖాధికారి
*డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా.*
సైక్లోన్ అర్నబ్ తాజా ఉపగ్రహ చిత్రం ❗️

తుఫాను కన్ను అద్భుతంగా కనిపిస్తోంది! ⚠️ రాబోయే 48 గంటల్లో తీర ఆంధ్రప్రదేశ్‌పై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది!
తుఫాను ఆర్నాబ్‌కు సంబంధించిన తొలి వర్షపు మేఘాల ప్రభావం మరో 1–2 గంటల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రారంభం కానుంది! ⚠️

శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వరకు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. 🌧️
ఈ తుఫానును అంత తేలికగా తీసుకోకండి 🙏
విశాఖపట్నం, ఉత్తరాంధ్రలకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో వర్షాలు 🌀