VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం' అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఓటీపీనా... చెప్పేదిలేదు పో!
Village Secretariat Employees Promotion Channel [ Subject to Correction ]
AP POLYCET 2025 Notification
AP ICET 2025 Notification
AP ECET 2025 Notification
AP EAPCET 2025 Notification
🟡 AP గురుకుల విద్యాలయ సంస్థ

2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 5,6,7,8 వ తరగతులు,జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ మరియు డిగ్రీ ప్రథమ సంవత్సరములో చేరుటకు సువర్ణావకాశం.

➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 01-03-2025

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 31-03-2025

➥ వెబ్సైట్ 👇🏼

https://aprs.apcfss.in
అంగన్వాడి కేంద్రాలకు ఒంటి పూట బడి - సర్కులర్ జారీ.
ఉచిత కుట్టు మిషన్ కొరకు దరఖాస్తు ఫారం
'దీపం-2' పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.
రేపటి [ మార్చి 17 ] నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా RTC బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోగలరు.
📱 *పుర మిత్ర యాప్ సమాచారం*

➥ AI సాంకేతికతతో రూపొందించిన పురమిత్ర' యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తణుకులో ప్రారంచినట్లు పురపా లక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

➥ ఈ యాప్ పట్టణ సేవలను ఫోన్లోనే అందించి, పౌరులకు స్మార్ట్ అర్బన్ గుడ్ గవర్నెన్స్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొ న్నారు.

➥ "నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను పురపాలక, ఇంజినీరింగ్, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరి శుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదులను ఈ యాప్లో అందించవచ్చు.

➥ ఆ ఫిర్యాదులు సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లిన తర్వాత నిర్దిష్ట సమయంలో పరిష్కరి స్తారు. ఆ సమస్య ఎంత వరకు పరిష్కారమైంది, ఏ స్థాయిలో ఉందనేది కూడా ఈ యాప్ ద్వారా తెలుసు కోవచ్చు.

➥ పౌరులు నీటి, డ్రైనేజ్ కనెక్షన్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ నమోదు వంటి సేవలకూ పురమిత్ర అక్కరకు వస్తుంది.

➥ ఆస్తి పన్ను, నీటి బిల్లులు తదితర చెల్లింపులను సులభంగా చేయొచ్చు' అని ఆయన పేర్కొన్నారు.

📱𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen
🔴 *కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు సిద్ధం*

▪️ పింఛన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.

▪️ గ్రామ, వార్డు సచి వాలయ సిబ్బంది పింఛన్లు ఇచ్చేటప్పుడు లబ్దిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్వేర్ను యూఐడీఏఐ సంస్థ ఆధు నికీకరించడంతో గతంలో ఉన్న పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు.

▪️ దీంతో అప్డేడేట్ చేసిన సాఫ్ట్వేర్కు పనిచేసేవిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 పరికరాలను సరఫరా చేసింది.

▪️ సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ, వార్డు సచివాల య శాఖ ఉత్తర్వులిచ్చింది.

▪️ ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. నూతన పరికరాల రాక తో వారి సమస్యలకు చెక్ పెట్టినటైంది.
*క్రొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు సిద్ధం*
*మంత్రి నిమ్మలకు పూతరేకులు పోస్టులో పంపిన వాలంటీర్లు*
OD పై మెప్మాలోకి 402 మంది వార్డు కార్యదర్శులు

➥ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహించేందుకు OD [ On Duty - Deputation ] పై 402 మంది వార్డు సచివాలయ కార్యదర్శులను నియమించనున్నారు.

➥ మెప్మాలో 279 కమ్యూ నిటీ ఆర్గనైజర్ పోస్టులను, 123 సుయోగ్ సెం టర్లలోని ఖాళీలను వార్డు కార్యదర్శులతో భర్తీ చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

➥ ఈ మేరకు జీవీఎంసీ, వీఎం సీతో సహా అన్ని యూఎల్బీల్లోని ప్రాజెక్టు డైరె క్టర్లు సిబ్బందిని కేటాయించాల్సిందిగా మెప్మా ఎండీ తేజ్ భరత్ ఆదేశించారు.
*Deputation పై వస్తే 30% Special Allowance*

➥ అమరావతి పనులు తిరిగిప్రారంభం కానున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత అభి వృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పూర్తిస్థాయిలో సన్నద్ధ మవుతోంది. పెద్దఎత్తున నిర్మాణ పనులు, కార్యకలా పాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అవసరమైన మేర మానవ వనరులు సమకూర్చుకుంటోంది.

➥ వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వేతనంతో పాటు ప్రత్యేక భత్యం ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

➥ డిప్యుటేషన్, ఓడీపై సీఆర్డీఏకు వచ్చే వారికి మూల వేతనంపై 30 శాతం భత్యంగా ఇవ్వనున్నారు.

➥ ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు దీనిని అమలు చేయనున్నారు. ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు.