VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Heavy thunderstorms warning during next 1 to 2 hours in Vizag, Anakapalli, Vizianagaram, Parvathipuram and Srikakulam
*🔰Dear All,*

NPCI IN-ACTIVE ACTION TAKEN ఆప్షన్ నందు కొత్తగా "SCHOOL CHILDREN MOTHER'S IN-ACTIVE NPCI" లిస్ట్ WEA/DA/WWDS/WEDPS వారి NBM లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగింది.
సంబంధిత సిటిజన్ వారి యొక్క ఆధార్ ను బ్యాంకు ఖాతాకి అనుసంధానం /కొత్తగా బ్యాంక్ ఖాతాను IPPB నందు OPEN చేసుకోవాలి అని తెలియజేయగలరు
Rain reducing now in most parts. During next 1-2 hour’s Nellore will see some thunderstorms!!
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. *ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశముంది.* మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50L మంది విద్యార్థులు హాజరయ్యారు.
*ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ*

ఏపీలో ఉచిత నిర్బంధపు విద్యా హక్కు చట్టం కింద( ఆర్టిఇ) ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది.
*ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపి కబురు*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కొక్క పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా సంఘాల పొదుపు నిధులతో ఖర్చు భరిస్తారు. ప్రభుత్వం స్థలం, రూ.1 లక్ష సాయం, వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తుంది, మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ పథకం అమలవుతుంది
ఎస్సీ కార్పోరేషన్ రుణాలు సైట్ ఆన్ లైన్ ప్రారంభం

ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఆర్థిక రుణాలు సైట్ ఆన్ లైన్ ప్రారంభమైనది. నేటి నుంచి మే నెల 10 వ తేది వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

అర్హతలు:
1) లబ్ధిదారుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి., కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
2) లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ కు చెంది ఉండాలి.
3) లబ్ధిదారుల వయోపరిమితి 21 నుంచి 50 ఏళ్లు.
4) లబ్ధిదారుడు దారిద్య్రరేఖకు దిగువన (బిపిఎల్) కేటగిరీ కింద ఉండాలి.
5) స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి లబ్ధిదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
6) లబ్ధిదారునికి జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ ఉండాలి.

కావాల్సిన పత్రాలు
1. ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్.
2. రేషన్ కార్డు
3. కులం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం
4. రవాణాకు సంబంధించి అయితే డ్రైవింగ్ లైసెన్స్. #Loans
*ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల*

➥ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న (9.30 నుంచి12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3పరీక్షలు నిర్వహించనుంది.

➥ ఈ నెల 18న హాల్టికెట్లు రిలీజ్ అవుతాయి.

➥ గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు APR 28, 29 తేదీల్లో పరీక్షలు

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర*
ప్రతి నెల 3వ శనివారము - స్వచ్చ దివస్ కార్యక్రమము

19.04.2025
*April Theme: "e Check:*

*I. Preparations* :
👉స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంనకు సంబంధించి *శుక్రవారం* ప్రజలందరికీ తెలిసే విధంగా *టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు* చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడడం.
👉e waste Kiosks/Stalls ద్వారా *e-waste ను సేకరణ* చేస్తున్నట్లు ప్రజలందరికీ తెలియజేయవలెను.

*Ii. Office Cleaning:*
👉 కార్యాలయాలలో deep cleaning చేయవలెను. Computer systems,, Printers, IT infrastructure, tables, racks etc శుభ్రం చేసి, files చక్కగా సర్దవలెను.

*III. Kiosks/Stalls ఏర్పాటు:*
👉అన్ని కార్యాలయాలలో e waste కు సంబంధించిన వస్తువులను సేకరించి ప్రతి GP లోనూ ఒక చోట అనగా Kiosks/Collection Drum or box లను ఏర్పాటు చేసి నిల్వ చేయవలెను.
👉 *అన్ని మేజర్ మరియు హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ లలో* Kiosks/Stalls ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలు, సంస్థలు మరియు ప్రజల నుండి e-waste సేకరించవలెను.

*IV. Awareness Activities:*
👉ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ వేస్ట్ జనరేట్ చేసే సంస్థలు మరియు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో *పాల్గొని*, అవగాహన పెంచుకోవడమే కాకుండా *e waste disposal తమ బాధ్యతగా* స్వీకరించి ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకై కృషి చేయవలెను.
👉 E-waste కు సంబంధించిన *Posters* ను public places లో display చేసి అందరికీ అవగాహన కల్పించవలెను.
👉 e-waste వల్ల ఆరోగ్యం మరియు పర్యావరణానికి కలిగే *దుష్ప్రభావాల గురించి* ప్రజలకు అవగాహన కల్పించవలెను.
👉E-waste కు సంబంధించిన ప్రతి GP లలో, అవగాహన *ర్యాలీలు, మానవహారం, ప్రతిజ్ఞ* కార్యక్రమాలు నిర్వహించవలెను.
👉 ప్రతి గ్రామపంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఏప్రిల్ నెల థీమ్ పై ప్రత్యేక *గ్రామసభ* నిర్వహించవలెను.
👉జిల్లా స్థాయిలో identify చేసిన e-waste Scrap dealers ద్వారా *dispose* చేయుటకు చర్యలు తీసుకొనవలెను.

*V. REPORTING* :
పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను *Photos Videos* తీయించి SASA group లో share చెయ్యాలి.
SASA report మీకు send చేసే, *Excel format* లో కూడా పంపవలెను.
*SASA APP 1.5 version* లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు, అధికారులకు, మీడియా కు ముందుగానే సమాచారం అందించి, ఈ పనులన్నీ వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి, విజయవంతం చేయవలెను.
DGPO Anakapalli.
✅ *పాస్టర్లకు గతేడాది మే నెల నుంచి నవంబర్ నెల వరకు గౌరవవేతనం చెల్లించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున అందజేయనున్నారు.*
Very high chances of thunderstorms today evening or night in Srikakulam, Vizianagaram, Anakapalli, Araku, Parvathipuram, vizag , eluru, Rajahmundry, Kakinada, Vijayawada, Guntur, prakasam,kurnool, kadapa, Chittoor, Tirupati & Anantapur ‼️
ప్రభుత్వ మహిళా ఉద్యోగినుల ప్రొబేషన్ ప్రకటనకు ప్రసూతి సెలవులను లెక్కించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా నియమితులైన ఉద్యోగినులు ప్రసూతి సెలవులు తీసుకున్నా ప్రొబేషన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సెలవులను లెక్కలోకి తీసు కొని ప్రొబేషన్ ప్రకటిస్తారు.
*ప్రతి జిల్లాకు ఒక ఐటీ మేనేజర్ ను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవడానికి ప్రభుత్వం అనుమతి*

ఐటీ మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖ ద్వారా ప్రతి జిల్లాల్లో ఐటీ టెక్నాలజీ సేవలు పునర్నిర్మాణం మరియు విస్తరణ కోసం జిల్లాకు ఒక ఐటీ మేనేజర్ ను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

*అర్హతలు & అనుభవం:*

B.Tech/ M.sc (కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలెక్ట్రానిక్, ఎలక్ట్రికల్) రంగాల్లో 3 సం.ల అనుభవం ఉండాలి. జీతం: నెలకు 40 వేలు చెల్లిస్తారు.

*డ్యూటీ బాధ్యతలు:*

▪️జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కార్యాలయాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు నెట్‌వర్క్‌లతో సహా ఐటీ మౌలిక సదుపాయాలను నిర్వహించడం.
▪️కలెక్టరేట్ మరియు దాని సబార్డినేట్ కార్యాలయాలలో IT వ్యవస్థలు మరియు అప్లికేషన్లను అమలు చేయడం.
▪️వినియోగదారులకు టెక్నికల్ సపోర్ట్ అందించడం.
▪️IT వ్యవస్థలు మరియు డేటా యొక్క భద్రతను నిర్ధారించడం.
▪️జిల్లా స్థాయిలో ITE&C విభాగం యొక్క IT ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడం మరియు అమలు చేయడం.
▪️జిల్లాలో వెబ్‌నార్లు, వర్క్‌షాప్‌లు మరియు వాణిజ్య ప్రదర్శనలు వంటి ఐటీ సంబంధిత ఈవెంట్‌ల ప్రణాళిక మరియు అమలు.
▪️IT ప్రమోషన్లు, ప్రచారాలు మరియు కార్యక్రమాల ప్రణాళిక మరియు అమలు..
GSWS Employee Mobile App 7.3 Updated to Version
17.04.2025

Implemented offline in Mana Mitra Awareness campaign.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Good chances of thunderstorms today evening in Srikakulam, Vizianagaram, Araku, Parvathipuram , Eluru, Rajahmundry, Vijayawada, Guntur ,kurnool, nandyal, Chittoor, Tirupati & Anantapur ‼️
Minutes of the VC 17.4.25.pdf
42.1 KB
Minutes of the VC 17.4.25.pdf

Minutes of the Video Conference conducted by the Director, GSWS Department with GSWS Officers In-Charge, Municipal Commissioners, DLDOs, MPDOs, DCs & ADCs on 17.04.2025