VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔑 *To Get OTP Option For Rice Card Application eKYC Download V8.3 GSWS Employees App From Below Link*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*జూన్ రెండు, నాలుగో వారంలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు*

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 5-15 ఏళ్ల వయసు గల 56,21,743 మందికి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసేందుకు జూన్ రెండో వారం, నాలుగో వారంలో స్కూల్స్, కాలేజీలు, సచివాలయా ల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు గ్రామ/వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జూన్ 10-13వ తేదీ వరకు, జూన్ 24-27వ తేదీ వరకు ఈ క్యాంపులను నిర్వహించాలని పేర్కొన్నారు.
APSEVA_Downtime_PressNote_Telugu.pdf
165.6 KB
Dear All,
APSEVA portal will not work from 07-06-2025 to 10-06-2025 due to migration activities.
Please print the above information and display in all the Village/ Ward secretariats for the information of the Citizens.
ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్ స్కీమ్ను EHSతో సమాంతరంగా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 1-4-2025 నుండి 31-04-2026 వరకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది.
Under Maintenance
💰 *డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా*

➥ డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది.

➥ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్స్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్తీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు.

➥ ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

➥ ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింప చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ' చేతులమీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

➥ స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు,యూనిఫాం, ఇతర వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు.

➥ సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండేపాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. అయితే ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి.

➥ రుణ మొత్తాన్నివాయిదాల రూపంలో చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్ఠంగా 24 నెలల నుంచి గరిష్ఠంగా 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. ఏడాదికిరూ.200 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
GSWS Employees Transfers Note
Source : ఆంధ్ర ప్రభ
• దేశ వ్యాప్తంగా 5,755 యాక్టివ్ కరోనా కేసులు
• నిన్న(జూన్ 6) కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతి
• APలో నిన్న ఒక్క రోజే 10, తెలంగాణలో 4 కేసులు వెలుగుచూడగా
• ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులున్నాయి
✅ *Intermediate Public Advanced Supplementary Examinations (IPASE) May-2025 Results ≈ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల*

👇👇

https://resultsbie.ap.gov.in/
*జూన్ 20న PM కిసాన్ డబ్బు రూ.2 వేలకు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ తొలి విడతగా రూ. 5 వేలు కలిసి రూ.7 వేలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. OCTలో రెండో విడత, వచ్చే జనవరిలో మూడో విడత జమ చేస్తారని సమాచారం. PM కిసాన్ డబ్బు జమ తేదీ మారితే అనుగుణంగా ఈ డేట్ కూడా మారే అవకాశముంది. ఈ పథకానికి 45.71 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు.*
🎒 *విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు*

➥ *రెండో విడత ప్రవేశాల ఫలితాలు 14న విడుదల.*

➥ ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించి నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివా సరావు తెలిపారు.

➥ ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను విద్యాహక్కు చట్టం కింద భర్తీ చేస్తున్నారు. మొదటివిడతలో 23,117 మందికి సీట్లు కేటాయించగా.. ఈ నెల 7లోపు పాఠశాలల్లో చేరాలని సూచించారు. 7న బక్రీద్, 8న ఆదివారం సెలవుల కారణంగా గడువును 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు.

➥ రెండో విడత ఆర్టీఈ ప్రవేశాల ఫలితాలను జూన్ 14న విడుదల చేసి, సీట్లు పొందినవారు 21లోపు ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం.

--సర్టిఫికెట్, మెడల్, రూ.20,000 నగదు..

*✳️ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' అవార్డులు*

రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘Shining Stars’ పేరుతో ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవార్డులు అందించనుంది.

*✅ అవార్డుల ప్రధానోత్సవం* :
ఈనెల 9వ తేదీన జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో

*✳️అవార్డులో లభించేవి:*
* ₹20,000 నగదు బహుమతి
* మెడల్
* ప్రశంసాపత్రం

*అవార్డుల ఎంపికకు అర్హతలు*

✅ పదవ తరగతి విద్యార్థులు:
👉500 పైగా మార్కులు సాధించిన వారు ప్రతి మండలానికి 6 మంది ఎంపిక
 • OC – 2 • BC – 2  • SC – 1 • ST – 1 (Boy or Girl)

✅ *ఇంటర్మీడియట్ విద్యార్థులు* :
👉830 పైగా మార్కులు సాధించిన వారు ప్రతి జిల్లాకు 36 మంది ఎంపిక చెస్తారు..
✅ *అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ప్రతి సచివాలయానికి రూ.5,000 పరిపాలనా ఖర్చుల నిమిత్తం మంజూరు చేయనున్నారు. ఈ నిధులు త్వరలోనే సంబంధిత మండలం/పట్టణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయబడతాయి.*
ఉపాధి వేతనదారులకు కేంద్రం ఎనిమిది వారాల బిల్లు బకాయిలు విడుదల చేసింది.
*ప్రస్తుతం AP సేవ పోర్టల్ క్లోజ్ చేయడం వల్ల రైస్ కార్డ్ ekyc అవ్వడం లేదు. మరలా జూన్ 12 నుండి వర్క్ అవుతుంది.*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 09.06.2025న ఉదయం 07.00 గంటల నుండి జిల్లా స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో ఇప్పటికే పేర్కొన్న అన్ని ప్రదేశాల నుండి యోగా ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించింది.
‼️ *MBU Survey* ‼️

స్టాప్ అందరికీ గుడ్ మార్నింగ్... GSWS Employees Mobile App లొ కొత్తగా Mandatory Biometric Update [ MBU ] అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో క్లస్టర్ల వారీగా పెండింగ్ లిస్ట్ ఉంటుంది. మీకు కేటాయించిన క్లస్టర్ ఓపెన్ చేసి అందులో పెండింగ్ ఉన్నవారికి సర్వేను పూర్తి చేయాల్సి ఉంటుంది.

MBU అంటే ఆధార్ కార్డు కలిగి 5 సంవత్సరాలు పూర్తయిన వారు తప్పనిసరిగా ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది, అలా పూర్తి చేసుకున్నట్టయితే పూర్తి చేసుకున్నారని పిక్ చేసి వారి యొక్క Biometric / Irish / Face ద్వారా వారికి సర్వేను పూర్తి చేయాల్సి ఉంటుంది.

పూర్తి చేసుకోలేదని సబ్మిట్ చేస్తే సబ్మిట్ అవుతుంది. 50% సర్వే పూర్తి అవుతుంది. వారికి సమాచారం అందించి ఆధార్ సెంటర్కు వెళ్లి వారు బయోమెట్రిక్ ని పూర్తి చేసుకున్న తర్వాత, మన వద్ద Biometric / Irish / Face ద్వారా మిగతా సర్వేను (50%) పూర్తి చేయాల్సి ఉంటుంది.
నేడు ఉదయం 11.15 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పథకాలు, ప్రజాభిప్రాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏడాది పాలన వార్షికోత్సవంపై మంత్రులతో చర్చించే అవకాశం.