VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🗓️ 2025 ఆగస్టు నెలలో సెలవులు

1️⃣ 03.08.2025 - ఆదివారం

2️⃣ 08.08.2025 - వరలక్ష్మీ వ్రతం

3️⃣ 09.08.2025 - రెండవ శనివారం

4️⃣ 10.08.2025 - ఆదివారం

5️⃣ 15.08.2025 - స్వాతంత్ర్య దినోత్సవం

6️⃣ 16.08.2025 - శ్రీకృష్ణాష్టమి

7️⃣ 17.08.2025 - ఆదివారం

8️⃣ 24.08.2025 - ఆదివారం

9️⃣ 27.08.2025 - వినాయక చవితి

🔟 31.08.2025 - ఆదివారం

👉 మొత్తం రోజులు : 31

👉 సెలవు దినాలు : 10

👉 పని దినాలు : 21

Optional Holidays

15.08.2025 : Parsi New Year's day/Arbaeen
కాకినాడ: రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఉద్ఘాటించారు.
✒️కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ!

Jul 27, 2025,

కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ!
తెలంగాణ : కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేందుకు కసరత్తు చేస్తోంది. 30 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరనుంది.£
*ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ*

*రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ*

* రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
* ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది.
* ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని అదే రోజున పిఎం కిసాన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండు కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు
NTR Bharosa Pensions - Releases - July 2025.xls
6.1 MB
NTR Bharosa Pensions - Releases - July 2025

Dear All, NTR Bharosa Pension amount Rs.2734 cr for the month will be adjusted to all bank branches on 31.07.2025 Morning. Kindly inform to all our staff and Bank Branches to provide cash on 31.07.2025, so as to disburse the pensions on 01.08.2025.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు 1న కొత్తగా 1,09,155 మందికి స్పౌజ్ పింఛన్లు అందించనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. లబ్ధిదారులకు నెలకు రూ.4 వేల చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు జులై 29తో ముగియనుంది. 5వ క్లాస్ పూర్తైన, ప్రస్తుతం చదువుతున్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. APలో 15, TGలో 9 నవోదయ విద్యాలయాల్లో సీట్లు భర్తీ చేయనుండగా, డిసెంబర్ 13న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. 2026 మార్చిలో ఫలితాలను వెల్లడిస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 👇🏼

https://cbseitms.rcil.gov.in/nvs/
HRM Profile -Updating Details of Functionary (Tranferred in).pdf
807.6 KB
గ్రామ వార్డు సచివాలయాలలో కొత్తగా బదిలీ అయిన వారు బదిలీ అయిన సచివాలయంలో HRMS పోర్టల్ నందు వారి వివరాలు అప్డేట్ చేయుటకు ఉపయోగపడే యూజర్ మాన్యువల్.

HRMS Profile – Updating of Details of Functionary (Transferred in)
‼️ *పంచాయతీ కార్యదర్శులకు గమనిక :*

1. హౌస్ టాక్స్ డేటా ప్యూరిఫికేషన్ లో భాగంగా 2025-26 FY కు సంబందించి కొత్త అసెస్మెంట్ జోడించుట మరియు గత లిస్టులో మిస్సయిన అసెస్మెంట్లను జోడించుటకు కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

2. డేటా ప్యూరిఫికేషన్ లో ఏవైనా అసెస్మెంట్లు తప్పుగా సబ్మిట్ చేసి ఉంటే Unfreeze ఆప్షన్ ఉపయోగించుకొని సరి చేసుకోవచ్చు.

3. ఈ అవకాశం కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందరు కార్యదర్శులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పంచాయతీ పరిధిలో తప్పుగా అప్డేట్ అయినవి అసెస్మెంట్లు మరియు కొత్తగా జోడించాలనుకునే అసెస్మెంట్లో మిస్సయిన అసెస్మెంట్లో వివరాలను అప్డేట్ చేయగలరు.
తక్షణ చర్య అవసరం – సీనియారిటీ లిస్టులు & సర్వీస్ రిజిస్టర్లు,

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గారి తాజా సర్క్యులర్ ప్రకారం:

✅ వార్డు కార్యదర్శుల సీనియారిటీ లిస్టులు తయారుచేసి
✅ సర్వీస్ రిజిస్టర్లు అప్డేట్ చేసి
✅ తుది లిస్టు 31 జూలై 2025 లోగా పంపాలి.

⚠️ ఆలస్యం జరిగితే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
*ఆంధ్ర ప్రదేశ్ లో MPTC & ZPTC ఎన్నికల నోటిఫికేషన్.*
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఉప ఎన్నికలు – కొన్ని ఖాళీ స్థానాలకే మాత్రమే

అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండటంతో, ఆయా స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇప్పటికే జూలై 28న నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలకు సంబంధించినది కాదు. కొద్ది మండలాల్లో మాత్రమే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికలు జరగనున్న ఖాళీ స్థానాలు ఇవే:

🔹 ఎంపీటీసీ – రామకుప్పం, కారంపూడి, విడవలూరు
🔹 జడ్పీటీసీ – పులివెందుల, ఒంటిమిట్ట
🔹 సర్పంచ్ – కొండపూడి, కడియపులంక

📅 నామినేషన్ల తేదీలు: జూలై 30 – ఆగస్టు 1
🗳️ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: ఆగస్టు 12
📊 ఫలితాల విడుదల: ఆగస్టు 14
🏡 సర్పంచ్ ఎన్నికలు: ఆగస్టు 10 (ఫలితాలు అదే రోజున)

👉 గమనిక: ఈ ఎన్నికలు ప్రత్యేకంగా కొన్ని ఖాళీగా ఉన్న స్థానాలకు మాత్రమే వర్తిస్తాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ఉండదు.
*‼️THALLIKI VANDANAM UPDATE*

Raise the Thalliki Vandanam Grievance (Four wheeler,Income tax) who is holding the tag with their aadhar

Note: *Raise the fresh Grievances for the old Thalliki Vandanam Grievance also in the name of tag holding*
జూలై నెల శాలరీ బిల్స్ సబ్మిట్ చేయుటకు ఈరోజే చివరి తేదీ. కావున ఎవరివైనా పెండింగ్ ఉంటే శాలరీ బిల్స్ సబ్మిట్ చేసుకోగలరు. అలాగే CFMS పోర్టల్ DDO లాగిన్ లో కూడా బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేసేందుకు కూడా ఈరోజే చివరి తేదీ (29.07.2025).
*🟣P4 Mismatch డేటా సరి చేసేటప్పుడు PS లకు OTP Issue ఉన్నచో*

ముఖ్యంగా బదిలీలో వచ్చిన PS లకు OTP రాకుండా,వారి ముందున్న PS మొబైల్ నెంబర్ కు OTP వెళ్తూ ఉన్నది. ఈ ISSUE Clear అయ్యేందుకు గాను

1.ముందుగా GSWS OLD పోర్టల్ DA/PS లాగిన్ నందు *Edit ఎంప్లాయీస్* నందు కొత్తగా బదిలీలో వచ్చిన PS వివరాలను అప్డేట్ చేయవలెను.Create అయిన *User ID కు Password* సెట్ చేసుకోవలెను.

*🟡Note:*

GSWS Old పోర్టల్ లాగిన్ credentials నే NBM మరియు HRMS పోర్టల్ లాగిన్ credentials అవుతాయి.

2.*HRMS లాగిన్* నందు *ప్రొఫైల్ అప్డేట్* చేయవలెను.

3.అలాగే *NBM పోర్టల్ లో కూడా ప్రొఫైల్ అప్డేట్* చేయవలెను.

(NBM పోర్టల్ లో *Left side చివర్లో Update Profile* ఆప్షన్ ఉంటుంది)

పై మూడు పనులు పూర్తి చేసాక మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
📍 *తల్లికి వందనం – అప్డేట్*

🔹 చేయవలసిన చర్య:
తల్లికి వందనం పథకం కింద ఈ సమస్యలకు సంబంధించిన grievance (ఫిర్యాదు) నూతనంగా నమోదు చేయండి:

ఫోర్ వీలర్ (Four Wheeler) కలిగిఉండటం

ఇంకం ట్యాక్స్ (Income Tax) సమస్యలు


📌 గమనిక:
గతంలో తల్లికి వందనం విషయంలో grievance చేసినవారు కూడా, tag ఉన్న వ్యక్తి ఆధార్ ద్వారా మళ్లీ కొత్త grievance నమోదు చేయాలి.

✳️ Tag కలిగిన వ్యక్తి పేరుతోనే grievance నమోదు చేయాలి.
🍂 ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 25 నుండి డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ - నాదెండ్ల మనోహర్

🍂 డిజిటల్ సైన్ అయి పెండింగ్ ఉన్న అన్ని కార్డుదారులకు ఆగస్టు 25 నుండి శాంక్షన్ అవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజలకు వినూత్న సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 21 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కొత్త డిజిటల్ కార్డులు గతం కన్నా ఎంతో ఆధునికంగా, వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉండబోతున్నాయి.

కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో రానున్నాయి. ముఖ్యంగా ఈ డిజిటల్ కార్డులు డెబిట్, క్రెడిట్ కార్డుల సైజులో ఉండేలా రూపొందించబడ్డాయి. ఇలా చిన్న సైజులో ఉండడం వల్ల ఎవరైనా తమ పర్సులో ఈ కార్డును సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇకపై పెద్ద పెద్ద పత్రాలు, కాగితాలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

కొత్త కార్డులో ప్రధానంగా ఓ క్యూఆర్ కోడ్‌ను జత చేయనున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సంబంధిత వ్యక్తి సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ హక్కులు వంటి డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు. అధికారులు కూడా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వెంటనే సంబంధిత సమాచారాన్ని పొందగలుగుతారు. ఇది డేటా నిర్వహణను మెరుగుపరచడమే కాకుండా అవకతవకలకు తావు లేకుండా చేస్తుంది.
ఇంకొన్ని కీలకమైన మార్పుల్లో ఒకటి—ఈ కొత్త రేషన్ కార్డులపై ఇకపై ఎటువంటి రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవు. గతంలో ప్రజలకు అందజేయబడే కార్డులపై ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండటం వల్ల రాజకీయ రంగు కొంత ఉండేది. ఇకపై దీనికి పూర్తిగా చెక్ పెడుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇది ప్రజా పరిపాలనలో పారదర్శకతకు నిదర్శనం.

ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఈ కొత్త డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాల వారీగా, దశల వారీగా ఈ ప్రక్రియ సాగుతుంది. ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాలకు, వాలంటీర్లకు, విభాగాల అధికారులకు ఈ విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత ఆధునిక సేవలు అందించడమే కాకుండా, పౌరసరఫరాల శాఖలో ఉన్న తలెత్తే సమస్యలను తగ్గించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది. ఆధునికత, పారదర్శకత, వినియోగదారుల సౌలభ్యం అనే మూడు ముఖ్య లక్ష్యాలతో రూపొందించబడిన ఈ కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు నాంది పలకనున్నాయని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
🔥 *కొత్త రేషన్ కార్డుల అప్డేట్*

1. APలో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

2. ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు.

3. QR కోడ్తో అందించే కొత్త కార్డులపై నేతల ఫొటోలు ఉండవని ఆయన స్పష్టం చేశారు
ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం యాప్ - జగన్