VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
*AP Inter Fee Payment 2027 Schedule*
*📢 AP ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం*

*🎓 AP Inter IPE March 2027 పరీక్షల ఫీజు తేదీలు విడుదల*

*📅 ఫీజు చెల్లింపు – జరిమానా లేకుండా:*
➡️ 24-09-2026 నుంచి 29-10-2026 వరకు

*⚠️ ₹1,000 జరిమానాతో:*
➡️ 30-10-2026 నుంచి 10-11-2026 వరకు

*💰 పరీక్ష ఫీజు:*
🔹 థియరీ – ₹600
🔹 ప్రాక్టికల్స్ – ₹275
🔹 Bridge Course – ₹165
🔹 1st & 2nd Year Theory – ₹1,200

*🚨 ముఖ్య గమనిక:*
❌ 10 నవంబర్ 2026 తర్వాత పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఎలాంటి పొడిగింపు ఉండదని BIEAP తెలిపింది.
> తుఫాన్‌ ప్రభావంతో అంధకారంలో శ్రీకాకుళం. ఈదురు గాలులతో విద్యుత్‌ సరఫరా నిలిపివేత. ప్రజల భద్రత కోసమే సరఫరా నిలిపివేసిన విద్యుత్‌ శాఖ. అవసరం లేకుండా బయటకు రావొద్దని అధికారుల సూచన.
> వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా పయనం. కళింగపట్నానికి 30 కి.మీ, విశాఖకు 90 కి.మీ, గోపాల్‌పూర్‌కు 160 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం. ఇవాళ రాత్రి 11-12 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.
⚠️ తీవ్ర వర్ష హెచ్చరిక

వచ్చే 2 గంటల పాటు విశాఖపట్నం నగరం మొత్తం ఎడతెరిపిలేకుండా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ⚠️ అప్రమత్తంగా ఉండండి.

శ్రీకాకుళం వద్ద తుఫాను తీరం దాటే ముందు భారీ వర్ష మేఘాలు విశాఖ వైపు దూసుకొస్తున్నాయి. 🌧️
అన్ని ప్రధానోపాధ్యాయులు (HMలు) మరియు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
ప్రస్తుతం నెలకొన్న తుఫాను పరిస్థితుల దృష్ట్యా, విజయనగరం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ గారు 24.09.2026 (గురువారం) తేదీని అన్ని యాజమాన్య పాఠశాలలకు పరిహార సెలవు (Compensation Holiday)గా ప్రకటించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
కావున, అన్ని ఉపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయవలసిందిగా కోరడమైనది.
— జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం
🚨 విశాఖపట్నంకు ఈ రాత్రి తీవ్ర వర్ష హెచ్చరిక ⚠️

సైక్లోన్ 01B శ్రీకాకుళం–కళింగపట్నం సమీపంలో తీరం దాటుతున్న నేపథ్యంలో, భారీ వర్షపు మేఘాలు విశాఖ వైపు దూసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ⚠️

రాబోయే 10–12 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ. లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ❗️

🚨 విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!
🌧️ భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా *పశ్చిమ గోదావరి జిల్లాలోని* పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.

అలాగే సెప్టెంబర్ 24, 2026న
* విశాఖపట్నం
* అనకాపల్లి
* అల్లూరి సీతారామరాజు (ASR)
* తూర్పు గోదావరి
* విజయనగరం
జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 🌧️⛈️

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలల తాజా సూచనలను గమనించగలరు.
*ఏపీలో 7 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్‌ అలర్ట్*
అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి..
పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్
ఉ.11:30లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం - ఐఎండీ
Cyclone is over ✅
మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవన (Monsoon) కాలం ముగియనుంది. అక్టోబర్ 1 నుండి అధికారికంగా ఈశాన్య రుతుపవన / Post-Monsoon కాలం ప్రారంభమవుతుంది.
🌪️ అదే సమయంలో Cyclone Season కూడా ప్రారంభమయ్యే కాలం కావడంతో, వాతావరణ మార్పులు మరియు తుఫానులపై అప్రమత్తంగా ఉండాలి.
> ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపుల రెన్యువల్‌కు నోటిఫై. నిన్న అర్ధరాత్రితో ముగిసిన మద్యం షాపుల రెన్యువల్ గడువు. రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులు తిరిగి రెన్యువల్ చేసుకున్న యజమానులు. రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు. గతంలో మిగిలిన షాప్స్‌ను కలుపుకుని 807 దుకాణాలకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 3న పరిశీలన. లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్న ఏపీ ఎక్సైజ్ శాఖ.
*🏫 నేడు స్కూళ్లకు సెలవు!*

🌧️ భారీ వర్షాలు & తీవ్ర వాయుగుండం కారణంగా APలో పలు జిల్లాల్లో స్కూళ్లకు Holiday!

📍 తూ.గో | ప.గో | కోనసీమ | అల్లూరి | పోలవరం
📍 ఏలూరు | వైజాగ్ | ఎన్టీఆర్ | అనకాపల్లి | కృష్ణా
🌧️ *AP స్వర్ణ గ్రామం, వార్డు సిబ్బందికి అత్యవసర ఆదేశాలు*

తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు శాఖ డైరెక్టరేట్ నుంచి కీలక సర్క్యులర్ జారీ అయ్యింది.

📌 *ముఖ్య వివరాలు:*
• *హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి:* జిల్లా SGSW అధికారులు, MSGOs, USWOs మరియు ఉద్యోగులందరూ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలి.
• *అనుమతి తప్పనిసరి:* ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదు.
• *పారిశుద్ధ్యం & తాగునీరు:* అపరిశుభ్రత పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
• అందుబాటులో లేని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ.
📢 *AP ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేళల్లో మార్పు!*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం *అక్టోబర్ 1, 2026*న పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సమయాన్ని సవరిస్తూ SERP అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

🔹 *ముఖ్య సమాచారం:*
• *సవరించిన సమయం:* అక్టోబర్ 1వ తేదీ *మధ్యాహ్నం 12:00 గంటల నుండి* మాత్రమే పంపిణీ ప్రారంభమవుతుంది.
• *కారణం:* UFBU ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె జరగనుంది.
• *నగదు ఉపసంహరణ:* బ్యాంకులు తెరిచిన వెంటనే అక్టోబర్ 1 ఉదయం వేళల్లో సిబ్బంది నగదు డ్రా చేసుకుని, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు అందజేస్తారు.

లబ్ధిదారులు ఉదయమే వెళ్లి ఇబ్బంది పడకుండా ఈ సమాచారాన్ని గమనించగలరు.
⚖️ *తండ్రి ఆస్తిలో వివాహిత కూతురి హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!*

హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు గల చట్టపరమైన హక్కులపై స్పష్టమైన వివరాలు:

🔹 *పూర్వీకుల ఆస్తి (Ancestral Property):*
• కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా పుట్టుకతోనే సమాన వాటా (Coparcener) లభిస్తుంది.
• కూతురికి వివాహం అయినా కాకపోయినా ఈ హక్కు వర్తిస్తుంది.
• సెప్టెంబర్ 9, 2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా వాటా క్లెయిమ్ చేసుకోవచ్చు.

🔹 *స్వార్జిత ఆస్తి (Self-Acquired Property):*
• తండ్రి వీలునామా (Will) రాయకుండా మరణిస్తే, కొడుకులతో పాటు కూతురికీ సమాన వాటా దక్కుతుంది.
• ఒకవేళ తండ్రి జీవించి ఉన్నప్పుడు తన ఇష్టపూర్వకంగా ఎవరికైనా రాసిస్తే దాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు.
🚨 *AP మత్స్యకారులకు కీలక గుడ్‌న్యూస్!*

🌧️ భారీ వర్షాల కారణంగా గత 5 రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం కీలక సహాయం ప్రకటించింది.

🍚 ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం ఉచితంగా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

📌 ముఖ్యాంశాలు:
• లబ్ధిదారులు: వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలు
• ఉచిత బియ్యం: 50 కేజీలు
• ఆదేశాలు: సీఎం చంద్రబాబు
• తేదీ: సెప్టెంబర్ 26, 2026
వాట్సాప్ గ్రూపుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపిస్తూ, గెరిల్లా తరహా ఆందోళనలు/ఉద్యమాలకు పాల్పడేలా చేస్తున్నారని సమాచారం ప్రచారం అవుతోంది.

ఇలాంటి చట్టవిరుద్ధమైన లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే, వారిపై నిర్దిష్ట కేసులు నమోదు చేయబడతాయి. అరెస్టులు కూడా చేపట్టి, వారికి బెయిల్ రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది.

పై సందేశం పోలీస్ శాఖ నుండి వచ్చిన హెచ్చరిక.

కాబట్టి అందరూ దయచేసి ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దు. శాంతియుతంగా, చట్టబద్ధమైన మార్గాల్లో మాత్రమే మీ సమస్యలను తెలియజేయండి.

అందరూ ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండగలరు. 🙏