VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC*
Mapping Screens enabled.

NTRBPS

1) *Cluster Mapping to SGSW Functionary*
2) *Pensioner Mapping to SGSW Functionary*
3) *Cluster mapped Pensioners-Unmapping*
4) *Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS and Staff)-Online*
5) *Add Swarna Gramam Swarna Wardu(WEA/WDS)-Offline*
📢 మున్సిపల్ ఎన్నికల మొత్తం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేష‌న్‌ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాత్కాలికంగా బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని 100 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అభ్యర్థుల జాబితాల ప్రకటనను నిలిపివేయాలని స్పష్టం చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాల‌ని భావించిన‌ప్ప‌టికి.. ఇప్పుడు మొత్తం 100 స్దానాల్లో నిలిపివేస్తున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ ఈ రోజు తీసుకోబోయే నిర్ణయంపై రాజకీయ వర్గాలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
*విజయవాడ : బ్యాలెట్ బాక్సుల భద్రతపై SEC కీలక మార్గదర్శకాలు..!*

*అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూములలో బ్యాలెట్ బాక్సులు భద్రపరచాలి.*

*స్ట్రాంగ్ రూములకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సొంత సీల్స్ వేసుకునే అవకాశం.*

*స్ట్రాంగ్ రూములకు డబుల్ లాక్ విధానం అమలు.*

*: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం*
📢 *రైతులకు ముఖ్య గమనిక – పొలం పన్ను చెల్లింపులో కొత్త విధానం!*

🌾 రైతులు తమ పొలానికి సంబంధించిన పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించే సమయంలో, భూమి రికార్డులకు లింక్ అయిన ఆధార్ వివరాలకు సంబంధించిన మొబైల్ నంబర్‌కు OTP వస్తోంది.

📱 పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయడానికి OTP అవసరం. కాబట్టి రైతులు తమ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.

⚠️ *ముఖ్య సూచన:* OTP రాకపోతే సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించి పరిష్కారం తెలుసుకోండి.

📌 రైతులు గమనించగలరు… ఈ సమాచారాన్ని ఇతర రైతులకు కూడా తెలియజేయండి.
📢 ఏపీ పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్: నవంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో నవంబర్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు అమలులోకి రానున్నాయి.

📌 ముఖ్య వివరాలు:
• పింఛన్ మొత్తంలో ఎలాంటి కోత ఉండదు, పూర్తి మొత్తం యథావిధిగా అందుతుంది.
• కేంద్ర ప్రభుత్వ వాటా: లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో DBT ద్వారా జమ అవుతుంది.
• రాష్ట్ర ప్రభుత్వ వాటా: సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తారు.

💰 కేటగిరీల వారీగా వాటా వివరాలు:
• వృద్ధులు & ఒంటరి మహిళలు (మొత్తం ₹4,000): కేంద్రం వాటా ₹200 (బ్యాంక్ ఖాతాలో) + రాష్ట్ర వాటా ₹3,800 (చేతికి నగదు)
• దివ్యాంగులు (మొత్తం ₹6,000): కేంద్రం వాటా ₹300 (బ్యాంక్ ఖాతాలో) + రాష్ట్ర వాటా ₹5,700 (చేతికి నగదు)

⚠️ ముఖ్య గమనిక:
కేంద్ర వాటా నిధులు ఖాతాలో పడాలంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ (NPCI Mapping) తప్పనిసరి.
*APSRTC విజయవాడ జోనల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం ఏలూరు కార్పొరేషన్ మేయర్ గా పోటీలో ఉన్నారు.*
*ఏపీకి మరో వాయుగుండం ముప్పు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం. తుఫాన్‌గా మారొచ్చని IMD అంచనా. ఈనెల 28 నాటికి కాకినాడకు సమీపంలో తీరం దాటే ఛాన్స్‌. ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా.*
*తీవ్ర తుఫాను హెచ్చరిక ⚠️*
హుద్‌హుద్, తిత్లీ తుఫానుల తర్వాత మరోసారి ఈ వ్యవస్థ మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది! ⚠️

అక్టోబర్ 27–29 తేదీల్లో బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ప్రాంతాల ప్రజలు వర్షాలు, బలమైన గాలుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి! 🌧️💨

📍 మచిలీపట్నం – విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి!
*ఆంధ్రప్రదేశ్ లో ' MPTC ', ' ZPTC ' ఎన్నికల నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు..!*

*నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు.*

*మొదటి రెండు రోజులు 'MPTC' స్థానాలకు 32,095 నామినేషన్లు దాఖలు.*

*28 'ZPTC' స్థానాలకు 2,805 నామినేషన్లు దాఖలు.*
📢 *BREAKING NEWS 🚨 రైతులకు ముఖ్య సమాచారం*

🌾 *ఆంధ్రప్రదేశ్‌లో పొలం పన్ను చెల్లింపులో కొత్త ఆన్‌లైన్ విధానం!*

గతంలో రైతులు పొలం పన్ను చెల్లించాలంటే పట్టాదారు పాస్‌బుక్ తీసుకెళ్లి, అందులోని ఖాతా నంబర్ ఆధారంగా భూమి వివరాలు నమోదు చేసి, ఫసలీ సంవత్సరం వారీగా పన్ను చెల్లించేవారు.

తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఆన్‌లైన్ విధానంలో ఆధార్ ఆధారంగా రైతుల భూముల వివరాలను గుర్తించి, పన్ను చెల్లించే ప్రక్రియను సులభతరం చేశారు.

📌 *కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?*

✅ 1. ఆధార్ నంబర్ నమోదు: రైతు ఆధార్ నంబర్‌ను ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేస్తారు.

✅ 2. OTP ధృవీకరణ: భూమి రికార్డులకు అనుసంధానమైన ఆధార్ ఆధారిత మొబైల్ నంబర్‌కు వచ్చే OTPతో ధృవీకరణ చేస్తారు.

✅ 3. భూముల వివరాల గుర్తింపు: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ గ్రామాల్లో రైతుకు ఉన్న భూముల వివరాలు, సంబంధిత ఖాతాలు ఆన్‌లైన్ రికార్డుల్లో అందుబాటులో ఉంటే ప్రదర్శితమవుతాయి.

✅ 4. పన్ను మొత్తం: సంబంధిత గ్రామం, ఖాతా వివరాలను ఎంచుకున్నప్పుడు చెల్లించాల్సిన పొలం పన్ను మొత్తం కనిపిస్తుంది.

🏢 *రైతులు ఎక్కడ పన్ను చెల్లించవచ్చు?*

రైతులు స్వయంగా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించలేని పరిస్థితుల్లో, తమకు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయంలోని సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ (Digital Assistant) వద్ద లేదా మీ-సేవ (MeeSeva) కేంద్రంలో ఆన్‌లైన్ సేవను పొందవచ్చు.

అక్కడ సంబంధిత ఆపరేటర్ ద్వారా ఆధార్ వివరాలు నమోదు చేసి, OTP ధృవీకరణ అనంతరం భూమి వివరాలను పరిశీలించి, పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

📍 *ఈ విధానం వల్ల ప్రయోజనాలు*

🔹 ప్రతిసారీ పట్టాదారు పాస్‌బుక్ తీసుకెళ్లి ఖాతా నంబర్ నమోదు చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

🔹 వేర్వేరు గ్రామాల్లో భూములున్న రైతుల వివరాలను ఒకే ధృవీకరణ ప్రక్రియ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది.

🔹 చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం సులభమవుతుంది.

⚠️ *రైతులు తప్పనిసరిగా గమనించాలి:*

• భూమి రికార్డులకు ఆధార్ అనుసంధానం సక్రమంగా ఉండాలి.

• OTP వచ్చే మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.

• రైతు స్వయంగా రాలేని సందర్భంలో, సంబంధిత ధృవీకరణ నిబంధనల ప్రకారం మాత్రమే ఇతరులు సహాయం పొందాలి. OTPను అనధికారికంగా పంచుకోవద్దు.

📢 *రైతులందరూ ఈ కొత్త విధానంపై అవగాహన కలిగి ఉండండి. అవసరమైనప్పుడు మీ గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌ను లేదా సమీప మీ-సేవ కేంద్రాన్ని సంప్రదించండి.*
📢 *ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఉద్యోగుల కు ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవు*
🚨 Alert 🚨
*తుఫానుతో అతిభారీ వర్షాలు హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే.*
🚨 ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి.. 4 పట్టణాల్లో 1,080 నామినేషన్లు! 🗳️🔥

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గడువు పొడిగించిన నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 📢

📊 📍 పట్టణాల వారీగా నామినేషన్లు

🔹 తిరుపతి – 543
🔹 మైదుకూరు – 207
🔹 కడప – 196
🔹 రాజంపేట – 134

✅ మొత్తం నామినేషన్లు: 1,080

🏛️ పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు

🟡 టీడీపీ – 482
🔵 వైసీపీ – 298
🟥 జనసేన – 113
🟠 బీజేపీ – 32
⚪ స్వతంత్రులు – 129+

📌 మొత్తం: 1,054 నామినేషన్లు

🗳️ నామినేషన్ల జోరు.. ఎన్నికల బరిలో రాజకీయ పార్టీల పోటీ ఆసక్తికరం!
*ఫామ్-A, ఫామ్-B సమర్పణపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు*

▪️MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫామ్-A, ఫామ్-B సమర్పణపై మార్గదర్శకాలు జారీ.
▪️ఈనెల 27 మధ్యాహ్నం 3గంటల లోపు ఫామ్‌-B రిటర్నింగ్ అధికారికి అందించాలి: SEC
*బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..!*

*ప్రస్తుతం విశాఖకు 820, కాకినాడకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం.*

*నేడు తీవ్రవాయుగుండంగా 'అర్నబ్' బలపడి, రేపు ఉదయానికి తుపానుగా మారే అవకాశం.*

*మంగళవారం ఉదయానికి 'అర్నబ్' తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.*

*బుధవారం ఉదయానికి 'అర్నబ్' బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం*

*ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ.*
కాకినాడ, కోణసీమ మరియు యానాం తీర ప్రాంతాల సమీపంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎమ్‌డి అంచనా వేస్తోంది 🌀 సిద్ధంగా ఉండండి ✅
🌾 రైతులకు ముఖ్య గమనిక: అన్నదాత సుఖీభవ & PM కిసాన్ అప్‌డేట్!

అక్టోబర్ 30న పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ పేమెంట్ జమ కానుందా? మీ పేమెంట్ స్టేటస్ వివరాలు ఇలా చెక్ చేసుకోండి.

📌 ముఖ్య వివరాలు:
• పీఎం కిసాన్ సాయం: కేంద్రం నుంచి రూ. 2,000 జమ అయ్యే అవకాశం.
• రాష్ట్ర ప్రభుత్వం సాయం: అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
• మొత్తం లబ్ధి: రెండు పథకాలు కలిపి అర్హులకు వార్షికంగా రూ. 20,000 ఆర్థిక సాయం.
• ముఖ్యమైన పని: బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ (NPCI Seeding) మరియు e-KYC తప్పనిసరిగా పూర్తయి ఉండాలి.
సైక్లోన్ ARNAB తీవ్ర గాలులతో బీభత్సం సృష్టించే అవకాశం! ⚠️

మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలు అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం నుంచి 28వ తేదీ రాత్రి వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ఈ ప్రాంతంలో గంటకు 100–150 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. వీటికి తోడు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. ⚠️🌪️