VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Sir / Madam,

It is with deep sorrow that we inform you of the loss of two of our SGSW colleagues,

1. Smt K. Satyavathi, ANM, Gr-3, Nagampalli, East Godavari and
2. Sri Duvvada Pydi Raju, JLM, VPD, Nallabilli, Vizianagaram Dist.

while on cyclone duty. Our heartfelt condolences go to their families. Their dedication will not be forgotten.

Safety of our staff comes first. Please sensitize all our employees to follow these precautions strictly:

During high winds and heavy rain

• Do not go out during landfall or peak wind hours. Stay inside a strong pucca building.
• Never take shelter under trees, hoardings, electric poles, old or damaged buildings, or compound walls.
• Avoid travelling on two-wheelers in strong winds.

Electricity

• Stay well away from fallen or hanging electric wires, poles and transformers.
• Do not touch wet electric switches, poles or metal fences.
• Report fallen lines to the electricity department immediately. Do not try to clear them yourself.

Water and roads

• Never cross flooded roads, causeways, culverts, streams or canals, even if the water looks shallow.
• Avoid low-lying areas, riverbanks and the seashore.
• Do not travel at night unless it is an emergency.

While on field duty

• Always work in pairs or groups. Never go alone.
• Inform your supervisor/MPDO/Commissioner of your location and movement.
• Keep your phone fully charged, and carry a power bank, torch, raincoat and drinking water.
• Follow IMD and APSDMA alerts and district control room instructions.

Mandal, Urban and District Officers should make sure that no staff member is sent into unsafe conditions. If you feel a situation is unsafe, stop and report it.

Please stay safe and look out for each other.

Director, SWSW

సర్ / మేడమ్,

తీవ్ర విచారంతో తెలియజేయునది ఏమనగా, తుఫాను విధుల్లో ఉండగా మన SGSW సహోద్యోగులు ఇద్దరు మరణించారు.

1. శ్రీమతి K. సత్యవతి, ANM, గ్రేడ్-3, నాగంపల్లి, తూర్పు గోదావరి జిల్లా.
2. శ్రీ దువ్వాడ పైడి రాజు, JLM, VPD, నల్లబిల్లి, విజయనగరం జిల్లా.

వారి కుటుంబాలకు మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాము. విధుల పట్ల వారు చూపిన అంకితభావం ఎప్పటికీ మరువలేనిది.

మన సిబ్బంది భద్రతే మనకు మొదటి ప్రాధాన్యత. కాబట్టి, మన ఉద్యోగులందరికీ క్రింది జాగ్రత్తల గురించి అవగాహన కల్పించి, వాటిని ఖచ్చితంగా పాటించేలా చూడండి.

1. బలమైన గాలులు, భారీ వర్షాల సమయంలో

• తుఫాను తీరం దాటే సమయంలో లేదా గాలుల తీవ్రత అత్యధికంగా ఉన్న వేళ బయటకు వెళ్లకండి. పటిష్టమైన శాశ్వత భవనంలోనే ఉండండి.
• చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, పాత లేదా దెబ్బతిన్న భవనాలు, ప్రహరీ గోడల కింద ఎప్పుడూ ఆశ్రయం పొందకండి.
• బలమైన గాలులు వీచే సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించకండి.

2. విద్యుత్‌కు సంబంధించిన జాగ్రత్తలు

• నేలపై పడిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండండి.
• తడిగా ఉన్న విద్యుత్ స్విచ్‌లు, స్తంభాలు లేదా లోహపు కంచెలను తాకకండి.
• విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వండి. వాటిని మీరే తొలగించడానికి ప్రయత్నించకండి.

3. నీరు, రహదారులకు సంబంధించిన జాగ్రత్తలు

• రహదారులు, కాజ్‌వేలు, కల్వర్టులు, వాగులు లేదా కాలువలు వరద నీటితో నిండినప్పుడు, నీరు తక్కువగా కనిపించినప్పటికీ వాటిని దాటి వెళ్లకండి.
• లోతట్టు ప్రాంతాలు, నదీ తీరాలు, సముద్ర తీరాలకు దూరంగా ఉండండి.
• అత్యవసర పరిస్థితి అయితే తప్ప రాత్రి వేళల్లో ప్రయాణించకండి.

4. క్షేత్రస్థాయి విధుల్లో ఉన్నప్పుడు

• ఎల్లప్పుడూ జంటలుగా లేదా బృందాలుగా పని చేయండి. ఒంటరిగా ఎప్పుడూ వెళ్లకండి.
• మీరున్న ప్రదేశం, మీ ప్రయాణ వివరాలను మీ పై అధికారికి / MPDOకు / కమిషనర్‌కు తెలియజేయండి.
• మీ మొబైల్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచండి. పవర్ బ్యాంక్, టార్చ్‌లైట్, రెయిన్‌కోట్, తాగునీరు వెంట తీసుకెళ్లండి.
• భారత వాతావరణ శాఖ (IMD), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) జారీ చేసే హెచ్చరికలు, జిల్లా కంట్రోల్ రూమ్ సూచనలను తప్పనిసరిగా పాటించండి.

5. మండల, పట్టణ, జిల్లా అధికారులకు సూచనలు

ఎటువంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ సిబ్బందిని విధులకు పంపకుండా మండల, పట్టణ, జిల్లా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏదైనా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మీకు అనిపిస్తే, వెంటనే ఆ పనిని నిలిపివేసి, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి.

దయచేసి మీ భద్రతను కాపాడుకోండి. మీ తోటి సిబ్బంది భద్రత పట్ల కూడా శ్రద్ధ వహించండి.

డైరెక్టర్, SWSW
#శ్రీకాకుళం జిల్లాలో గత సాయంత్రం నుంచి తుఫాన్ ఆర్నబ్ వెనుకభాగపు వర్షపు పట్టీల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి 🌧️⚠️

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 200 మి.మీ. దిశగా చేరుతోంది. ముఖ్యంగా ఇచ్చాపురం–పలాస–టెక్కలి మధ్య ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!

శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్నం నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పొడిగా ఉంటుంది.
🚨 *అమరావతి : రేపు 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' రెండో విడత నిధుల విడుదల..!* 🚨

*రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల సాయం.*

*రాష్ట్ర వాటా రూ.2,342.92 కోట్లు, కేంద్రం వాటా రూ.782.55 కోట్లు.*
> అమరావతి : ఏపీలో 13 జిల్లాల్లో గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి ఊరట. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ఓటీపీ ధృవీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు.విద్యుత్‌ అంతరాయాలు, మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్యల నేపథ్యంలో నిర్ణయం. ఓటీపీ లేకుండానే నగదు చెల్లింపుతో సిలిండర్ల పంపిణీకి అనుమతి.
**పెన్షన్ పంపిణీ షెడ్యూల్*
*ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపు.*

భారత ఎన్నికల సంఘం (ECI) ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) షెడ్యూల్‌ను సవరిస్తూ కీలక ప్రకటన చేసింది.

📌 అభ్యంతరాలు & క్లెయిమ్‌ల పరిష్కారం (Notice Phase):
31.07.2026 నుండి 20.11.2026 వరకు గడువు పొడిగించారు.

📌 తుది ఓటర్ల జాబితా ప్రచురణ (Final Publication):
30.11.2026 న అంతిమ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
🌧️ *తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక: బంగాళాఖాతంలో అల్పపీడనం!*

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

📌 *ముఖ్య వివరాలు:*
• *తీవ్రత:* పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.
• *గాలుల వేగం:* తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం.
• *హెచ్చరిక:* రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
> కోనసీమ జిల్లా మాచవరంలో మరోసారి గ్యాస్ లీక్.. సోమవారం లీకైన ప్రాంతంలోనే మరోసారి ఘటన.. గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చిన ONGC అధికారులు.. తరుచూ గ్యాస్ లీకేజీలతో ఆందోళనలో స్థానికులు.. శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్
🚨 *పెండింగ్ పెన్షన్ల పేమెంట్ అప్డేట్...*
📢జనవరి 25 నుంచి జనగణన (Census)

🔹 ముఖ్య ప్రకటన: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల (సెన్సస్) సేకరణ వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
🔹 సెల్ఫ్ ఎన్యూమరేషన్: 2027 జనవరి 10 నుంచి 24 వరకు పౌరులు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేందుకు (Self-Enumeration) అవకాశం కల్పించింది.
🔹 మినహాయింపులు: ఎన్నికలు జరగనున్న గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని మంచు కురిసే ప్రాంతాలు, లద్దాఖ్‌లకు ప్రస్తుతానికి ఈ షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
*LIST OF HOLIDAYS NOVEMBER 2026*

As per G.O RT No.2276 dated 04-12-2025 of Govt of AP.

1️⃣ 01-11-2026 - ఆదివారం

2️⃣ 08-11-2026- దీపావళి (ఆదివారం)

3️⃣ 15-11-2026- ఆదివారం

4️⃣ 22-11-2026 - ఆదివారం

5️⃣ 29-11-2026 - ఆదివారం


*Optional Holidays*

1️⃣ 24-11-2026 గురు నానక్ జయంతి

*No.of Calendar Days: 30*

❇️ *No. of Holidays: 05*

❇️ *Working Days: 25*


*🟣Note:*

తేదీ:14-11-2026- రెండవ శనివారం *(Compensation Working day -అక్టోబర్ 19వతేదీ మహర్నవమి సందర్భంగా ఇచ్చిన సెలవుకు బదులుగా)*
*అమరావతి: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పారితోషికం పెంపు. కేటగిరీల వారిగా పారితోషికంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ప్రమాదాలు చెల్లించే పరిహారంలోనూ
బాపట్ల సమీపంలో తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 70-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది. (గమనిక: గాలి వేగం పెరిగే అవకాశం ఉంది)
🚨 *'అర్నబ్' తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' భారీ విరాళం..!* 🚨

*ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన SBI.*

*'సీఎం చంద్రబాబు'ను కలిసి విరాళం చెక్కును అందజేసిన SBI ప్రతినిధులు.*

*తుపాను బాధితులను ఆదుకునేందుకు సాయం అందించిన SBI.*

*విరాళం అందించిన SBI మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు.*
***Cast Your Vote 🙏*"*
🌹🌹🌹🌹🌹🌹🌹
⚠️ *ముఖ్యమైన హెచ్చరిక – ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ* *బాధ్యతాయుతంగా వ్యవహరించాలి*.

🗳️ *ఎన్నికల విధులు అనేవి ఒకరి బాధ్యత మాత్రమే కాదు… ఇది మొత్తం పోలింగ్ టీమ్ ఉమ్మడి బాధ్యత*.

PO మాత్రమే అన్ని విషయాలకు బాధ్యత వహిస్తారని, APO, OPOలకు ఎలాంటి బాధ్యత ఉండదని ఎవరూ అపోహ పడకండి.

ప్రతి ఒక్కరికీ కేటాయించిన విధులను నిబంధనల ప్రకారం, అప్రమత్తంగా నిర్వహించాలి.

🔹 PO తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. 🔹 APO, POకు సహకరిస్తూ తమ విధులను నిర్వర్తించాలి. 🔹 OPOలు తమకు కేటాయించిన విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. 🔹 ఏదైనా సందేహం లేదా సమస్య ఎదురైతే సొంత నిర్ణయాలు తీసుకోకుండా PO దృష్టికి తీసుకెళ్లాలి.

🚨 గుర్తుంచుకోండి: ఎన్నికల విధుల్లో ఏదైనా తప్పిదం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే, దానికి సంబంధించిన బాధ్యతను బట్టి మొత్తం టీమ్‌లోని సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

*ఒకరి నిర్లక్ష్యం… మొత్తం టీమ్‌కు సమస్యగా మారవచ్చు*.

🤝 కాబట్టి అందరూ సమన్వయంతో, అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించండి.

*TEAM WORK IS THE KEY TO SUCCESSFUL ELECTION DUTY*.
ఆర్నబ్ కి తమ్ముడే ఈ మురాసు జాగ్రత్త వహించండి. ముఖ్యముగా నెల్లూరు, చీరాల, ప్రకాశం, బాపట్ల, కృష్ణా... అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు బలమైన గాలుల ధాటికి నేలకొరిగే ప్రమాదం ఉంది మీకు అర్థమయ్యింది అనుకుంటాను.
> ఏపీ స్థానిక ఎన్నికల్లో మధ్యాహ్నం 3 వరకు 48.03 శాతం పోలింగ్‌ నమోదు.