VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్*

*సచివాలయాలు, ‘మన మిత్ర' వాట్సాప్ ద్వారా సేవలు*

దివ్యాంగులు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ నమోదుకు నేటి నుంచి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు కార్యాలయాలు, ‘మన మిత్ర’' వాట్సాప్, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 21 కేటగిరీల్లో వైకల్యాలకు వేర్వేరుగా స్లాట్లు కేటాయించనున్నారు. యాసిడ్ దాడి, అభ్యాస వైకల్యం, ఆటిజం, బహుళ వైకల్యం వంటి కొత్త కేటగిరీలకు వేర్వేరుగా స్లాట్లు నమోదు చేసుకోవాలి. స్లాట్ నమోదుకు వెళ్లేవారు ఆధార్ కార్డుతో పాటు దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్ కూడా వెంట తీసుకెళ్లాలి.

*మన మిత్ర వాట్సాప్ నంబరు* 9552300009
*నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల ప్రజలు మురాసు తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి* ❗️

ఈ ప్రాంతాలపై *ఈరోజు మధ్యాహ్నం నుంచి తుఫాన్ ప్రధాన మేఘాలు ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి.*

ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు భారీ వర్షాలతో పాటు *గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు* వీచే అవకాశం ఉంది.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి! ⚠️
ఈరోజు సాయంత్రం నుంచి ప్రకాశం, నెల్లూరు, బాపట్ల తీర ప్రాంతాల్లో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, టెలికమ్యూనికేషన్లకు నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండండి ⚠️
ఉత్తరాంధ్రలో ఈరోజు రాత్రి, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయి. గాలి వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది.⛈️⚠️ వర్షం 100mm వరకు పడవచ్చు.
> మురసు తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్.. ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి అనిత
*4, 5 తేదీల్లో సెలవులు..*
> మురసు తుఫాన్‌తో పలు పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ. నిజాంపట్నంలో పదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక. మచిలీపట్నంలో తొమ్మిదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక. కృష్ణపట్నంలో 8వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక. మిగిలిన పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక.
*తుఫాన్ బాధితులకు అండగా మనమిత్ర సేవలు*

▪️తుఫాన్ సమస్యలపై మనమిత్ర ద్వారా ఫిర్యాదులు.
▪️విద్యుత్ సమస్యలు, చెట్లు కూలిన ఘటనలపై ఫిర్యాదులు.
▪️తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఫిర్యాదుల స్వీకరణ.
▪️మనమిత్ర వాట్సాప్ నెంబర్: 9552300009.
Schools and Colleges given holidays tomorrow On Nov 3rd in Vijayawada (NTR) , palnadu, Bapatla, Nellore, Prakasam and Krishna districts 🌀⚠️

రేపు నవంబర్ 3వ తేదీన విజయవాడ (ఎన్టీఆర్), పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు 🌀⚠️
*పెన్షన్ పంపిణీ చివరి తేదీ అప్డేట్*
*📣ఆర్నబ్ తుఫాను బాధిత కుటుంబాలకు ఉచితంగా 10 కిలోల బియ్యం పంపిణీ!*

▫️డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు పంపిణీ

ఆర్నబ్ తుఫాను (అక్టోబర్ 2026) కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అదనపు సహాయం ప్రకటించింది. తుఫాను ప్రభావానికి గురైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మారుమూల మండలాల పరిధిలో ఉన్న బాధిత కుటుంబాలన్నింటికీ ఈ సహాయం అందించనున్నారు.

*రెండు జిల్లాల కలెక్టర్ల నుంచి అవసరమైన బియ్యం ఇండెంట్లు (కేటాయింపు అవసరాల వివరాలు) వెంటనే తీసుకుని పంపిణీ ప్రక్రియ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.*
*ఆంధ్రప్రదేశ్ లో రేపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్..!*

*ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం.*

*13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో కౌంటింగ్.*

*6,831 టేబుళ్లు.. 47,817 మంది సిబ్బందితో లెక్కింపు.*
🌀 తుఫాను మురాసు ప్రభావం ప్రారంభమైంది!
కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు కృష్ణా తీర ప్రాంతాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభమైంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు మొదలయ్యాయి. 🌀⚠️

⛈️ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మురసు (MURASU) తుఫాను, కొద్ది రోజుల క్రితం కోనసీమ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన అర్నాబ్ (ARNAB) తుఫాను మాదిరిగానే నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.

ఒంగోలు – చీరాల తీర ప్రాంతాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఈ ప్రాంతాల్లో సముద్రపు అలల ఉద్ధృతి (Storm Surge), గంటకు 130–160 కి.మీ. వేగంతో విధ్వంసకరమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. ⚠️


⚠️ *మురసు తుఫాను తీరం దాటేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఒంగోలు, బాపట్ల, అద్దంకి ప్రాంతాల్లో రాబోయే 10 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 300 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.* ⚠️
రాబోయే 3-5 రోజులు ఒంగోలు - చీరాల తీరంలో విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి 👍
*ఇవాళ DSC నోటిఫికేషన్*
*7 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు*
*ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం.* 🗳️📊