చైత్ర మాస వైశిష్ట్యం
చైత్ర శుక్ల పాడ్యమి- ఉగాది
యుగాది అనే శబ్దమే యుగములకి ఆది, ఆ శబ్దమే ‘ఉగాది’ గా మారింది. దానినే సంవత్సరాది అని పిలుస్తాము. తెలుగు సంవత్సరమునందు ఆరంభం అయ్యే తిథి కనుక చైత్ర శుక్ల పాడ్యమిని ఉగాది అని అంటారు. సంవత్సరం అంతా శుభ ఫలితాలు పొందాలంటే-
1. ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి అభ్యంగన స్నానం చేయాలి (నలుగుతో ఒళ్ళు అంతా వ్రాసుకోవాలి, తరువాత కుంకుడుకాయ పులుసుతో తలస్నానం చేయాలి (షాంపూతో స్నానం పనికిరాదు). ఇలా చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని అగ్ని పురాణం చెబుతోంది.
2. ఇష్ట దేవత ఆరాధన తో పాటు ఈ రోజు తప్పక లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం.
3. శ్రీ సూక్తం పారాయణ చేయడం లేక వినడం చాలా మంచిది.
4. ఈ రోజు రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది, శివుని అన్నంతో అభిషేకించి, ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా తీసుకున్నా, ఇతరులకు ప్రసాదం పంచినా, జీవితంలో భుక్తికి లోటు ఉండదు అని శాస్త్రం.
5. ఆ తరువాత వేప పూతతో చేసిన షడృచుల పచ్చడిని ప్రసాదంగా రుద్రుడికి లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి. గురుదేవులను, నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించాలి.
6. ఈ రోజు తప్పక చేయవలసినవి.
ఆలయ దర్శనం ii) సూర్యుడు అస్తమించే లోపు పంచాంగ శ్రవణం (తిథి చూడడం వల్ల సంపదలు వస్తాయి. వారం చూడడం వల్ల అయుష్షు పెరుగుతుంది. నక్షత్రం చూడడం వల్ల పాపం తొలగిపోతుంది. యోగం చూడడం వల్ల రోగాలు తొలగుతాయి. కరణం చూడడం వల్ల కార్యసిద్ధి అవుతుంది అని శాస్త్రం.)
అన్నదానం చాలా మంచిది; iv) గురుదర్శనం, గురుప్రదక్షిణ, వ్యాస భగవానుడి కథ వినడం చాలా శ్రేయస్కరం. v) సంధ్యాసమయంలో లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేసినా, దీప దర్శనం చేసుకున్నా చాలా శుభప్రదం. vi) గోప్రదక్షిణ మఱియు గోపూజ చాలా మంచిది.
పురాణ శ్రవణం ఎంతో ఉత్తమం. మత్స్య మఱియు స్కాంద పురాణములు గురువులకి దానం ఇవ్వడం చాలా మంచిది.

తలలో నాలుకలా....
తెలుగు జాతీయాలలో ‘తలలో నాలుకలా’ అనే ప్రయోగం తరచుగా మనం వింటుంటాం. తలలో నాలుకలా ఉండటం ఏమంత సులభం కాదు. ఎవ్వరినీ శారీరకంగా, మానసికంగా నొప్పించకుండా, మంచి మాటలతో, సంస్కారవంతమైన ప్రవర్తనతో మెలగడమే దీని అంతరార్థం.
తెలుగు జాతీయాలలో ‘తలలో నాలుకలా’ అనే ప్రయోగం తరచుగా మనం వింటుంటాం. తలలో నాలుకలా ఉండటం ఏమంత సులభం కాదు. ఎవ్వరినీ శారీరకంగా, మానసికంగా నొప్పించకుండా, మంచి మాటలతో, సంస్కారవంతమైన ప్రవర్తనతో మెలగడమే దీని అంతరార్థం. నోటిలో మనకు ముప్ఫై రెండు పళ్లుంటాయి. ఆ కఠినమైన దంతాల మధ్య ఎంతో సున్నితంగా అటూ ఇటూ ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది నాలుక. దంతాల మధ్య ఎంత జాగ్రత్తగా మసలుతుందో నాలుక! చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఒద్దికగా, ఓర్పుతో, నేర్పుతో, ఒడుపుగా పళ్లదెబ్బ తగలకుండా ఉండే దాని నుంచి మనం నేర్చుకోవాలి, సమాజంలో ఎలా మెలగాలో! తినే పదార్థం రుచి దంతాలకు తెలియదు. నమిలే శక్తి నాలుకకు లేదు. పరస్పరం అవి సహకరించుకోవాల్సిందే! లేకపోతే తిన్న ఆహారం జీర్ణం కాదు. కొంత వయసు పెరిగాక క్రమంగా దంతాలు ఒక్కొక్కటే ఊడిపోతుంటాయి. నాలుక జీవితాంతం ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం అలా నాలుకలా ఉండాలి.
ఇలా శాశ్వతత్వం పొందాలంటే నాలుకను మంచిమాట మాట్లా డేందుకు ఉపయోగించాలి. శిష్టమైన భాషణం చేసేవాణ్ని ‘తలలో నాలు కలా ఉంటాడండీ’ అని మెచ్చు కుంటారు. అలాంటి మనిషి మనీషి అవుతాడు. మహామనీషి అవుతాడు. అతడి మాట వినమ్రతకు అద్దం పడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. తలపెట్టిన ప్రతికార్యంలోనూ సఫలీకృతుణ్ని చేస్తుంది. అజాతశత్రువును చేస్తుంది.
పాండవులు కేవలం ధర్మవర్తనులే కాదు, సున్నిత మనస్కులు. ఘోషయాత్రలో చేజిక్కిన దుర్యోధనుణ్ని విడిచిపెట్టారు. కృష్ణరాయభార ఘట్టంలో కృష్ణుడు పాండవుల మంచితనాన్ని, ధార్మికతను వ్యక్తం చేస్తూ ‘తలలోని నాల్కలు’ అని కీర్తిస్తాడు. పెద్దన్న అయిన ధర్మరాజును తమ్ముళ్లు నలుగురూ పల్లెత్తు మాట అనలేదు. ఎన్ని కష్టాలెదురైనా అన్నీ సహిస్తూ ఐకమత్యంగా ఉన్నారే తప్ప పరస్పరం కలహించుకోలేదు. ఎదుటివారిని తూలనాడనూలేదు. అంత అప్రమత్తతతో ప్రవర్తించడంవల్లనే అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకోగలిగారు. విరాట చక్రవర్తికి పలు సందర్భాల్లో తోడ్పడ్డారు. కురుక్షేత్ర సంగ్రామంలో ఏడు అక్షౌహిణుల సేన వచ్చి పాండవుల పక్షాన నిలబడిందంటే- అది వారి సద్వర్తనమే అనుకోవాలి. అర్జునుడి మనసు ఎంత నవనీత సదృశమంటే కురుక్షేత్ర మైదానంలో విపక్షంలోని వారందరినీ చూసి ‘వారంతా నా బంధువర్గమే కదా! ఎలా సంహరించేది?’ అంటూ విలపిస్తాడు. కర్తవ్య బోధ, గీతాబోధతో పార్థుణ్ని యుద్ధ సన్నద్ధం చేస్తాడు వాసుదేవుడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలో తెలిసిన రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణపరమాత్మ. తలలోని నాలుక కాకపోతే అష్టపత్నులను, పదహారు వేలమంది గోపికలను, బంధువర్గాన్ని, ప్రజలను అంతగా సంతోష పెట్టగలిగేవాడా యదునాథుడు!
రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అడుగుజాడల్లో నడిచి, మంచి తమ్ముళ్లు అన్న ప్రఖ్యాతి పొందిన లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని మరువలేము. వారి భార్యలు ముగ్గురత్తల దగ్గర ఎంత వినమ్రతతో, ఆత్మీయతతో నడుచుకున్నారు!
తల్లిదండ్రుల్ని, గురువుల్ని గౌరవిస్తూ వినయవిధేయతలతో విద్య నేర్చి, మంచి ఆలోచించి, మంచినే మాట్లాడుతూ మంచి పనులు చేసే సంస్కారవంతుడు, అందరిలోనూ ‘నూటికో కోటికో ఒక్కడు’ అనిపించుకోగలవాడే తలలో నాలుకలా ఉండగలడు. ఒదిగే మనిషే ఎదుగుతాడని, పదుగురి ప్రశంసలూ పొందగలడని పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏది, ఎంత నేర్చినా ఇంకా ఎంతో ఉన్నదన్న సత్యం తెలుసుకోగలవాడే సమాజానికి ఆదర్శప్రాయుడై నిలవగలడు. సాటి మనిషికి ప్రసన్నత, ప్రశాంతత ఇవ్వగలవాడే సార్థక జన్ముడు.