Telugu Christian messages
1.56K subscribers
357 photos
20 videos
10 files
500 links
Download Telegram
🔥 *_దేవుని ప్రణాళిక తెలుసుకున్నావా_* 🔥

🌐 ఈభూమిపై జన్మించిన ప్రతి మానవుని పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటారు... అదేవిధముగా మనుష్యులందరు యెడల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటారు... అయితే దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి ఆయన ప్రణాళిక చొప్పున మనం జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి వాక్యానుసారముగా పరిశీలనచేసుకుందాము...

🌐 పౌలు సౌలుగా జీవిస్తున్నప్పుడు దేవుడు తనని ఒక పనికోసం పిలిచారు అనుకుంటూ యూదామత ప్రావీణ్యుడైన పౌలు దేవునికి వ్యతిరేకముగా క్రీస్తు అనే వ్యక్తి వచ్చారని, ఆయనను ఆరాధించేవారందరు దేవదూషణ చేస్తూ దేవునికి వ్యతిరేఖంగా జీవిస్తున్నారని అనుకున్నాడు.. అందుకే దేవుని కోసం త్యాగం చేస్తున్నట్లుగా, దేవునికోసం రోషం కలిగి జీవిస్తున్నాను అన్నట్లుగా క్రీస్తుని అంగీకరించిన, అనుసరిస్తున్న వారినందరిని చంపడమే తన ద్యేయముగా, జీవనాధారముగా పెట్టుకుని ఆ మార్గములో నడుస్తున్న వారినందరిని చంపుటకు పూనుకున్నాడు...

🏮 ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు - అపో.కార్యములు 9:1

🏮 ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని - అపో.కార్యములు 22:4

🌐 అయితే అలాంటి సమయములో క్రీస్తు పౌలుకి ప్రత్యక్షమై తన యెడల కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో అననీయ ద్వారా తన ప్రణాలికను పౌలుకి తెలియజేస్తారు... అదేమిటంటే *"అప్పుడతడుమన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు; నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు - అపో.కార్యములు 22:14,15"*

🌐 ఇక్కడ అననీయ చెప్తున్న మాటలు 👇👇👇👇

🏮 దేవుని చిత్తము తెలుసుకొనుటకు
🏮 దేవుణ్ణి చూచుటకు
🏮 దేవుని మాటలు వినుటకు
🏮 దేవునికి సాక్షిగా జీవించుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు అని దేవుని మాటలను తెలియజేస్తున్నాడు...

🌐 అవును దేవుడు మన అందరియెడల కూడా కలిగి ఉన్న ప్రణాళిక ఇదే... దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని మాటలు వినాలి, ఆయనకు సాక్షిగా ఈలోకంలో జీవించాలి...

🏮 *దేవుని చిత్తం అంటే* - నిత్యజీవము పొందటమే దేవుని చిత్తం - కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును - యోహాను 6:41, పరిశుద్ధముగా జీవించడమే దేవుని చిత్తం - మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము - 1థెస్స 4:3, ప్రతి విషయముని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవుని చిత్తం - ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము - 1థెస్స 5:18

🏮 *దేవుణ్ణి చూడటం అంటే* - ఎవరు దేవుణ్ణి చూడగలరు అంటే హృదయ శుద్ధిగలవారే చూడగలరు (హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు - మత్తయి 5:8) హృదయం శుద్ధముగా ఉండాలి అంటే మలినమైన మన హృదయం, మన శరీరం క్రీస్తు రక్తముచే కడగబడాలి, మన హృదయం, మన మనోనేత్రములు తెరవబడాలి అందుకే దావీదు అంటారు "నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము - కీర్తనలు 119:18" అని... కాబట్టి క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధులముగా జీవిస్తూ దేవుణ్ణి చూచేవారిగా ఉండటమే తండ్రి చిత్తము...

🏮 *దేవుని మాటలను వినడం అంటే* - వాక్యమైన ఉన్న క్రీస్తుతో సహవాసం చెయ్యడం, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం, క్రీస్తు మాటలను వినడం... ఈలోక వార్తలను, వ్యర్ధమైన మాటలను కాకుండా అనుదినము దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలను వినేవారిగా మనం ఉండాలి.... (కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును - రోమీయులకు 10:17, అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు - సామెతలు 8:34"

🏮 *దేవునికి సాక్షిగా జీవించాలి* - నేనే దేవుడను మీరే నాకు సాక్షులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏదైతే మనము అనుభవపూర్వకంగా రుచి చూసి తెలుసుకున్నామో, ఏ ప్రేమను మనం అనుభవించామో, ఏ క్షమను మనం పొందుకున్నామో, ఏ నిత్యజీవమును మనం పొందుకోబోతున్నామో దాని గురించి అనగా కీస్తు గురించి మనం సాక్ష్యమిచ్చేలా జీవించాలి... అందుకే యోహానుగారు అంటారు "ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము - 1యోహాను 1:1, అలాగే పేతురుగారు అంటారు "మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి - అపో.కార్యములు 4:20"
🌐 *అయితే రక్షించబడ్డాము, మేము క్రైస్తవులము, విశ్వాసులము అని చెప్పుకుంటున్న మనం ఈరీతిగా జీవిస్తున్నామా... దేవుని చిత్తం ఏమిటో తెలుసుకున్నామా... దేవుని ప్రణాళిక చొప్పున జీవిస్తున్నామా... అనేకమంది బాప్తిస్మము అయితే తీసుకున్నారు, సేవ అయితే చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వాక్యం చదువుతున్నారు కానీ నిజమైన దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకోకుండానే జీవిస్తున్నారు... అయితే ఆనాడు అననీయ ద్వారా దేవుడు తన ప్రణాలికను పౌలుకి తెలియజేసినట్లే నేడు దేవుడు తన వాక్యముద్వారా మనకు తెలియజేస్తుండగా బ్రతుకుని మార్చుకుందాము...*

🌐 *ఎందుకంటే పరలోకం చేరాలి అని ఆశపడే మనం పరలోకమందున్న తండ్రి చిత్తం చెయ్యకుండా జీవిస్తే మనం పరలోకం చేరలేము అంతేకాకుండా తండ్రి చిత్త మెరిగి యుండి కూడా ఆవిధముగా జీవించకున్నట్లైతే అనేకమైన దెబ్బలు పొందుకుంటాము.... "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును - మత్తయి 7:21, తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును - లూకా 12:47" గనుక రక్షించబడిన మనం నేటి నుండైనా తండ్రి చిత్తముచొప్పున జీవిస్తూ ఆయనకు మహిమకరముగా బ్రతుకుట నేర్చుకుందాము... ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక.. ఆమేన్...*

మీ
https://t.me/teluguchristians
🔥 *_దేవుని తట్టు తిరుగు_* 🔥

🌿 అనేకసార్లు పిల్లలు లేదా కొందరు యవ్వనస్తులు మాట వినకుండా తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా వారికి ఏమైనా గాయం అయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు లేదా వారు చేసిన పనికి ఏమైనా నష్టం కలిగినప్పుడు ఇప్పటికైనా బుద్ది వచ్చిందా.... ఇప్పటికైనా మారు, ఇప్పుడైనా బుద్ది తెచ్చుకో అని పెద్దవారు అంటుంటారు... అదేవిధముగా తాగుబోతులు, తిరుగుబోతులుగా ఉన్న వారికి కూడా ఎంత చెప్పినా వినకుంటే, మార్పు చెందకుండా ఉంటే అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యమునకు గురి అయినప్పుడు ఇప్పుడైనా ఆ పాడు బుద్దిని విడిచిపెట్టు అని అంటుంటాము...

🌿 అయితే దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఇలానే అంటారు... అదేంటి నేనేమి తాగుబోతుని, తిరుగుబోతుని కాదె, నేనేమి యవ్వనస్తుల వలే లేదా పిల్లలవలె మాట వినకుండా జీవించడం లేదే అని ఆలోచిస్తున్నావా....

🍁 ఇశ్రాయేలీయుల పంట పొలములు తెగులు పట్టిపోయినవి, వారి పంటను గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి, వారి పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను. ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి - యోవేలు 1:4,10-12, మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱమందలు చెడిపోవుచున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను, నదులు ఎండిపోయాయి, మేత స్థలములు పాడైపోయాయి - యోవేలు 1:18-20

🍁 వారి దేశములో కరువు తాండవిస్తుంది, వారి జీవనోపాధి వ్యర్థం అవుతుంది, పశువులు సైతం తినడానికి లేకుండా ఇబ్బంది పడుతున్నాయి కారణం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, దైవ భయము లేకుండా ఉంటున్నారు... కేవలం దేవుణ్ణి తమ పెదవులతో ముఖస్తుతి చేస్తూ జీవిస్తున్నారు అందుకే వారి జీవితం వారి దేశము అలాంటి స్థితిలో ఉంది అయితే ప్రేమామయుడైన దేవుడే తన ప్రజలకి చెప్తున్నారు *"ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగలవాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి - యోవేలు 2:12,13"*

🌿 అవును నేడు మనలో ఇలాంటి వారు ఎందరో, జీవితం నాశనం అవుతున్నా, సమస్యలు వీడనన్నా, పేదరికం, దారిద్య్రముతో అలమటిస్తున్నా, కన్నీరు ఇంకిపోతున్నా హృదయాన్ని మార్చుకోనటువంటి వారు, బ్రతుకును సరిచేసుకోనటువంటి వారు, వ్యర్ధమైన విగ్రహాలను విడిచిపెట్టనటువంటి వారు, వ్యామోహాలను వదలలేని వారు ఎందరో..... ఒకవైపు దేవుడు కావాలి మరోవైపు సొంత కోరికలు తీరాలి, ఒకవైపు ఆశీర్వాదాలు కావాలి మరోవైపు లోకము కూడా కావాలి అంటూ జీవిస్తున్న వారు ఎందరో...

🍁 *అయితే దేవుడు నేడు మనతోనే చెప్తున్నారు "ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి - యోవేలు 2:12" అవును నీ రోగం, నీ అప్పులు, నీ సమస్యలు, నీ పాప భారం, నీ అశాంతి, నీ అసమాధానం, నీ అవిధేయత, నీ అపవిత్రత పోవాలి అంటే, నీవు తప్పక నీ హృదయాన్ని చించుకుని దేవుని యొద్దకే రావాలి.... శాంతి సమాధానమునకు కర్త అయిన, పరిశుద్దుడైన దేవుడే నీ స్థితిగతులను మార్చగలరు... కాబట్టి ఇప్పుడైనా దేవుని యొద్దకు రా...*

🍁 *ఎంతకాలం వాక్యం వింటూనే, మందిరమునకు వస్తూనే, క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని అని చెప్పుకుంటూనే లోకానుసారముగా జీవిస్తావు, ఎంతకాలం నులివెచ్చగా జీవిస్తావు, ఎంతకాలం నీ జీవితాన్ని ఇలానే ఉంచుకుంటావు... ఇప్పుడైనా దేవుని యొద్దకు రా... ఎందుకంటే "ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి - యోవేలు 2:13" గనుక మన పాపములను మనం ఒప్పుకుంటూ దేవుని యొద్దకు తిరిగి వద్దాము... పాడైపోయిన మన బ్రతుకులను, చెడిపోయిన మన మనసులను, కోల్పోయిన శాంతి సమాధానమును తిరిగి పొందుకుందాము... ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక.. ఆమేన్...*

మీ
https://t.me/teluguchristians
💥 *_ఇవ్వబడిన తలాంతులు ఉపయోగిస్తున్నావా_* 💥

🎋 ఒక అతను తన పొలము ద్వారా బాగా డబ్బు సంపాదిస్తూ వచ్చిన సొమ్మును బంగారపు బిళ్లలగా (బిస్కెట్లగా) చేసి వాటిని ఒక గుడ్డలో చుట్టి తన ఇంటి వెనక ఉన్న స్థలములో భూమిలో ఒక గొయ్యి తీసి దానిలో దాచిపెడుతూ ఉంటాడు... ఇలా ప్రతిదినము అతను సంపాదించినవి అందులో జమ చేసి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తనివి తీరా వాటిని చూసుకుని నిద్రపోయేవాడు... ప్రతిరోజు అలా చేస్తూ ఉండేవాడు అయితే కొద్దీ రోజులుగా ఒక దొంగ ఇతనికి తెలియకుండ అతను చేస్తున్నదంతా చూస్తూ ఉండేవాడు... చూస్తున్న ఆ దొంగ ఒకరోజు సమయాన్ని సిద్దము చేసుకుని ఒక ప్లాన్ చేసుకుని అతను భూమిలో దాచిపెడుతున్న బంగారు బిస్కెట్లను దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతాడు...

🎋 మరుసటి రోజు ఇంటి వెనకకు వెళ్లిన అతనికి ఆ గొయ్యి తవ్వి ఉండడం చూసి అనుమానంతో వెళ్లి చూడగా ఆ సంచి అక్కడే పడేసి దానిలో ఒక్క బిళ్ళ కూడా లేకుండా కాళీగా పడి ఉండగా లబోదిబోమని గట్టి గట్టిగ ఏడవడం మొదలెడతాడు అతని అరుపులు విన్న చుట్టూ ప్రక్కల వాళ్ళు వచ్చి సంగతేమిటని అడగగా జరిగింది మొత్తం చెప్తాడు.... ఇంట్లో బీరువా లాకర్లు, తాళాలు ఉండగా నువ్వు ఇక్కడ ఎందుకు దాచిపెట్టావు అని అందరూ అడగగా.... వాటిని చూస్తే ఇంట్లో వాళ్ళు దేనికోదానికి ఖర్చు చేసేస్తారు, డబ్బులు అలా వృధాగా ఖర్చు చెయ్యడం నాకు ఇష్టం లేదు అందుకే ఇక్కడ దాచిపెట్టాను అని చెప్తాడు... సరేలే జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా ఇలా చెయ్యకుండా ఉండు అని ఎవరో అంటే "లేదు లేదు నేను ఇది కాకపోతే మరొక గొయ్యి తవ్వి ఎక్కడో ఒకచోట డబ్బులు దాచిపెడతానే తప్ప నా సంపాదన మాత్రం వృధాగా ఖర్చు చెయ్యను అని చెప్పాడా వెర్రి వెంగళప్ప"

🎋 ఇలాంటి మేధావులు మనలో ఎంతోమంది ఉన్నారు... పాటలు పాడే తలాంతు, వాక్యం చదివే జ్ఞానం, ప్రార్ధించే మనసు, ఆరోగ్యం, ఆయుష్షు, రక్షణ, జీవ గ్రంధం, పరిశుద్దాత్మ సహాయం, సేవ చేయగల కృప అన్నీ ఉన్నాయి కానీ ఇలానే వాటిని అన్నిటిని భూమిలో దాచిపెట్టి నిర్లక్ష్యముగా జీవిస్తున్న వారు, వాటి విలువను గ్రహించని వారు, దైవ భయం లేని వారు ఎందరో ఉన్నారు....

🍂 *దేవుని వాక్యములో మనం చూసినట్లయితే తలాంతులు ఇవ్వబడిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి లెక్క అప్పగించవలసి వచ్చింది, ఎవరైతే తమకు ఇవ్వబడిన తలాంతులు ఉపయోగించుకొనకుండా ఇలానే నిర్లక్ష్యముగా వ్యవహరిస్తారో వారిని "పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను - మత్తయి 25:30, అవును నీవు నేను కూడా దేవుడు మనకు ఇచ్చిన తలాంతులు ఈరీతిగానే దేవుని మహిమ నిమిత్తం, దేవుని రాజ్య సువార్తలో ఉపయోగించకుండా ఉన్నట్లయితే మనం కూడా ఇదేరీతిగా వెలుపటి చీకటిలో త్రోసివేయబడచ్చు గనుక దేవుడు మనకు సామర్ధ్యం ఇచ్చారు, శ్రేష్టమైన తన ఈవులను మనకు అనుగ్రహించారు (మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే- ద్వితియో 8:18, శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును - యాకోబు 1:17) గనుక దేవుని పనిలో దేవుని మహిమ నిమిత్తం వాటిని వాడుతూ జీవించుట నేర్చుకుందాము...*

మీ
https://t.me/teluguchristians
💥 #దేవుని_వాక్యానికి_లోబడు 💥

🌿 నేటి దినములలో ఎక్కడ చూసిన ఏ ప్రాంతమునకు వెళ్లినా కూడా వాక్యం విరివిగా దొరుకుతుంది, ప్రతి స్థలములో మందిరాలు ఉంటున్నాయి, ప్రతి వీధిలో మందిరం ఉంటుంది, మొబైల్ ఓపెన్ చేసి సామజిక మాధ్యమాలను ఓపెన్ చేస్తే చాలు, వాట్సాప్ ఫేస్బుక్, ట్విట్టర్, షేర్ చాట్, ఇంస్టాగ్రామ్ ఇలా ప్రతి దానిలో కూడా ఏకధాటిగా వాక్యాలు ఎదురవుతూనే ఉంటున్నాయి.... మందిరములకు వెళ్లలేకపోయినా మైక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నిత్యము వాక్యం వినే అవకాశం అందరికి అందుబాటులో ఉంటుంది...

🌿 అయితే ఈరీతిగా వాక్యం అందుబాటులో ఉన్నందుకు గాను, దేవుడు తన వాక్కును మనకు వినిపిస్తున్నందుకు గాను మన బ్రతుకును మార్చుకోవాలి, దేవునికి భయపడాలి, దేవునికి విధేయత చూపించాలి అనే ఆలోచనకు బదులుగా ఒక సినిమా పాట ఏ రీతిగా వింటామో, ఒక కధ ఏ రీతిగా చదువుతామో అదే కోణములో వాక్యాన్ని కూడా చూడటం ఎంతోమంది చేస్తున్నారు... అందుకే క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనలో అనేకమంది జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా దశాబ్దాలుగా ఒకేరీతిగా ఎలాంటి మార్పు లేకుండా ఉంటున్నాయి..

🌿 ఆనాటి ఇశ్రాయేలీయులు సైతం ఇలానే జీవించేవారు అనేకమంది నాయకులు వారికి ఉన్నారు కానీ వారు దేవుని వాక్యానికి లోబడకుండా జీవించారు తత్ఫలితముగా సమూయేలు కాలములో వాక్యం కరువైపోయింది, అందుకే పరిశుద్ధ గ్రంథములో "ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు - 1సమూయేలు 3:1" అవును దేవుడు వారిని దర్శించడం లేదా కారణం వారి అవిధేయత, అవిశ్వాసం, తిరుగుబాటుతనం....

🌿 అదేవిధముగా యెరూషలేము కాల్చివేయబడిన తర్వాత, ఇశ్రాయేలీయులు బబులోను దేశమునకు చెరగొనిపోగా వారు తమ బ్రతుకుని మార్చుకోకుండా జీవించుట వలన మరల దేవుడు నాలుగువందల సంవత్సరములు తన ప్రజలతో మాట్లాడలేదు అందుకే చరిత్రకారులు దీనిని సైలెంట్ పిరియడ్ అని అంటారు, పాత నిబంధన నుండి కొత్త నిబంధన కేవలం ఒక్క పేజీ తరువాత కనిపించినప్పటికీ కూడా అది దేవుని దీర్ఘకాలిక మౌనము తర్వాత మొదలయ్యింది....

🌿 అయితే నేడు అనేకమంది సైతం ఇదేరీతిగా జీవిస్తున్నారు... దేవుడు ప్రతి దినము వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, దర్శనములు ద్వారా, కలల ద్వారా అనేకరములుగా మనల్ని సంధిస్తుంటే, మనతో మాట్లాడుతుంటే దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా, దేవుని స్వరమునకు అవిధేయులై జీవిస్తూ తమకోరికలను తీర్చుకుంటూ తమ మనసుకు నచ్చినట్లుగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటున్నారు...

🌿 అయితే మన దినములలో కూడా ఒక సమయం రాబోతుంది అప్పుడు ఈ వాక్యం మనకు కరువైపోతుంది.... ఇప్పటికే అనేక దేశాలలో బహిరంగముగా వాక్యం చెప్పకూడదు, ఆరాధనలు చెయ్యకూడదు, ప్రార్ధన చెయ్యకూడదు, క్రైస్తవులు అని తెలిస్తే చంపేస్తారు లేదా జైలు శిక్ష విధిస్తారు ఇలాంటి చట్టాలు ఎన్నో దేశాలలో అమలులో ఉంటున్నాయి... అయితే దేవుని కృపను బట్టి నేటి దినములలో మనకు వాక్యం అందించబడుతుంది, దేవుని స్వరము వినగలుగుతున్నాము బహిరంగముగా సంఘముగా కూడుకుని ఆరాధన చేసుకోగలుగుతున్నాము, స్వేచ్ఛగా ప్రార్ధన కూడికలు పెట్టుకుంటున్నాము.... అయితే మనం ఎలా జీవిస్తున్నాము.... అందరివలె అవిధేయులై బ్రతుకుతున్నామా లేక దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తున్నామా....

🍁 జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను - సామెతలు 1:20-23

🍁 దేవుడు ఈరీతిగా మనల్ని పిలచుచుంటే ఒకవేళ మనం దేవుని మాటకు చెవియొగ్గక జీవిస్తున్నట్లైతే "నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును - సామెతలు 1:24-28

🍁 అందుకే దేవుడు చెప్తున్నారు "ఆయన చీకటి కమ్మజేయకమునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి - యిర్మియా 13:16"
🍁 కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుండగా వాక్యానికి విధేయులమై మన బ్రతుకుని సరిచేసుకుని జీవించుట నేర్చుకుందాము.. ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక.. ఆమేన్...

మీ
https://t.me/teluguchristians
🔥 *_నీ ఆలోచనలను బట్టి కాదు దేవుని శక్తిని బట్టి సమస్యలను చూడు_* 🔥

🌿 ఇశ్రాయేలీయులు పుట్టకముందు నాలువందల సంవత్సరముల క్రితం దేవుడు తమ పితరుడైన అబ్రాహామునకు వాగ్దానం చేసారు. నీ సంతానం తమది కానీ దేశములో బానిసలుగా దాసులుగా జీవిస్తారు నాలుగువందల సంవత్సరముల తర్వాత నేను ఈ దేశమునకు తీసుకుని వస్తాను అని చెప్పి ఏడు జనాంగముల ప్రాంతమైన కనాను దేశమును చూపించి వాగ్ధానం చేస్తారు...

🍁 ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు - ఆది 15:13,14

🍁 ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను - ఆది 15:18-21

🌿 అయితే దేవుని వాక్యము మేరకు ఇశ్రాయేలీయులు యోసేపు కాలములో కరువు వలన యాకోబుతో కూడా డెబ్బది మంది బయలు దేరి వెళ్లారు, కాలక్రమేణా యోసేపు మరణించాడు, అతని గొప్పతనమును ఎరుగని ఒక వ్యక్తి ఐగుప్తు దేశమునకు రాజు అయ్యాడు (నిర్గమ 1:8)... ఇశ్రాయేలీయులపై అతనికి అసూయా పుట్టింది, ఈ జనాంగం బహుగా విస్తరిస్తుంది, ప్రబలుతోంది "వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను... ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి - నిర్గమ 1:11-13

🌿 కానీ ఆ సమయములో ఇశ్రాయేలీయులను ధైర్యపరచుటకు, వారికి అండగా ఉండుటకు ఎవరు లేరు... వాగ్దానం పొందుకున్న అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వారితో లేరు, తమ పూర్వికులందరు మరణించారు, ఆ సమయములో దేవుని యొద్ద నుండి వారికి ఏ వాక్యం కూడా రాలేదు, దేవుడు దర్శనమిచ్చారు అంటూ బలపరచబడానికి మోషేకు ముందుగా ఎవరు వారియొద్దకు పంపబడలేదు, ఒకవేళ ఆ బాధను తట్టుకోలేక పారిపోదాము, ఏదొక దేశమునకు వెళ్లిపోదాము అనుకుంటే ఒక వ్యక్తి గాని, ఒక కుటుంబం గాని వెళ్లగలరేమో కానీ అది కూడా సాధ్యం కాదు ఎందుకంటే వారు దాసులుగా అక్కడ జీవిస్తున్నారు... అలాంటి సమయములో ఒక జనాంగం మొత్తం దేవుని వాగ్దానం చొప్పున బానిసలుగా జీవిస్తున్న వారు ఐగుప్తు దేశము నుండి బయటకు రావడం అనేది ఊహకు అందని ఆలోచన....

🍁 కానీ వారు బహుశా ఇవేమి ఆలోచించలేదు కానీ వారు దేవునికి మొఱ్ఱపెట్టారు *ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను - నిర్గమ 2:23-25*

🌿 దేవుడే వారి నిమిత్తం దిగి వచ్చారు, మోషేను నడిపించారు, ఐగుప్తు దేశము రాజు ఎదుట వారి ప్రజలందరి ఎదుట ఎన్నో మహత్కార్యములను చేసారు బహు ఆర్బాటంగా వారిని వెలుపలికి తీసుకుని వచ్చారు...

🌾 *నేడు నీ సమస్యను చూసి నువ్వు కూడా ఇది ఎలా సాధ్యం, దేవుడు ఎలా నా జీవితాన్ని మార్చగలరు, ఎలా రోగం నయం కాగలదు, ఎలా ఈ కార్యం జరగగలదు, నాకంటే గొప్పవారు, నాకంటే బలిష్టులను ఎలా నేను జయించగలను, ఎలా... ఎలా... అంటూ నీకున్న సమస్యలను చూసుకుని బయపడుతున్నావేమో, నీ పరిధిలో నీ జ్ఞానము బట్టి, నీ తెలివిని బట్టి ఆలోచిస్తూ కృంగిపోతున్నావేమో అందుకే దేవుడు నేడు నీతోనే మాట్లాడుతున్నారు "మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని - 1కోరింథీ 2:4, జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక - యెషయా 64:3, యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును - కీర్తనలు 118:16"*

🌾 *కాబట్టి మన జ్ఞానమును బట్టి మన శక్తిని బట్టి ఆలోచనలు చేయక దేవుని శక్తిపై జ్ఞానముపై ఆధారపడుతూ ఊహించని భీకర కార్యాలను పొందుకుందాము... ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక.. ఆమేన్...*

మీ
https://t.me/teluguchristians
🔥 *_రూపాంతరము చెందకుండా పరలోకము చేరలేవు..._* 🔥

☘️ చాలాసార్లు మనలో అనేకులు మేము బాప్తిస్మము తీసుకున్నాము కాబట్టి మేము పరలోకమునకు చేరుతాము, ప్రతి దినము మేము వాక్యము చదువుతున్నాము కాబట్టి పరలోకము చేరుతాము, మేము సేవ చేస్తున్నాము కాబట్టి పరలోకము చేరతాము అని ఆలోచిస్తూ ఉంటారు. కొందరైతే మేము పుట్టకతోనే క్రైస్తవులము, మా కులమే క్రిస్టియన్, మా సర్టిఫికెట్లలో కూడా అదే ఉంటుంది కాబట్టి మేము పరలోకము వెళ్ళిపోతాము అని ఆలోచిస్తూ ఉంటారు. నిజముగానే మన కులములో, మన చదువులో, మన పేరులో క్రీస్తు ఉంటె పరలోకము చేరుతామా...???? నిజముగానే మనం బాప్తిస్మము తీసుకుంటే పరలోకము వెళ్ళిపోతామా...????

☘️ దేవుని వాక్యం సెలవిస్తోంది వాక్యం వింటే సరిపోదు వాక్యానుసారముగా జీవించాలి అని. అలాగే బాహ్యమందు (శారీరకంగా, కులములో, పుట్టుకలో, కాయితాలలో) క్రైస్తవుడు అయిపోగానే క్రైస్తవులము అయిపోము కానీ అంతరంగములో క్రీస్తు ఉండాలి అని. అలాగే నీటిలో మునిగి లేచాము (బాప్తిస్మము తీసుకున్నాము) కాబట్టి పరలోకము చేరము కానీ అంతరంగములో పరిశుద్ధత ఉంటేనే పరలోకము చేరుతాము అని.

🌹 _ధర్మశాస్త్రము (వాక్యము) వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును (వాక్యము) అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు - రోమీయులకు 2:13_

🌹 _బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవునివలననే కలుగును - రోమీయులకు 2:28_

🌹 _ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును - మత్తయి 7:21_

🌻 మరి ఎవరు పరలోకము చేరగలరు??? ఎలా ఉంటె పరలోకము చేరగలము అని ఆలోచిస్తున్నావా.... ఎవరైతే దేవుని చిత్తము చేస్తారో వారే దేవునితో కలిసి యుగయుగాలు జీవించగలరు... మరి దేవుని చిత్తం అంటే ఏమిటంటే క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వసించుట, కామాభిలాషయందు కాకుండా పరిశుద్ధముగా తమ ఘటమును (హృదయమును, శరీరమును) కాపాడుకొనుట, ప్రతి విషయములో దేవునికి మనల్ని మనం సజీవయాగముగా దేవునికి సమర్పించుకుని ఇహలోకమాలిన్యము తనకంటకుండా జీవించుట. ఇలాంటి వారే దేవుని చిత్తము చేయువారు, అట్టివారి దేవుని చెంతకు చేరువారు.

🌷 _లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును - 1యోహాను 2:17_

🌷 _యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను - యోహాను 3:5_

🌷 _కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము - యోహాను 6:41_

🌷 _మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము - 1థెస్సలొనికయులకు 4:4,5_

🌷 _తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే - యాకోబు 1:27_

🌷 _కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది - రోమీయులకు 12:1_

🌿 *మరి పరలోకము చేరాలి అని ఆశిస్తున్న ప్రియ విశ్వాసి ఈరీతిగా దేవుని చిత్తము చేస్తూ మనం జీవిస్తున్నామా, విశ్వాసము కలిగి మార్పు చెందిన బ్రతుకుని కలిగి ఉన్నామా... లేక లోకానుసారముగా జీవిస్తూ, బాప్తిస్మము తీసుకున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్ధన చేస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను అని ఆలోచిస్తున్నావా... ఒక్కసారి వ్యాఖ్యానుసారముగా నిన్ను నీవు పరీక్షించుకో, ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి (రోమీయులకు 12:2) అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి రూపాంతరము చెందకుండా, బ్రతుకు మారకుండా, మారుమనస్సు పొందకుండా మహిమ స్వరూపము ధరించలేమని గుర్తెరిగి ఈలోకములోనే మార్పుచెందుదాము.*

🌿 అట్టి కృప మరియు వివేచన దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్... 🌿

మీ
https://t.me/teluguchristians
💥 *_సాకులు చెప్పకు_* 💥

🌿 వాక్యము చెప్తున్న, సేవ చేస్తున్న వారిని చూసినప్పుడు అనేకులు దేవుడు వారికి చక్కని తలాంతుని ఇచ్చారు, చక్కగా మాట్లాడగలరు నాకు అలా మాట్లాడటం రాదు, నాకు అంత జ్ఞానం లేదు దేవుడు నాకు కూడా ఇలాంటి జ్ఞానం ఇస్తే బాగుండేది కదా... ఇలా మాట్లాడటం నేర్పించి ఉంటె బాగుండేది కదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు... సేవ చెయ్యకుండా ఉండటానికి కారణం వారిలో ఉన్న అజ్ఞానమే, వారి నిరక్షరాస్యత, వారిలో ఉన్న మాట నేర్పని తనమునే, లౌక్యం తెలియకపోవడమే కారణం అంటూ అనేకులు మాట్లాడుతూ ఉంటారు...

🌿 అయితే పౌలు గారు చెప్తున్నారు... అతను ధర్మశాస్త్ర ప్రవీణుడు అందుకే ధర్మశాస్త్రము చొప్పున క్రీస్తు మార్గమును అనుసరిస్తున్న వారిని చంపడం, హింసించడం చేసి దేవుని పని, దేవుని సేవ చేస్తున్నట్లుగా ఆలోచించి హింసకుడిగా, దూషకుడి, హానికరుడుగా జీవిస్తూ ఉన్న అతను క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఎలాంటి వాక్చాతుర్యము లేకుండ, మనుష్య జ్ఞానమును, ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానమును ఆధారము చేసుకొనకుండా కేవలం దేవుని శక్తిని అనగా యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని సువార్త చేసాడు, దేవుని పనిలో బహుగా ప్రయాసపడ్డాడు...

🍁 *క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను - 1కోరింథీ 1:17*

🍁 *నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని - 1కోరింథీ 2:5*

🌿 ప్రియ సహోదరి సహోదరుడా *సువార్త ప్రకటించాలి అంటే, సేవ చెయ్యాలి అంటే మనకి ఎలాంటి విద్యార్హత అవసరం లేదు, అందచందాలు అవసరం లేదు, ఆస్తిపాస్తులు, అంతస్తులు అవసరం లేదు, మాట నేర్పరితనం అవసరం లేదు, లౌక్యం అవసరం లేదు కానీ నీ సమర్పణ జీవితం చాలు, దేవుణ్ణి ప్రేమించే హృదయం చాలు....*

🌿 అందుకే ఎంతోమంది అంగవైకల్యముతో ఉన్నప్పటికీ, ఎంతో మంది అనారోగ్యము ఉన్నప్పటికీ, ఎంతో మంది పేదవారు అయినప్పటికీ, ఎంతోమంది విద్యలేని పామరులు అయినప్పటికీ, ఎంతోమంది బానిసలు అయినప్పటికీ కూడా కేవలం వారు తమ జీవితమును దేవునికి సమర్పించుకోవడం వలన క్రీస్తుపై ఆధారపడి జీవించుట వలన పరిశుద్దాత్మపూర్ణులై దేవునికోసం జీవించారు, ఎన్నో కార్యాలు చేసారు...

🍁 మోషే నత్తివాడు, శిష్యులు విద్యలేని పామరులు, దావీదు గొర్రెలను మేపేవాడు, ఆమోసు పశువుల కాపరి అయినను దేవునిచే బహుబలముగా వాడబడిన వ్యక్తులు....

🍁 *అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది "నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను - యోహాను 14:12, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను - అపో.కార్యములు 1:8"*

🌿 క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి , పరిశుద్ధాత్మను పొందిన ప్రతి వ్యక్తికి ఇహలోకపరముగా ఎలాంటి అర్హతలు లేనప్పటికీ దేవునికి సజీవయాగముగా మనల్ని మనం సమర్పించుకుంటే తప్పక దేవునికోసం బ్రతకగలము....

🌿 *బాప్తిస్మము పొందిన నీవు, బల్లసహవాసములో పాలు పొందుతున్న నీవు తప్పక ఆయన గుణాతిశయములను ఈలోకమున ప్రచురించాలి, ఆయన మరణమును ప్రచురించాలి, సువార్త పని చెయ్యాలి... అది నీ కుటుంబములో కావచ్చు, నీ బంధువుల యొద్ద కావచ్చు, నీ ఇరుగుపొరుగు వారికి కావచ్చు.... ఏ విధముగానైనా, ఎలా అయినా సరే తప్పక క్రీస్తుని ప్రచురించాలి అలా కాదని సాకులు చెప్పుకుంటూ, ప్రభువునందు విశ్వాసముంచక, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ, బాధపరుస్తూ జీవిస్తూ కాలం గడిపేస్తుంటే తప్పక నీవు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా....*

మీ
https://t.me/teluguchristians
💓 *_దేవుని యెడల ప్రేమకలిగి ఉన్నావా_* 💓

💚 సహజముగా ఒక ఇంటికి ఒక కొత్త వ్యక్తి వస్తే మొదటిసారి వారు రావడం గనుక మనం వారికి ఎన్నో అతిధి మర్యాదలు చేస్తాము, బాగా చూసుకుంటాము, అన్నీ అమర్చి పెడతాము... కానీ అదే వ్యక్తి తరచుగా మన ఇంటికి రావడం, మన ఇంట్లో మన మనిషి వలే కలిసిపోవడం చేస్తుంటే ఆ వ్యక్తిని ప్రత్యేకముగా ఏమి చూడము, మనం తినేవే వారికి పెడతాము, మనం పడుకునే స్థలంలోనే వారికి కూడా ఏర్పాటు చేస్తాము.... ఒకప్పుడు గౌరవంగా చూసిన వ్యక్తిని ఇప్పుడు సాధారణముగా చూడటం, ఒకప్పుడు ఏవేవో అమర్చిన వ్యక్తికి ఇప్పుడు మనం వాడినే వాటినే వారికి కూడా ఇవ్వడం అనేది చేస్తుంటాము...

💚 ఈరకమైన అలవాటును కలిగి ఉన్న మనం దేవుని విషయములో కూడా ఇలానే చేస్తున్నాము... అదేంటి అని ఆలోచిస్తున్నావా....??????

🧡 "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము - ప్రకటన గ్రంథం 3:20" అనే వాక్యం ప్రకారం దేవుడు మన హృదయమనే తలుపు తట్టినప్పుడు ఆయనను మన హృదయమనే ఇంటికి ఆహ్వానిస్తాము.... అందుకే "మనమే దేవుని ఇల్లు అని, మన దేహమే అయన ఆలయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది"

🧡 మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు - 1కోరింథీ 3:9

🧡 మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? - 1కోరింథీ 3:16

💙 అయితే నూతనముగా మన హృదయమనే ఇంటిలోనికి ఆహ్వానించిన దేవుణ్ణి రక్షించబడిన, ఆహ్వానించిన తొలి దినాల్లో ఎంతో ప్రేమిస్తాము, అందుకే టైం టూ టైం ప్రార్ధన చేస్తాము, వాక్యము చదువుతాము, పాపము అంటే ఆమడ దూరంలోకి పారిపోతాము, పరిశుద్ధతకే ప్రాధాన్యత ఇస్తాము, దేవునికే ప్రధమ స్థానము ఇస్తాము, మందిరమునకు, సంఘ కూడికలకు క్రమము తప్పకుండ సమయము ప్రకారము హాజరవుతాము, కాపరిని ఎంతో గౌరవిస్తాము, అందరిని ఎంతో ప్రేమిస్తాము.... కానీ కాలక్రమేణా రోజులు గడిచేకొలది దేవుడు పాతవాడు అయిపోతాడు కాబట్టి ఎప్పుడు మాట్లాడే దేవుడే కదా, ఎప్పుడు వెళ్లే మందిరమే కదా, ఎప్పుడు చేసే ప్రార్ధనే కదా అంటూ నెమ్మది నెమ్మదిగా తిరిగి లోకంలో పడిపోవడం, పాపములోనికి జారిపోవడం చేస్తూ ఆచారపూర్వకమైన భక్తిని చేస్తూ, దేవుని యెడల పరిపూర్ణమైన ప్రేమను విడిచిపెట్టి జీవిస్తూ ఉంటాము...

💜 అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది "నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది - ప్రకటన 2:2-4"

💙 ఇది నా గురించి కాదులే ఎఫెసు సంఘము గురించి అని ఆలోచిస్తున్నావా... సంఘము అంటే నాలుగు గోడలు కాదు మనమే దేవుని సంఘము కదా కాబట్టి ఇది మన గురించే.... మనలో ఎంతో మంది నేటి దినములలో ఈరీతిగానే జీవిస్తున్నారు, దేవునిపై ప్రేమ లేకుండా, దేవుని విషయాలలో ఆసక్తి లేకుండా, దేవుడంటే భయము భక్తి లేకుండా, పరిశుద్ధతకు, దేవునితో సహవాసమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మేము క్రైస్తవులమే, మేము రక్షించబడ్డాము, ప్రార్ధన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, చర్చికి పోతున్నాము, దేవుని సేవ కూడా చేస్తున్నాము ఇంకేంటి మాలో లోపము, ఇంకేంటి మాలో తప్పు అని ఆలోచిస్తున్నారు.... అందుకే దేవుడే చెప్తున్నారు *"మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది - ప్రకటన 2:4"*

💜 *అవును అన్నీ చేస్తున్నాము కానీ ప్రేమే లేదు అదే దేవుడు నేడు మనకి చెప్తున్నారు.... అంతేకాకుండా "ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక - 1కోరింథీ 16:22 , క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము - 2తిమోతికి 1:13" అని చెప్తున్నారు... గనుక ప్రభువు యెడల ప్రేమకలిగి మనం నడచుకుంటున్నామా... ప్రభువుకే మన జీవితములో ప్రధమ స్థానం ఇచ్చామా... ప్రభువును ఎదుర్కొనుటకు పరిశుద్ధముగా జీవిస్తున్నామా... ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుందాము... ఇట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక... ఆమేన్...*

మీ
https://t.me/teluguchristians
🔥 *_దేవుని దూత నీకు తోడై ఉండాలా_* 🔥

🌿 దేవుని దూతలు మనకు కావాలి ఉంటారని, తన ప్రజలకు తన సమాచారం లేదా సందేశము చేరవేయుటకు, తన ప్రజలను బలపరచుటకు, ఆదరించుటకు దేవుడు తన దూతలను మన యొద్దకు పంపిస్తారని మనకు తెలుసు.... మరియ యొద్దకు శుభవార్తమానము తీసుకుని ఒక దూత వచ్చారు, దానియేలును బలపరచుటకు మరియొక దూత వచ్చారు... అందుకే దేవుని వాక్యంలో కూడా నా దూతను నీకు ముందుగా పంపించెదను అని, రాయి తగలకుండా తన దూతలు మనల్ని కాపాడుతారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది.

🌿 అయితే మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఒక్కో పరిస్థితిలో ఒక్కో దూత మన యొద్దకు పంపబడతారు.. అయితే నేడు మనం ఉన్న పరిస్థితి ఏమిటి, దానిని బట్టి మన యొద్ద నిలువబడిన దూత ఎవరు అనేది ఒకసారి వాక్యానుసారముగా చూద్దాము...

🍁 *ఆదరించిన దూత* - శారా మాటలను బట్టి కృంగిపోయిన హాగరు అబ్రాహాము ఇంటిని నుండి బయటకు వచ్చేసింది... అయితే మార్గమధ్యలో దేవుని దూత ఆమెకు కనబడి ఆమెను బలపరిచారు.

🌲 యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు - ఆది 16:11

🍁 *దేవుని ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దూత* - తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షమున నిలువబడుటకు, వారి పక్షమున యుద్ధము చేయుటకు దేవుడే ఒక దూతను వారియొద్దకు పంపించారు.

🌲 యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసినా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను - యెహోషువ 5:13,14

🍁 *నాశనము చేసిన దూత* - దావీదు దేవునికి విరోధముగా ఒక నిర్ణయము తీసుకున్నాడు అదేమిటంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అని లెక్క చూడాలి అనుకున్నాడు... తన సేవకుడైన యోవాబును ఆ పనిని అప్పగించాడు అయితే యోవాబు దావీదుని ఎంతగా హెచ్చరించినప్పటికీ కూడా అతని మాటను లెక్క చేయక ఒక రాజుగా తాను ఆజ్ఞాపించిన పనిని నెరవేర్చమని యోవాబుతో చెప్పాడు, అయితే ఆ ఆలోచన దేవుని దృష్టికి అంగీకారముగా, ఆమోదయోగ్యముగా లేదు అందుకే దావీదుకు మూడు శిక్షలను చెప్పి వాటిలో ఎదో ఒకటి ఎంచుకోమంచి చెప్పాడు తత్ఫలితంగా దావీదు ఎంపిక మేరకు ఇశ్రాయేలీయలను నాశనం చేయుటకు దేవుడు నాశనం చేయు దూతను వారియొద్దకు పంపించాడు.

🌲 దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెనుచిత్తగించుము; పాపము చేసినవాడను నేనే; దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే; గొఱ్ఱలవంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి యింటివారిని శిక్షించుము - 2సమూయేలు 24:17

🍁 *ఖడ్గము చేతపట్టుకొనిన దూత* - బిలాము రాజైన బాలాకు చెప్పిన మాటలకు, అతను ఇస్తాను అని చెప్పిన కానుకలు లొంగిపోయాడు అందుకే దేవుని మాటకు వ్యతిరేఖంగా బాలాకు యొద్దకు బిలాము బయలుదేరాడు... అయితే దేవుని ఆజ్ఞకు వ్యతిరేఖంగా ప్రయాణం చేయుచున్న బిలాము యొద్దకు ఖడ్గము దూసిన దూతను దేవుడు పంపించారు.

🌲 యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా - సంఖ్యా 22:31

🍁 *బలపరచిన దూత* - దేవుని మాటలకు అవిధేయులైన ఇశ్రాయేలీయులను మిద్యానీయులు బహుగా హింసిస్తున్నారు, కరవు ఆదేశములో తాండవమాడుతుంది దానితో గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా దేవుని దూత అతనికి కనిపించి అతనిని బలపరిచారు.

🌲 యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా - న్యాయాధిపతులు 6:12

🍁 *మార్గము సరాళము చేయు దూత* - తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో వెట్టిచారికి చేయుచుండగా శత్రువు దేశము నుండి వారిని తోలివేసి, వారి దేశమును ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుటకు దేవుడే తన దూతను వారికి ముందుగా పంపించారు.

🌲 నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను - నిర్గమ 33:2

🍂 *ప్రియ సహోదరి, సహోదరుడా... మరి నేడు నీవు స్థితిని బట్టి ఏ దూత నీకు కావాలిగా ఉన్నారు... ఆదరించే దూత, బలపరిచే దూత, మార్గము సరాళము చేసే దూత, నీ పక్షముగా యుద్ధము చేయు దూత నీతో ఉన్నారా లేక నీ అవిధేయతను బట్టి, నీ అవిశ్వాసమును బట్టి, నీ లోబడనొల్లని తనము బట్టి నాశనము చేయు దూత, ఖడ్గము చేతపట్టుకున్న దూత నీతో ఉన్నారా... ఒక్కసారి ఆలోచించు....*

🍂 *నీ విధేయతను బట్టి, నీ పరిశుద్ధ జీవితమును బట్టి ఆదరించుటకు, బలపరచుటకు, యుద్ధము చేయుటకు, మార్గము సరాళము చేయుటకు ఒక దూత నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా నిలిచి ఉన్నారా లేక నిన్ను సరిచేయుటకు, శిక్షించుటకు, నాశనం చేయుటకు తన చేతినెత్తిన క్రూర దూత నీ ప్రక్కన ఉన్నారా....*
🌿 *యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును - కీర్తనలు 34:7*

🌿 *నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు - కీర్తనలు 91:11,12*

🍂 *నీ ప్రక్కన నిలువబడిన దూత ఎవరు..???? నీ జీవితం ఎలా ఉంది....???? నీ పక్షమున ఎవరు నిలువబడాలి ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకుని సరిచేసుకో ప్రియ దేవుని బిడ్డా...*

మీ
https://t.me/teluguchristians
🌹 నిన్ను బలవంతము చేయుచున్న ప్రేమ ఏమిటి 🌹

💚 ఒక రోజు ఉదయాన్నే ఒక పెద్దాయన తన చేతికి ఉన్న కుట్లు తీయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఉన్న నర్సుతో అమ్మా త్వరగా కుట్లు విప్పదీయవా అని అడుగుతారు. తన చేతిని పరీక్షించి డాక్టర్ గారు రావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి మీరు ఒక గంటలవరకు ఆగండి అని చెప్తుంది నర్సు.

💚 అమ్మా లేదు నేను చాల త్వరగా వెళ్ళాలి వేరే ఆసుపత్రిలో నా భార్య ఉంది తనతో కలిసి నేను టిఫిన్ చెయ్యాలి అని చెప్తాడు. కానీ డాక్టర్ గారు చూడకుండా కుట్లు విప్పతీయరు. అయినా ఆలస్యముగా వెళ్తే మీ భార్య తిడతారా అని అడుగుతుంది నర్సు.

💚 లేదమ్మా గత ఐదు సంవత్సరముల నుండి నా భార్య అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంది . తనకి నేను ఎవరో గుర్తులేదు అని చెప్తారు. అదేంటి మీరు ఎవరో కూడా తెలియని మనిషి, మిమ్మల్ని గుర్తు పట్టని మనిషికోసం అంత ఆరాటపడుతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తుంది.

💚 నేను ఎవరో తనకి తెలియకపోవచ్చు అమ్మ కానీ తను ఎవరో, తను నాకు ఏమవుతుందో, తను నాకు ఎంత విలువైనదో నాకు తెలుసుకదమ్మా. మరి నా ప్రాణమైన తనకి బాగాలేదు అని, తను నన్ను గుర్తుపట్టడం లేదు అని నేను తనని ఎలా విడిచిపెట్టగలను అని అంటారు ఆ పెద్దాయన.

👉 నేటి దినాలలో ప్రేమ, ప్రేమ అంటూ చెప్పుకుని తిరుగుతున్న యువతా నీ ప్రేమ ఎలాంటిది.

🌹 అందముగా, ఆకర్షణీయముగా, నీకు అన్నీవిధముల సరిపడే విధముగా, నీ కోరికలు, ఆనందాలు తీర్చుకునే విధముగా ఉన్నప్పుడు పుట్టే ప్రేమలా....

🌹 ఒకే కులం, ఒకే చోట ఉద్యోగం, ఒకే ప్రాంతము, ఒకే రంగు, పొడవు, ఒత్తు ఉన్నప్పుడు పుట్టే ప్రేమాలా.

👉 నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని అని చెప్పుకుంటూ మరోవైపు హృదయములో మరొకరితో వ్యభిచరిస్తూ నేను క్రీస్తు శిష్యుడిని, శిష్యురాలిని అని చెప్పుకుంటున్న విశ్వాసి ప్రేమికుల రోజు అంటూ దేవుని ప్రేమను వాక్యరూపములో ప్రకటిస్తున్నా సోదరా నిజమైన క్రీస్తు ప్రేమచే నీవు నింపబడ్డావా.

💘 క్రీస్తు ప్రేమ వాక్యం చూపించుటలో ఆగిపోలేదు. మనం ఇంకా పాపములో ఉన్నప్పుడు, ఇంకా తనకి దూరముగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి పరలోకములో ఉండవలసిన తాను మన కోసం ఈ భువికి వచ్చి మరణించారు. మరి ఆ ప్రేమతో నింపబడిన మనం ఎలా క్రీస్తు ప్రేమను లోకానికి చూపిస్తున్నాము.

💘 ధూషకుడిగా, హానికరుడిగా, హింసకుడిగా ఉన్నప్పుడు తన యెడల క్రీస్తు చూపిన ప్రేమ నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించమని ఆ ప్రేమ బలవంతము చేసింది.

👉 మరి నిన్ను ఏ ప్రేమ బలవంతము చేస్తుంది లోక ఆకర్షణలకు లొంగిపోయిన నీ ప్రేమను చూపించమనా లేక క్రీస్తు ప్రేమతో నింపబడి నశించిపోతున్న వారికి క్రీస్తు ప్రేమ చూపించమనా....
💥 *_నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా_* 💥

🌿 పెద్దవాళ్ళు తమ బిడ్డలకి "ఒరేయ్ నువ్వు మాకేదో మంచి చెయ్యకపోయినా, మమ్మల్ని ఉద్దరించకపోయినా పర్వాలేదు గాని మా పరువు మాత్రం తియ్యకు, మాకున్న మంచి పేరుని చెడగొట్టకు" అని చెప్తుంటారు... ఎవరైనా పిల్లలు పదే పదే తల్లితండ్రుల మాటలకు అవిధేయులై జీవిస్తూ ఉంటె ఇలాంటి పిల్లలుపుట్టకపోయినా బావుండు కానీ పుట్టిన తర్వాత ఇలా వేపుకుతింటున్నారు, ఇలా బాధపెడుతున్నారు అంటూ చాలామంది తల్లితండ్రులు తమ బిడ్డల గురించి దిగులుపడుతూ, బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి తల్లితండ్రి, కుటుంబ పెద్ద కోరుకునేది ఒక్కటే అదేమిటంటే "బిడ్డలు ఏమి చేసినా తమ కుటుంబానికి గౌరవం రావాలని, ఏ పని చేసినా ఒక క్రమమైన పద్దతిలో చెయ్యాలని ఆశిస్తారు, ఏమి చేసినా తమకు మంచి జరగాలని కోరుకుంటారు అందుకే వారి చదువుల విషయములో, వివాహ విషయములో, ఉద్యోగ విషయములో, ప్రవర్తన విషయములో, వస్త్రధారణ మరియు వేషధారణ విషయములో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు...

🌿 ఈలోకంలో మనకి తల్లితండ్రులు ఉండచ్చు, మనం తల్లితండ్రులము అవ్వచ్చు కానీ మనకి అందరికి కూడా ఒక తండ్రి ఉన్నారు... ఆయన కూడా ఈలోకములోని తల్లితండ్రులవలె తమ బిడ్డలవలన తనకి మహిమ రావాలని, తన బిడ్డలు ఒక క్రమమైన పద్దతిలో నడవాలని కోరుకుంటున్నారు...

🌸 కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి - 1కోరింథీ 10:31

🌸 సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి - 1కోరింథీ 14:40

🌸 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి - మత్తయి 5:16

🌸 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి - 1కోరింథీ 6:20

🌿 అయితే మనం దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నామా.... మనం ఏమి చేసినప్పటికీ అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, వేషధారణ కావచ్చు, ప్రవర్తన కావచ్చు ఏమి చేసినప్పటికీ, ఎలా జీవించినప్పటికీ దేవునికి మన వలన మహిమ వస్తుందా.... మహిమ వచ్చేలా, ఇతరులు దేవుణ్ణి మహిమపరచేలా మనం జీవిస్తున్నామా...

🌿 ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు పద్దతిగా, క్రమముగా నడుచుకుంటూ ఉంటె వారిని చూసినప్పుడు చాల ముచ్చటగా ఉంటుంది, అబ్బా ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు, వీరి పెద్దవాళ్ళు ఎంత పద్దతిగా పిల్లలను పెంచారు అంటూ వారిని కొనియాడతాము, వారిపై చక్కని ప్రేమను కనపరుస్తాము... కానీ అదే పిల్లలు ఇల్లు పీకి పందిరి వేసే రకముగా ఉంటె, తమ అల్లరితో, ప్రవర్తనతో విసిగిస్తూ ఉంటె ఎందుకొచ్చానురా బాబు ఈ ఇంటికి ఇలాంటి పద్ధతిలేని పిల్లల్ని నేను ఎప్పుడు చూడలేదు అంటూ వారిని అసహ్యించుకుంటాము...

🌸 మరి ఇదేవిధముగా పరలోకపు తండ్రికి బిడ్డలమైన మనం వాక్యానుసారముగా క్రమముగా నడచుకుంటే ఆయనకు మహిమ కలుగుతుంది, అన్యజనుల ముందు లోకము ముందు ఆయన ఘనపరచబడతారు తత్ఫలితముగా మన తండ్రి ఎంతగానో సంతోషిస్తారు.. అదే మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటె సాతాను, లోకం దేవుణ్ణి ఎంతగానో ప్రశ్నిస్తారు, వేధిస్తారు అందుకే దేవుడు చెప్తున్నారు *"నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును - సామెతలు 27:11"* అని.

🌸 *అయితే మనం ఎలా జీవిస్తున్నాము??? క్రమముగా, మర్యాదగా, బుద్దిగా నడచుకుంటున్నామా లేక లోకం మనల్ని బట్టి దేవుణ్ణి దూషించేవిధముగా, దేవుడంటే ఉండే భక్తి పోయే విధముగా జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము.*

https://t.me/teluguchristians
మంచి శ్రోతగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

సామెతలు 18:13 ఇలా చెబుతోంది, "[వాస్తవాలు] వినకముందే సమాధానం చెప్పేవాడు — అది అతనికి మూర్ఖత్వం మరియు అవమానం."

జాగ్రత్తగా వినకముందే స్పందించడం అవివేకమని ఈ లేఖనం బోధిస్తుంది. మీరు ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మీ అభిప్రాయాన్ని త్వరగా ఇస్తే, అది జ్ఞానం కంటే అజ్ఞానాన్ని చూపుతుంది. ముందుగా వినడం వల్ల పరిస్థితి యొక్క వాస్తవికతను గ్రహించి తెలివిగా స్పందించే అవకాశం లభిస్తుంది.

మంచి శ్రోతగా ఉండటం వల్ల మాట్లాడే వ్యక్తి కంటే విలువైనది. ఇతరుల మాట వినకుండా ఎక్కువగా మాట్లాడే వ్యక్తికి జ్ఞానం ఉండదు మరియు చాలా తప్పులు చేస్తాడు. "మూర్ఖుడి కోపం ఒకేసారి తెలుస్తుంది, కానీ వివేకవంతుడు సిగ్గును కప్పివేస్తాడు" అని బైబిల్ చెబుతోంది. తొందరపడి మాట్లాడకుండా లేదా కోపంతో స్పందించకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకున్నప్పుడు, మీరు జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. కోపం మరియు కఠినమైన మాటలు చెడు ప్రతిస్పందనలకు దారితీస్తాయి, కానీ ఓపికగా వినడం వల్ల మీరు తెలివిగా సమాధానం ఇవ్వడానికి సహాయపడుతుంది.

తప్పు చేసిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు, కఠినమైన మాటలు సహాయపడవు, బదులుగా వారి స్ఫూర్తిని విచ్ఛిన్నం చేస్తాయి. బైబిలు ఇలా చెబుతోంది, "మృదువైన సమాధానం కోపాన్ని చల్లార్చుతుంది, కానీ కఠినమైన మాట కోపాన్ని రేపుతుంది." (సామెతలు 15:1). మీరు కఠినంగా మాట్లాడితే, ఆ వ్యక్తి దిద్దుబాటుకు సిద్ధంగా ఉండటం కంటే నిరుత్సాహపడవచ్చు మరియు రక్షణాత్మకంగా భావించవచ్చు. కానీ మీరు సున్నితంగా మాట్లాడితే, వారు తమ తప్పును గుర్తించి దాని నుండి నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే ముందు జాగ్రత్తగా వినడం వల్ల మీరు చెప్పడానికి సరైన పదాలను ఎంచుకోవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి పరిస్థితికి మీ అభిప్రాయం అవసరం లేదు. కొన్ని విషయాలను చర్చ లేదా వాదన కంటే నిశ్శబ్దంగా మరియు ప్రార్థనలో నిర్వహించాలి. "జ్ఞానం ఉన్నవాడు తన మాటలను విడిచిపెట్టడు మరియు అవగాహన ఉన్నవాడు ప్రశాంతమైన మనసు కలిగి ఉంటాడు." (సామెతలు 17:27). మౌనంగా ఉండటం నేర్చుకోవడం అనవసరమైన ఘర్షణలను నివారించడానికి మీకు సహాయపడుతుంది. అనవసరమైన మాటలు విభజనకు కారణమవుతాయి, కానీ ప్రశాంతంగా మరియు మంచి శ్రోతగా ఉండటం ద్వారా, మీరు శాంతిని కాపాడుకుంటారు.

ఈరోజు, మంచి శ్రోతగా ఉండటానికి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే వినడం జ్ఞానానికి దారితీస్తుంది, తప్పులను నివారిస్తుంది మరియు ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. శ్రద్ధగా వినండి, చాలా త్వరగా మాట్లాడకుండా ఉండండి మరియు మీ మాటలు జ్ఞానవంతంగా మరియు ఉత్తేజకరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

ప్రార్థన: ఓ జ్ఞాన దేవా, నాకు మంచి శ్రోతగా మరియు వినయంగా ఉండటం నేర్పు. నేను తెలివిగా మాట్లాడగలిగేలా మరియు నా కోపాన్ని నియంత్రించుకునేలా నాకు ఓపికగల హృదయాన్ని ప్రసాదించు. నా మాటలను జ్ఞానంతో ఉపయోగించుకోవడానికి మరియు ఇతరులకు శాంతిని కలిగించడానికి నన్ను నడిపించు. ఆమెన్.

https://t.me/teluguchristians