Gita in Life and at Work
120 subscribers
115 photos
13 videos
1 file
35 links
Individual interpretations of the Students of SGS Gita foundation, Led by Acharya Srikant Challa ,
Karya Siddhi Hanuman Temple , Frisco with divine blessings of HH Shri Ganapati Sacchidananda Swamiji. These interpretations are not that of organization
Download Telegram
Please join us for SriramaKoti Chalisa Koti parayana Today between 17:00 to 1830 hrs and every Saturday and Sunday same time at Karya Siddhi Hanuman Temple.

Please submit your parayana and likitha paryanam counts online at www. Dallas hanuman.Org .

Please write one page of likitha parayana it just takes 15 minutes .

Jai srirama
Śrī Rāma Karṇāmṛtam
Dvitīyāśvāsam​
Ślōka 4

sākēte navaratnapankti khacitē citradhvajālankŗtē
vāsē svarņamayē daļāșṭalalitē padmē vimānōttamē|
āsīnam bharatādisodarajanaiḥ śākhāmŗgaiḥ kinnaraiḥ
dikpālairmunipungavai rnrupagaņaissamsēvyamānam bhajē||

rough translation:
i pray to sri rama, who in his abode in ayodhya is surrounded by sita, bharata and other brothers, monkeys, kinnaras, rulers of the directions, saints, sages and great kings and is seated in a gold lotus with eight petals, which is placed in a plane studded with rows of nine gems and decorated with various types of flags.

*శ్రీరామకర్ణామృతము*

*ద్వితీయాశ్వాసము*

శ్లోకము *4*

*సాకేతే నవరత్నపఙ్క్తిఖచితే చిత్రధ్వజాలంకృతే*

*వాసే స్వర్ణమయే దళాష్టలలితే పద్మే విమానోత్తమే I*

*ఆసీనం భరతాదిసోదరజనైః శాఖామృగైః కిన్నరైః*

*దిక్పాలైర్మునిపుంగవై ర్న్రుపగణైస్సంసేవ్యమానం భజే ॥*


అయోధ్యయందు నవరత్నములు పొదగబడి, చిత్రములైన ధ్వజములచే (జెండాలచే) అలంకరింపబడిన గృహములో విమానమందుగల బంగారు అష్టదళ పద్మములో సీతతోగూడి, భరతాదులతోను, వానర, కిన్నర, దిక్పతులతోను, మునిశ్రేష్ఠులతోను, రాజసమూహములతోను సేవించబడుతున్న ఆ శ్రీరాముని సేవించుచున్నాను.
Śrī Rāma Karṇāmṛtam
Dvitīyāśvāsam​
Ślōka 5



kandarpāyuta kōṭikōṭitulitam kālāmbudaśyāmalam
kambugrīva mudārakaustubhadharam karņāvatamsōtpalam|
kasturītilakōjjvalam smitamukham cinmudrayālamkŗtam
sītālakșmaņavāyuputra sahitam simhāsanastham bhajē||

rough translation:

i pray to sri rama, who is seated on a throne, whose beauty equals many manmadhas, who is dark like the black clouds filled with water, whose delicate neck resembles a conch, who has the kaustubha jewel on his chest, who wears earrings shining as the night lotus, who is adorned with the splendid kasturi on his forehead and has a smiling face, who is showing the chinmudra and is surrounded by sita, lakshmana and hanuman.


*శ్రీరామకర్ణామృతము*

*ద్వితీయాశ్వాసము*

శ్లోకము *5*


*కందర్పాయుతకోటికోటితులితం కాలాంబుదశ్యామలం*
*కంబుగ్రీవ ముదారకౌస్తుభధరం కర్ణావతంసోత్పలమ్*
*కస్తూరీతిలకోజ్వలం స్మితముఖం చిన్ముద్రయాలంకృతం*
*సీతాలక్ష్మణవాయుపుత్రసహితం సింహాసనస్థం భజే*

Meaning

లక్షకోటి మన్మథులతో సమానమై, వర్షాకాలమేఘమువలే నల్లనై, శంఖమువంటి కంఠము కలిగి, కౌస్తుభమణిని ధరించి, కలువలవంటి కుండలములు, కస్తూరీతిలకముచే, చక్కని నవ్వుచే, ఙ్ఞానముద్రతో ప్రకాశించుచూ, సీతాలక్ష్మణ ఆంజనేయునితో కూడి సింహాసనమందున్న శ్రీరాముని సేవించుచున్నాను
Jai srirama
Hanuman Chalisa parayana every Saturday and Sunday at Karya Siddhi Hanuman temple between 1700 and 1830 hrs . Please submit your Srirama Koti likitha parayana counts and hanuman chalisa counts at www. Dallashanuman .org

Jai Hanuman
*Srirama rahasya upanishad *

18. Chanting the four letter mantras by adding the root letters of Sri, Maya and Manmatha as prefix and suffix of the four and six letter mantras grants all ones wishes.

19. Adding svaha, or hum phat or namah at the end, in various combinations, make up the 18-lettered mantras.

20. In these mantras, Brahma as sammohana shakti, Dakshinamurty, Agastya, and Shiva are said to be the ascetics, in that order.

21. The meter (chanda) is Gayatri, and the Deity is Shri Rama. Or, Kama-bija at the beginning and Vishvamitra the Rishi.

22. The meter Gayatri of different deities and Ramabhadra the ‘devata’. The shakti-bija is invoked as before as with the 6-lettered mantra.

23. Touching on the top of the head, in the middle between the eye-brows, heart, thighs, and feet, the mantras are recited with bija-s and anga-nyasa.

24. Dhyana:
I worship Sri Rama,
Whose body shines with various ornaments, Who is as brilliant as lightning,
Who assumes the Virasana posture,
Who shows jnana Mudra by one hand,
Who keeps the other hand on his thigh,
And who wears the crown.

25. Then one should, with prostrations, recite “Ramachandraya and Ramabhadraya Namah”, and the king of seven lettered mantras and the fulfiller of all wishes.
హనుమజ్జయంతి శుభాకాంక్షలు

1. హనుమ - జననం - పొందిన వరాలు

హనుమంతుని తండ్రి పేరు కేసరి.
అంజన ఆ కేసరి యొక్క భార్య.
అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడ.
ఈయన వాయుదేవుని వర ప్రభావమున జన్మించాడు.

జయంతి

వైశాఖ బహుళ దశమి

హనుమ పొందిన వరాలు:

శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు,
సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగురడం,
సూర్యనివద్డ హనుమను చూచి రాహువు ఇంద్రునికి ఫిర్యాదు,
ఇంద్రుడు వచ్చి వజ్రాయుధ ప్రయోగం,
ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి నిర్జీవుడై పడిపోవడం జరిగింది.
అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు.
వాయువుకి సంతోషం కలిగించడానికీ,
భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు.

1. ఇంద్రుడు:
బంగారు పద్మహారమునిచ్చి,
హనుమ అని నామమిడి,
తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు.

2. సూర్యుడు:
తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ,
శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ,
తద్వారా వాక్చతురుడు కాగలడనీ,
శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు.

3. వరుణుడు:
తన పాశము వలనగానీ, జలములవలనగానీ,
లక్షలకొలది సంవత్రరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు.

4. యముడు:
తన దండము వలన మృత్యువు కలగదనీ,
ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ,
యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు.

5. కుబేరుడు:
సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు.

6. శంకరుడు:
తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు.

7. విశ్వకర్మ:
తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ,
చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు.

8. బ్రహ్మ:
ఏ బ్రహ్మదండంచేతనూ వధ్యుడు కాడనీ,
దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి,

వాయుదేవునితో మారుతిని గూర్చి
శత్రువులను గడగడలాడించగలడనీ,
మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ,
యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ,
కోరుకొన్న రూపాలను పొందగలడనీ,
ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ,
చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ,
యుద్ధమునందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుతకృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుననీ,
లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు.

ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు వాయుదేవుడు.

జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్రలంఘనం చేయించాడు.

మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు.
హనుమజ్జయంతి అయిన ఈరోజు ప్రత్యేకంగా
సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. మన జీవిత లక్ష్యాలు నెరవేర్చుకొందాం.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై
3. హనుమ - ఆచార్యుడు

జీవునిలో భగవంతుని పొందాలి అనే ఆర్తి కలిగినపుడు, భగవానుడే ఆచార్యుని ఎంచి, జీవుని వద్దకు పంపుతాడు.
ఆచార్యుడు వేద సంపన్నుడు, భగవదనుభవము పొందినవాడు కావలెను.
"శ్రోత్రియమ్ బ్రహ్మనిష్ఠమ్" అని శ్రుతి.

అ) శ్రోత్రియుడు
హనుమ మొదటగా రామలక్ష్మణులను కలసి మాటలాడినప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమను ప్రశంసించిన విషయం అతిగొప్పది.
హనుమ ఋగ్వేద,యజుర్వేద,సామవేదములను అధ్యయనము చేసినవాడని మూడు వేదాలకి సంబంధించి వరుసగా "వినీతః, ధారిణః, విదుషః" అనే మూడు విశేషణాలతో పొగడబడ్డాడు.

వినీతః

ఋగ్వేదమున ప్రతివర్ణానికీ స్వరముంటుంది. గురువు వద్ద ఎంతో శిక్షణ పొందినగానీ దానిని సరిగా చదువలేరు. అందుకని హనుమను "ఋగ్వేద వినీతుడు" అన్నాడు రాముడు.
'వినీతుడు' అంటే 'శిక్షితుడు" (Trained).

ధారిణః

యజుర్వేదంలో ఒక అనువాకంలో వాక్యము మరొక అనువాకంలో కనబడుతూంటుంది. అవి కలియకుండ ధారణ అవుసరం. అందుచే "యజుర్వేద ధారిణః" అన్నాడు.
"ధారణ" అంటే జ్ఞప్తికి చెందిన శక్తి (Memory).

విదుషః

సామవేదము గాన ప్రధానము. గానములో మార్పులు చేయు జ్ఞానము "విదుషత్వము". అది కలవాడని హనుమను శ్రీరాముడు "సామవేద విదుషః" అని గుర్తించాడు.
"విదుషిత్వము" అంటే సరియైన ప్రయోగము (Proper practical application).

కాబట్టి హనుమ మూడుగా నున్న వేదాలకు సంబంధించి,

శిక్షణ పొందినవాడు, జ్ఞప్తియందుంచుకొనేవాడు, ప్రయోగించువాడు అని

మెచ్చుకోబడి శ్రోత్రియుడయ్యాడు.


ఆ) బ్రహ్మనిష్ఠుడు

వేదాధ్యయన జ్ఞానముతో అభ్యాసము చేయుచూ, భగవత్తత్త్వము అనుభవించుట బ్రహ్మనిష్ఠ.
రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై ఆసీనులను చేసి, సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్ళాడు హనుమ. తద్వారా పరమాత్మతో అనుభూతి పొంది, బ్రహ్మనిష్ఠుడయ్యాడు.

పరమాత్మ వేదజ్ఞానపరాయణుడైన హనుమను గుర్తించి, తాను హనుమకు పరమాత్మానుభూతి కూడా కలిగించి ఆచార్యుని చేశాడు.

"లంక" అనే దేహంలో,
"సీత" అనే జీవుని,
"రావణుడు" అనే ఇంద్రియాలు బంధించి యుంచితే,
ఆ "సీత" అనే జీవుడు
"రాముడు" అనే పరమాత్మను పొందాలని ధ్యానిస్తున్నప్పుడు,
"హనుమ" అనే ఆచార్యునితో అక్కడకు,
"అంగుళీయకము"తోపాటు తన సందేశాన్ని భగవంతుడైన శ్రీరాముడు పంపాడు.

మనం కూడా ఆ సందేశం పొందాలి.

సరియైన విషయమై
శిక్షణ(Training),
జ్ఞప్తి(Memory),
జీవితంలో ఆచరణ(Application/Interpretation) అనే మూడూ శ్రోత్రియునిగా తయారుచేసి, తద్వారా,

సాధనలో అనుభూతితో బ్రహ్మనిష్ఠునిగానూ చేసి,
మనలను తావలెనే మార్చి అనుగ్రహిస్తాడు హనుమ.

జై శ్రీరామ్ జై హనుమాన్
4. హనుమంతుడు - కుండలినీ యోగ సాధకుడు

యోగి, కుండలినీశక్తిని మూలాధారము నుండి పైకి ప్రయాణింపజేసి, స్వాధిష్ఠాన - మణిపూర - అనాహత - విశుద్ధ - ఆజ్ఞా చక్రములను అతిక్రమించి, చివరికి సహస్రారపద్మాంతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందుతాడు. అదే యోగ సిద్ధి.

హనుమంతుడు జితేంద్రియుడు. అంటే ఇంద్రియ చాపలం లేనివాడు. బుద్ధిమతాంవరిష్ఠుడు. అనగా ఇతర విక్షేపములు లేని బుద్ధి, లక్ష్యశుద్ధి కలవాడు.

1. మూలాధారం:
హనుమంతుడు మహేంద్రపర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటే మూలాధారంనుంచీ కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం.

2. స్వాధిష్ఠాన చక్రం:
మైనాకుడు సహాయం చేయవచ్చినా అదికూడా గమనానికి అవాంతరమే కదా! ప్రలోభాలకీ సుఖాలకీ ఆశించక, ఆటంకాన్ని దాటటం స్వాధిష్ఠానాన్ని అతిక్రమించడం.

3. మణిపూర చక్రం:
తనని సురస మ్రింగెదనని, తన నోట ప్రవేశింపుమని అడ్డగించింది. ఆ సురస నోట ప్రవేశించి, బయటపడి తప్పించుకొనడం మణిపూర చక్రాన్ని అతిక్రమించడం.

4. అనాహత చక్రం:
సింహిక ఛాయాగ్రహణం చేయగా, దానిని సంహరించటం అనాహతాన్ని దాటి పైకి సాగటము.

5. విశుద్ధి చక్రం:
లంకా ప్రవేశానికి లంకానగర అధిష్థాన దేవత అడ్డువచ్చింది.
ఆమెను గెలవటం విశుద్ధి చక్రాన్నతిక్రమించడం.

6. ఆజ్ఞా చక్రం:
మండోదరిని చూచి సీతయే అని పరమానందం పొందాడు.
కానీ లక్షణాలనిబట్టీ, వివేచనచేతనూ ఆమె సీత కాదనుకొన్నాడు.
ఆజ్ఞా చక్రాన్ని చేరిన కుండలిని, అదే గమ్యమనుకొని ఆనందపడి, మరల విచక్షణా జ్ఞానంచే, గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉందని గ్రహించడం ఆజ్ఞా చక్రాన్ని దాటటం.

7. సహస్రార చక్రం:
అశోకవనంలో సీతాదేవిని చూచి, ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం.
ఆరు చక్రాలనీ జయించుకొని వచ్చిన సిద్ధపురుషునికి సహస్రార చక్రాంతర్గత బిందురూపిణి అయిన శ్రీ భువనేశ్వరీ దర్శనమైనదని అర్థం.

చివరకు సీతారాములను తిరిగి కలిపి అయోధ్య చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుజ్యం గోచరిస్తుంది.
Śrī Rāma Karṇāmṛtam
Dvitīyāśvāsam​
Ślōka 7


digambaram kinkiņimekhalōjvalam
lalāṭa paryanta vilambitālakam|
kaladvacaskam kamanīyanūpura
dvayam śiśum rāmamaham namāmi||

rough translation:

I pray and prostrate to the child sri rama, who is omniscient, who is wearing a shining waist band decorated with small tinkling bells, whose forehead is covered with curly locks of hair, who is uttering sweet nectar like words, who is adorned with beautiful anklets and who gives happiness to his parents.

*శ్రీరామకర్ణామృతము*

*ద్వితీయాశ్వాసము*

శ్లోకం *7*


*దిగంబరం కింకిణిమేఖలోజ్వలం*
*లలాట పర్యంతవిలంబితాలకమ్*
*కలద్వచస్కం కమనీయనూపుర*
*ద్వయం శిశుం రామమహం నమామి*

Meaning

దిగంబరుడు, మువ్వలుగల మొలనూలు గలవాడు, నుదుట ముంగురులు కలవాడు, మథురమైన వాక్కులు గలవాడు, సొగసైన అందెలు కలిగిన బాలరామునకు నమస్కరించుచున్నాను.
Jai Hanuman

Please do everyday 11 times hanuman chalisa and one page of Jai Srirama likitha japa .

For any difficulty
108 times hanuman chalisa with 11 times Srirama Raksha Stotram . After every 9 sets of Hanuman Chalisa one set of Srirama Raksha stotram .

For Health
108 times Hanuman Chalisa with 11 times Aditya Hridyam . After every 9 sets of Hanuman Chalisa one set of Aditya Hridayam.


Encourage family and friends to be a part of Srirama Koti Chalisa Koti .

Submit counts at dallashanuman.org

Join every Saturday and Sunday between 1700 and 1830 Hanuman chalisa parayana at karya siddhi hanuman temple , frisco

Jai Hanuman .
ॐ
5. హనుమంతుడు - కార్యదీక్ష

సముద్రం దాటటం - సీతాన్వేషణ అనే కార్యం హనుమపై పడింది. దానికి సంబంధించి కనీస సమాచారమేదీ ఆయనకి అందజేయబడలేదు.
ఆ ప్రయత్నంలో ప్రలోభాలూ, ప్రమాదాలూ ఎదురవుతూ వచ్చాయి. కానీ వాటన్నిటినీ హనుమ అధిగమిస్తూ, అప్పటికప్పుడు ఎదుర్కొన్న తీరూ - ముందుకు సాగిన పద్ధతులూ, ఆయన ఏకాగ్రతకూ కార్యదీక్షకూ అద్దం పడుతాయి.
అందులో కొన్ని

అ) సముద్ర లంఘనము

(i) ప్రలోభం:
మైనాకునిపై విశ్రమించక సాగిపోవడం.

సముద్రుని కోరికమేరకు మైనాకుడు తనపై విశ్రమించి వెళ్ళమన్నాడు.
మధ్యలో ఆగనని (రామబాణం) ప్రమాణం చేశాననీ, సమయం కూడా మించిపోతోందనీ చెప్పి ముందుకు సాగాడు.

(ii) పరీక్ష:
సురస తన నోటిలోకి ప్రవేశించమని హనుమని పరీక్షించదలచ కోరింది. హనుమ బొటనవ్రేలు పరిమాణంలో అయి, సురస కోరినట్లు నోటిలోకి ప్రవేశించి, ఉపాయంతో బయటకు వచ్చాడు.

(iii) అకస్మాత్ హింస:
నీడను బట్టీలాగే సింహికను మర్మావయవాలు ఛేదించి సంహరించాడు.


ఆ) ప్రవేశ ప్రయత్నం:
లంకాధిదేవత అడ్డగించింది. ఆమెను ఎదుర్కొని, ఆమె అనుమతితో లంకలోనికి ప్రవేశించాడు.

ఇ) నిగ్రహం:
అంతఃపురంలో స్త్రీలను చూడడమే ధర్మలోపం అనీ, అయినా తన మనస్సు ఎట్టి వికారాలకూ లోనవలేదనీ తలచుకున్నాడు. తప్పిపోయిన స్త్రీని స్త్రీల మధ్యలోనే కదా వెదకవలెననే సూత్రంతో వెదికాడు.

ఈ) ఉత్సాహము:
సీతాన్వేషణలో ఫలితము కనబడనప్పుడు నిరాశ ఆవహించినా, "ఉత్సాహమే సంపదకు మూలమని" జ్ఞప్తికి తెచ్చుకొని, ప్రార్థన చేసి, సీతాదర్శనాన్ని పొందగలిగాడు. .

ఉ) సంభాషణ ప్రణాళిక:
సీతాదేవితో మాట్లాడడానికి వివిధ విశ్లేషణలు చేసి, ఆమెకు రామకథాగానం వినిపించి, పనులు చక్కబెట్టాడు.

ఊ) రాక్షసులను రప్పించి దాడి:
అశోకవనం ధ్వంసంచేసి, పర్యవసానంగా పంపబడ్డ కింకరులు, జంబుమాలి మొదలగు రాక్షసులతో తలపడి సంహరించాడు.

ఋ) జయఘోష, హెచ్చరిక:
కింకరులు వచ్చినపుడు జయఘోష చేశాడు. అనంతరం వారిని సంహరించాడు. లంకలో అందరికీ "ఇక్ష్వాకు వంశీయులతో వైరం వల్ల లంకగానీ, లంకలోనివారుగానీ, రావణుడుగానీ ఉండబోరు" అని హెచ్చరిక చేశాడు.

ఋూ) సహనం - కార్యాలోచన:
ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి చేష్టలుడిగినా, తేరుకుని, అస్త్రం విడిపోయినా, బంధింపబడి, హింస సహించాడు. తద్వారా రావణ సభకు చేరుకో గలిగాడు.

ఌ) ఉపదేశం:
రావణునికి ధైర్యంగా వాస్తవం తెలుపుతూ, సరియైన సలహా ఇచ్చాడు.

ౡ) వచ్చిన అవకాశం - మెఱుపుదాడి:
(Surgical Strike)

తోకను అంటిస్తే, వివిధ కోణాలలో ఆలోచించి, త్రిజట కలలో చెప్పిన "వానరుడు లంకను తగులబెడుతున్న" విషయం జ్ఞప్తికి వచ్చిందేమో అన్నట్లు, లంకా దహనం కావించాడు.


ఎ) సమయపాలన:
సీతాదేవి విశ్రమించివెళ్ళమని అన్నా, తిరుగు ప్రయాణమయ్యాడు.

ఏ) నివేదిక:
తిరిగి వచ్చిన హనుమ వానరులతో "చూచాను సీతను" అంటూ, సుదీర్ఘంగా విషయాలు తెలిపాడు.
శ్రీరామునితో మాత్రం, తన గొప్ప చెప్పుకోక, తెలుపవలసిన ముఖ్యవిషయాలు తెలియజేశాడు.

కార్యాచరణ

హనుమంతుడు
ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏఏవిధంగా ప్రవర్తించాలో పూర్తిగా క్షణాలలోనే సరియైన నిర్ణయం తీసుకుని, కార్యాచరణ చేయగలిగిన అత్యంత సమర్థుడైన కార్య నిర్వాహకుడు.
మనం ఆయన్ని స్మరిస్తేచాలు. అవన్నీ మనకీ లభింపజేస్తాడు.

బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా I
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్ ॥
6. హనుమంతుడు - పరమాత్మకి మెచ్చిన దూత

హనుమ సీతాదర్శనానంతరం విషయాలను శ్రీరామునికి నివేదించిన తరువాత,దూతలు మూడు తరగతులని శ్రీరాముడు పేర్కొన్నాడు.
(యుద్ధకాండ - 1వ సర్గ)

(i) ఉత్తమ దూత:
స్వామి శ్రేయస్సు దృష్టియందుంచుకొని, చేసికొని రమ్మన్న పనిని మాత్రమే గాక, దానికి అనుబంధంగా స్వామి ధ్యేయాన్ని సాధించే ఇతరపనులను కూడ సర్వాంగ సౌష్ఠవంగా సాధించువాడు ఉత్తమ దూత:
(ii) మధ్యమ దూత
చేసికొని రమ్మన్నపని తూ.చ. తప్పకుండా అంతమటుకే చేసికొని వచ్చువాడు మధ్యమదూత.
(iii) అథమదూత:
చేసుకొని రమ్మన్నపనిని పాడుచేసి వచ్చువాడు అథమదూత.

ఉత్తమ దూతయైన హనుమ దౌత్యము నెరిపిన సందర్భములు నాలుగు. అవి

అ) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము.
ఆ) రాముని దూతగ సీతకు సందేశమందించడం.
ఇ) సుగ్రీవుని దూతగ రావణునితో ముచ్చటించుట.
ఉ) రాముని దూతగ భరతునితో సమావేశము.

అ) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము:
రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. హనుమ భయాన్ని వీడమన్నాడు. అప్పుడు ఆ రామలక్ష్మణుల వివరాలను తెలుసుకొని రమ్మని హనుమంతునే పంపాడు సుగ్రీవుడు.
రామలక్ష్మణులు సుగ్రీవుని మైత్రికై ప్రయత్నిస్తున్న విషయం పసిగట్టి హనుమ, కపిరాజ్యాన్ని సుగ్రీవునకు సంపాదించిపెట్టే పథకము రూపొందించుకొన్నాడు.
చూచి రమ్మన్నదానికన్న చాల ముందుకుపోయి ఆ ధ్యేయ సాధనకు రాచబాట పరిచాడు.

ఆ) రాముని దూతగ సీతకు సందేశం:
సీత జీవించియున్నదో లేదో చూచిరమ్మని పంపిన వేరెవరైనా, చూచిన వెంటనే వెనుదిరిగి పోయి ఉండెడివాడు. లేదా ఆ సంతోషంలో ఆమె ముందు దూకి కార్యము చెడగొట్టేవాడు కావచ్చు.
కానీ హనుమ అన్ని విషయాలనీ తర్కించుకొని, సీతకు రాముని సందేశమూ, అంగుళీయకమూ అందించాడు. సీత నుంచీ కబురూ చూడామణీ తీసుకుని, తిరిగి రాముని వద్దకు వెళ్ళాడు.

ఇ) సుగ్రీవుని దూతగ రావణునితో:
రావణునితో దౌత్యము నెరపమని హనుమకెవ్వరూ చెప్పలేదు.
అయినా వానర బలపరాక్రమాలు రావణునకు తెలిపి, రాక్షసులలో మనోధైర్యాలు శిథిలపరచుట తన స్వామి కార్యమునకు అనుకూలములని ఆలోచించి నిర్ణయించుకున్నాడు.

ఈ సందర్భంలో సముద్రందాటి తిరిగి వచ్చిన కార్యసాధకుడైన హనుమను రాముడు "హనుమ ఒనర్చిన ఘనకార్యములు లోకములోనే
అత్యద్భుతములైనవి,
ఊహకందనివి,
అనితరసాధ్యమైనవి" అని ప్రశంసించాడు.
ఆ సందర్భంలో హనుమకు తాను తన గాఢాలింగన సౌఖ్యాన్ని మాత్రమే ఇయ్యగలనని తెలిపాడు. అదియే హనుమకు పరమ సుఖానుభవములను కల్గించగలదని పేర్కొన్నాడు. అప్పటికి తానీయగలిగిన సర్వస్వము అదియే అన్నాడు.
పులకితగాత్రుడై, తాను అప్పగించిన కార్యమును సఫలమొనర్చిన హనుమని తన హృదయానికి హత్తుకొన్నాడు.

ఈ) రాముని దూతగ భరతునితో సమావేశము:
14 సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తిచేసుకున్నాడు రాముడు. తెల్లవారి అయోధ్యకు చేరకపోతే, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు.
హనుమకు రాముడు సంగతి తెలిపి, భరతుని వద్దకు పంపాడు. తనరాక భరతునకు ఆనందమైతే సరే. అట్లుకాక భరతునికి రాజ్యకాంక్ష ఉన్నట్లనిపిస్తే, హనుమను వెంటనే తిరిగి తన వద్దకు వచ్చివేయమన్నాడు.
భరతుని అభిప్రాయమెరుగుట తేలికగాదు. హనుమ పూర్వము నడిపిన దౌత్యములు రామునకు ప్రీతికల్గించాయి. అట్లే హనుమ రామునికి సరియైనదౌత్యాన్ని భరతునితో నడిపాడు.

ఈ విధంగా హనుమ సుగ్రీవునికీ శ్రీరామచంద్రునికీ అత్యంత ప్రీతిపాత్రుడైన ఉత్తమ దూత.