7. హనుమ - చేసిన ప్రార్థనలు
అ) సముద్ర లంఘనానికి ముందు.
హనుమ సూర్యునికి, మహేంద్రునికి, వాయుదేవునికి, బ్రహ్మకు, పంచభూతాలకీ నమస్కరించి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన తండ్రియైన వాయుదేవునికి మరల నమస్కరించి, దక్షిణ దిక్కుకు పోవు ఉద్దేశంతో తన శరీరాన్ని పెంచాడు.
స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే I
భూతేభ్య శ్చాంజలిం కృత్వా చకార గమనే మతిమ్ ॥
అంజలిం ప్రాఙ్ముఖః కుర్వన్ పవనా యాత్మయోనియేI
తతోఽభివవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్ ॥
( - సుందరకాండ 1/8,9 )
సరియైన
- బుద్ధికై సూర్యుని,
- ఇంద్రియాలకై ఇంద్రుని,
- ప్రాణాది వాయువులకై వాయుదేవుని,
- ఆలోచనా సృష్టికై సృష్టకర్త అయిన బ్రహ్మకీ,
- పాంచభౌతికమైన దేహమూ, ప్ర పంచానికీ సంబంధించి పంచభూతాలకీ అంజలి ఘటించాడు.
వాయుదేవుడైన తండ్రికి మరొకసారి ప్రార్థన.
సూర్యుడు తాపంలేకుండా చూడడమే కాక, బుద్ధి సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకునే టట్లు అనుగ్రహించాడు. ఇతర దేవతలు కూడా వారివారి స్థానాలకి సంబంధించి అనుగ్రహించారు.
ఆ) సీతాదర్శనం కాక విచారిస్తున్నప్పుడు
లక్ష్మణునితో గూడిన రామునకు నమస్కారము.
జనక సుతయైన సీతకు నమస్కారము.
రుద్ర - ఇంద్ర - యమ - వాయువులకు నమస్కారము.
చంద్ర - సూర్య - మరుద్గణములకు కూడా నమస్కారము.
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై,
నమోఽస్తు I రుద్రేంద్రయమానిలేభ్యో
నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ॥
( - సుందరకాండ 13/59 )
ఋషిగణములతో పాటు దేవతలు గూడ నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక!
బ్రహ్మయు, దేవతలు, అగ్నియు, వాయువు, వజ్రపాణియైన ఇంద్రుడునీ నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక!
పాశహస్తుడైన వరుణుడును, చంద్రసూర్యులును, అశ్వనీ దేవతలును, శివుడును నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక!
సర్వభూతములును, భూతముల కధిపతియైన మహావిష్ణువును, దారిలో కనిపించెడి - కనిపించని భూతములన్నియు నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురు గాక!
సిద్ధిం మే సంవిధాస్యంతి దేవా స్సర్షిగణా స్త్విహ ॥
బ్రహ్మా స్వయంభూ ర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే I
సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ ॥
వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చI
అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శ్శర్వ ఏవ చ ॥
సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః I దాస్యంతి మమ యే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః ॥
( - సుందరకాండ 13/64 నుండి 67 వరకు )
సీతారామలక్ష్మణులకూ ముఖ్య దేవతలకూ నమస్కరించాడు.
అందఱికీ ప్రభువుతో కూడిన పరివార దేవతలతో సహా అందఱూ తన ప్రయత్నం సఫలీకృతం చేయడంలో అనుగ్రహించవలసినదని ప్రార్థించాడు.
ఆ ప్రయత్నంలో సఫలుడై, సీతా దర్శనం పొందగలిగాడు.
మనం హనుమను ప్రార్థిస్తే,
ఎప్పుడెప్పుడేదేది కావాలో అప్పుడప్పుడు అదే అదే,
ఎక్కడెక్కడ ఏదేది కావాలో అక్కడక్కడ అదే అదే,
ఎంతెంత అవుసరమో అంతంతే,
ఎలాఎలా మనకి అవుసరమో అలాఅలా అనుగ్రహిస్తాడు.
మనకి ఏది హితమో అదే ఇస్తూ, తానే స్వయంగా సర్వమూ చూసుకుంటాడు.
బుద్ధిర్బలం యశో ధైర్యం అరోగతా I
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా భవేత్ ॥
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్ జై జై హనుమాన్

శ్రీరాముని అనుగ్రహానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా ?
ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందపడుతున్న ఆ పెద్దాయన పేరు జగర్లపూడి లక్ష్మీనారాయణ గారు.గొప్ప రామభక్తులు, సంగీతాభిమాని. ఉండేది హైదరాబాద్ లో.ఆయన కోరిక ప్రకారం,ఆయన కూతురు శ్రీమతి ప్రసన్నలక్ష్మి,ఆయనను సద్గురు శ్రీత్యాగరాజస్వామివారి ఊరు తిరువైయారు తీసుకు వెళ్ళారు.
ఆరోజు శివరాత్రి పర్వదినం.అక్కడ,కావేరీ తీరంలోని త్యాగయ్యగారి సమాధి దగ్గర,శివరాత్రి రోజు ఇరవైనాలుగు గంటలపాటు విద్వాంసులంతా చేరి,త్యాగరాజ కీర్తనలను(పాడిన కీర్తన పాడకుండా) పాడటం ప్రతియేడూ ఆనవాయితీ.త్యాగయ్యగారి ఎన్నో అపురూప రచనలు గానంచేశారు గాయక బృందం.ఆరోజు ఆ కార్యక్రమాన్ని శ్రవణం చేసి,తదుపరి మదురై చేరుకొని,అక్కడ మీనాక్షమ్మను దర్శించుకొన్నారు.త్యాగయ్యగారి తంబురా,పాదుకలు ఆ ఊరిలోని సౌరాష్ట్ర కాలనీలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉన్నాయని విని,అక్కడికి వెళ్ళారు.
అక్కడ అంతా గుజరాతీ వారే...త్యాగయ్యగారి తంబురా, వారి ప్రధాన శిష్యులైన వాలాజీపేట వేంకటరమణ భాగవతార్ గారికి సంప్రాప్తించింది.సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన వాలాజీపేటవారి కుటుంబం,ఔరంగజేబు కాలంలో,తమిళనాట మదురైకి వలస వచ్చింది.అందుచేత,మదురైలోని సౌరాష్ట్ర భవన్లో త్యాగయ్యగారి తంబురా,వాలాజీపేట వేంకటరమణ భాగవతులుగారి తంబురాలను ఒక అద్దాల బీరువాలో ప్రస్తుతం భద్రపరచారు.ఎవరైనా వస్తే, వాటిని మ్యూజియంలోని అపురూప వస్తువులుగా దర్శించవలసిందే..అలాగే జగర్లపూడివారి కుటుంబమూ వాటిని దర్శించారు.
అయితే..ఆ తంబురాను ఒక్కసారి తాకే అదృష్టం కలిగితే బాగుండునని ఎంతో ఆశపడ్డారు లక్ష్మీనారాయణగారు.కనులు మూసుకొని,త్యాగయ్యగారిని తలచుకొని,మనసులోనే తన కోరిక విన్నవించుకున్నారు.
ఇంతలో ఒక వయోవృద్ధులు అక్కడికి వచ్చి,లక్ష్మీనారాయణగారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఒక్క క్షణమాగి,'మీరు ఆ తంబురా చూస్తారా?' అంటూ తమిళంలో ప్రశ్నించి, అక్కడివారితో చెప్పి,తాళంచెవులు తెప్పించారు.తానే స్వయంగా బీరువా తాళాలు తీసి,త్యాగయ్యగారి తంబురాను చేతికిచ్చారు.
అంతా స్వప్నంలా కనబడింది లక్ష్మీనారాయణగారి కుటుంబానికి!... వెంటనే ఆనందంగా చేతిలోకి తంబురాను తీసుకొని,కళ్లకద్దుకొన్నారు.'ఎవరూ వినని వేలాది కృతులను సైతం త్యాగయ్యగారి నోట అతి దగ్గరగా విన్న ఆ తంబురా ఎంత పుణ్యం చేసుకుంది?...అది చేతిలో తీసుకోవటానికి నేనెంత పుణ్యంచేసుకున్నానో!'...తన జన్మ ధన్యమైనదని భావించారు లక్ష్మీనారాయణ గారు.
ప్రతిరోజూ ఆ రెండు తంబురాలకూ హారతి ఇస్తారు అక్కడివారు!
త్యాగయ్యగారు వ్రాసిన గేయనాటకాలు,ఇంకా అనేక వ్రాతప్రతులూ అక్కడ 'సౌరాష్ట్ర భవన్'లో రహస్యంగా భద్రపరచబడి ఉన్నాయని విన్న లక్ష్మీనారాయణగారికి, అవి మాత్రం చూపడానికి వారు నిరాకరించారు.'అవి ఇక్కడ లేవ'ని సమాధానం చెప్పారు.
త్యాగయ్యగారి పాదుకలను దర్శించి,నమస్కరించుకొన్నారు జగర్లపూడివారి కుటుంబం.
ఆ తరువాత తంబుర ఇచ్చిన వయోవృధ్ధుని కోసం ఎంతవెదకినా మరల దర్శనం కలుగలేదు....
మరి ఆ వచ్చిన వారు ఎవరైయ్యుంటారు ?
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తతుల్యం
శ్రీ రామ నామ వరాననే
జై శ్రీరామ్

8. హనుమంతుడు - పరిపాలకుల శక్తి అంచనా
హనుమంతుడు సీతాన్వేషణకై దక్షిణదిక్కుకు పయనమైన బృంద నాయకుడు అంగదుని సామర్ధ్యాన్ని గుర్తించి, సక్రమ మార్గానికై హెచ్చరిక చేశాడు.
"వాలి కుమారుడైన అంగదునిలో అష్టాంగములు (బుద్ధికి సంబంధించిన గుణములు), నాలుగు బలములు, పదునాలుగు విశిష్ట గుణములు కలవని హనుమంతుడు గుర్తించాడు"
"బుద్ధ్యా హ్యష్టాంగయా యుక్తం చతుర్బల సమన్వితం I
చతుర్దశగుణం మేనే హనుమాన్ వాలినః సుతమ్" ॥
కిష్కింధాకాండ 54/2
బుద్ధికి సంబంధించిన ఎనిమిది గుణాలు
( Eight attributes of intellegence )
(i) వినవలెననే కోరిక,
(ii) వినడం,
(iii) విన్న విషయాన్ని గ్రహించడం,
(iv) గ్రహించినదాన్ని మనసున నిలపటం,
(v) ఊహించడం,
(vi) సంశయ నివృత్తి,
(vii) అర్థాన్ని చక్కగా గ్రహించడం,
(viii) తత్త్వజ్ఞానాన్ని ఎఱుగడం.
" గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం I
ఊహోఽపోహోఽర్థ విజ్ఞానం తత్త్వజ్ఞానంచ ధీగుణాః "
నాలుగు బలములు
సామ,
దాన,
భేద,
దండోపాయాలు
(ఇవి శత్రువును లొంగదీసుకోడానికి తగిన ఉపాయాలు)
మరియు
బాహుబలము,
మనోబలము,
ఉపాయబలము,
బంధుబలము.
రాజుకు ఉండవలసిన పదునాలుగు విశిష్ట లక్షణాలు
( Fourteen excellences that characterize great personalities )
(i) దేశకాల జ్ఞానము,
(ii) దృఢత్వము,
(iii) అన్నివిధములైన క్లేశములను సహింపగల శక్తి,
(iv) వివిధ విషయములయందు పరిజ్ఞానము,
(v) సామర్థ్యము,
(vi) ఉత్సాహము లేక బలము,
(vii) మంత్రాలోచనలు గోప్యంగా ఉంచడం,
(viii) పరస్పర విరోధములైన మాటలు పలుకకుండటం,
(ix) శౌర్యము,
(x) తనబలాన్నీ శత్రుబలాన్నీ ఎఱిగియుండడం,
(xi) కృతజ్ఞత,
(xii) శరణాగత వాత్సల్యము,
(xiii) తగిన సమయమున కోపాన్ని ప్రకటించడం,
(xiv) స్థిరత్వాన్ని కలిగియుండడం.
" దేశకాలజ్ఞతా, దార్ఢ్యం, సర్వక్లేశ సహిష్ణుతా, సర్వవిజ్ఞానితా, దాక్ష్యమ్, ఊర్జః, సంవృతమంత్రతా I
అవిసంవాదితా, శౌర్యం, శక్తిజ్ఞత్వం, కృతజ్ఞతా, శరణాగతవాత్సల్యమ్,అమర్షిత్వమ్, అచాపలమ్ ॥ "

ॐ విధి - దైవ నిర్ణయం
శ్రీరాముడు కైకేయి వరాలు విని, వనాలకు వెళ్ళవద్దన్న లక్ష్మణునితో అన్న మాటలు ప్రతి ఒక్కరూ గుర్తించవలసినవి. అవి
"విధివిలాసము ఊహించుటకు అలవికానిది. అది మానవులకే కాదు, దేవతలకును నివారింపశక్యము కానిది.
ఆ విధి వైపరీత్యమే నాపైననూ, ఆమె (కైకేయి) మీదనూ పడినదనడం యుక్తము. తత్ప్రభావాన కైకేయి బుద్ధి మాఱిపోయినది (నా చేతికి చిక్కిన రాజ్యాధికారము జాఱిపోయినది).
*ఓ లక్ష్మణా! విధినిర్ణయం ప్రకారం కర్మఫలాన్ని అనుభవించడంతప్ప ఆ విధిని (దైవాన్ని) నిగ్రహించే ఉపాయం ఏదీ లేదు. కనుక దైవాన్ని ఎదుర్కోవడానికి ఖఎవరు సాహసిస్తారు?*
*సమస్తప్రాణులకు కలిగెడి*
*- సుఖదుఃఖములకూ,*
*- శాంతిక్షోభాలకూ,*
*- లాభనష్టాలకూ,*
*- ఉత్పత్తి వినాశములకూ (జననమరణాలకీ)*
*కారణాలు ఊహింపజాలము.*
*ఇవన్నీ విధినిర్ణయాలే!*
తీవ్రంగా తపమొనరించే ఋషులుసైతం దైవోపహతులై, కామక్రోధాలకు లోనై, తమ కఠోరనియమాలకు తిలోదకాలిచ్చి భ్రష్టులౌతారు.
*ప్రయత్నపూర్వకంగా ఆరంభించిన కార్యాలు ఆగిపోవడం,*
*అనుకోని విధంగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించడం - ఇవన్నీ దైవనిర్ణయ ఫలితాలే కదా!*
ఈ విధమగు తాత్త్వికదృష్టితో నా అంతఃకరణమును (మనస్సును) నేను నిగ్రహించుకొనడం వలన నా పట్టాభిషేకం ఆగిపోయినా, నాకెట్టి పరితాపమూ కలగడంలేదు. అందువలన నీవు కూడా నావలెనే పరితాపము త్యజించు- పట్టాభిషేకానికి సంబంధించిన ప్రక్రియనంతా వెంటనే నిలిపివేయి. "
That which cannot be foreseen is surely a decree of Providence and it cannot be set aside by any among created beings.
Evidently, therefore, it is by the will of Providence that the unexpected has befallen me as well as her (Kaikeyi).
*Again, what man can dare contend, O son of Sumitra, with destiny, of which no indication can be found other than the consequence of an act?*
*Joy and sorrow,*
*Fear and anger,*
*Gain and loss,*
*Birth and death*
*and whatever similar experience comes to a particular individual, that is unquestionably the work of Providence.*
Strongly impelled by destiny, even sages practising severe austerities are led astray by concupiscence and anger etc., abandoning their strict observance.
*Setting aside an undertaking already commenced with the help of requisite mateials, that which takes place unexpectedly without any ostensible cause is undoubtedly the doing of Providence.*
In spite of my intallation having been interrupted no agony is experienced by me, who have fully steadied my mind of myself by recourse to this true wisdom.
Therefore, rid of agony and following my line of thought, cause you the proceedings of installation to be stopped at once.
యదచింత్యం తు తద్దైవం భూతేష్వపి న హన్యతే I
వ్యక్తం మయి చ తస్యాం చ పతితో హి విపర్యయః ॥
*కశ్చ దైవేన సౌమిత్రే! యోద్ధుముత్సహతే పుమాన్ I*
*యస్య న గ్రహణం కించిత్ కర్మణోఽన్యత్ర దృశ్యతే ॥*
*సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ I*
*యచ్చ కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ ॥*
ఋషయోఽప్యుగ్రతపసో దైవేనాభి ప్రపీడీతాః I
ఉత్సృజ్య నియమాంస్తీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభిః ॥
*అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే I*
*నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్ ॥*
ఏతయా తత్త్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా I
వ్యాహతేఽప్యభిషేకే మే పరితాపో న విద్యతే ॥
తస్మాతపరితాపః సన్ త్వమప్యనువిధాయ మామ్ I
ప్రతిసంహారయ క్షిప్రమ్ ఆభిషేచనికీం క్రియామ్ ॥
- అయోధ్యాకాండ 22/20 - 26

Jai Srirama
Please submit your online counts of likitha and hanuman chalisa parayana at dallas hanuman.org .
Please send all likitha papers by July 7 th to :
Radhika Kodela , 14615 begonia drive, Frisco, Texas 75035. USA including outstation devotees .
We will be binding them and submit to HH Shri Swamiji as part of guru purnima.
Jai Hanuman

*పోతనామాత్యుడి పద్యాలు*
పోతన మహాభాగవత దశమస్కందాన్ని ముగిస్తూ శ్రీరాముణ్ణి స్థుతిస్తూ చెప్పిన పద్యాలివి:
*చ: సరసిజ పత్ర నేత్ర! రఘుసత్తమ! దుష్టమదాసురేంద్ర సం*
*హరణ! దయాపయోధి! జనకాత్మ భవాన పద్మ మిత్ర! భా*
*స్కర కుల వార్ధి చంద్ర! మిహికావసుధారసూతి సన్నుత*
*స్పురిత చరిత్ర! భక్త జన పోషణ భూషణ! పాపశోషణా!*(1338)
*క: మారీచ భూరిమాయా, నీరంద్ర్ర మహాంధకార నీరేజహితా!*
*క్ష్మా రమణ వినుత పాదం, భోరుహ మహితావతార! పుణ్యవిచారా!*
(1339)
*భావాలు* రఘువంశోత్తముడవైన శ్రీరామా! నీవు తామరరేకులవంటి అందమైన
కళ్ళు కలవాడవు ~ గర్వితులు, దుష్టులు అయిన రాక్షసప్రముఖులను సంహరించిన వాడవు! కృపానిధివి! సీతాదేవి యొక్క ముఖమనెడి పద్మానికి సూర్యుని వంటి వాడవు! సూర్యవంశమనెడి సముద్రానికి చంద్రునివంటి వాడవు!
పర్వతరాజైన హిమవంతుని కూతురగు పార్వతిచే నుతింపబడిన దివ్యచరిత్ర ఉన్న వాడవు! భక్తులను ఆదుకొనుటలో మేటి అయినవాడవు! పాపాలను రూపుమాపెడివాడవు! మారీచుని మాయలను వమ్మొనర్చిన వాడవు! మహారాజులచే ప్రస్తుతింపబడిన పాదపద్మములు కలవాడవు! పుణ్యపురుషా! నీవు లోకకల్యాణార్థమై భూతలమున అవతరించిన మహాత్ముడవు!
*శరధి మద విరామా! సర్వలోకాభిరామా!*
*సురరిపు విషభీమా! సుందరీ లోక కామా!*
*ధరణి వర లలామా! తాపసస్థోత్రసీమా!*
*సురుచిర గుణ ధామా! సుర్యవంశాబ్ధి సోమా!*(1340)
*భావము*
రఘురామా! నీవు సూర్యవంశమునకు వన్నెతెచ్చిన మహానుభావుడవు! సముద్రుని గర్వాన్ని అణచిన ప్రతిభామూర్తివి! సకలలోకాలవారికీ ఆహ్లాదకరుడవు! రాక్షసులనెడి విషాన్ని మ్రింగేసిన (అంతరింపజేసిన) శంకరుడవు!
సుందరీమణులకు మన్మధుని వంటి వాడవు! అనంత కల్యాణ గుణాలకు ఆలవాలమైన వాడవు! పురుషోత్తమా! పరమపురుషా! నిన్ను ఎంతని కొనియాడగల

ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో,
పురాణాల లోనే కాకుండా నిత్యజీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం...
రాముడు దండకారణ్యం లో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి, కారణం ,
ఒక మహాపతివ్రత శాపం !
దేవాసుర సంగ్రామం సమయంలో,
మృతసంజీవనీ మంత్ర బలంతో చావు లేకుండా, ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను
తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు,,
అప్పుడు, తనను శరణు వేడిన రాక్షసులను
తన ఆశ్రమంలో దాచి , వారినీ చంపకుండా
తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఆ ఋషి పత్ని !
మహావిష్ణువు విధి లేక, ఆమెను కూడా
రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు !,
ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త,
మహా తపోధనుడు, హతురాలై పడి ఉన్న
భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపిస్తాడు
ఆ సాధ్వీమని భర్త ,!,
తన భార్యను హతమార్చి,
తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్యావియోగముతో బాధపడాలి అని !
అందుకే రాముని వనవాసానికి కైక, లేదా మందర , లేదా దశరథుడు కారణం కాదనీ,
వారు నిమిత్త మాత్రులని తెలుస్తోంది.!
అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే !..
అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి,
రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు
చోటు చేసుకున్న సందర్భమున,,,
తీరా కైకమ్మ వరాల విషయంగా,
వనవాసం చేయడానికి, వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు,,
"ఈ ముసలి తండ్రిని చంపి,,
రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని !" అంటాడు , అప్పుడు రాముడు తమ్మునితో ,,
"నాయనా,! నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రీ గారు,,
నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు, ఇప్పుడు మౌనంగా ఉండటం,
అది ఆయన తప్పు కాదు,!
అతి బలీయం విధివిధానం!
అది ఎంత బలవత్తరం గా ఉంటుందో తెలుసుకో.! పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు,
ఈ ప్రారబ్దకర్మ ను తప్పించడం ఎవరి తరమూ కాదు! అందుచేత, కోపాన్ని తగ్గించుకొని,,
నేను. తండ్రీ గారి ఆజ్ఞను పాలించెందుకు నీవు
నాకు సహకరించు లక్ష్మణా !"అంటాడు ,
భగవద్గీత లో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే ! కష్టాల్లో కృంగిపోవడం,
సుఖాల్లో పొంగిపోవడం కాకుండా,
వాటిని దైవానుగ్రహంగా భావించడం ,
తన కర్మానుభవంగా గుర్తించడం, భావ్యం !
అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి,!
భగవద్గీత లోని 18వ అధ్యాయం 61వ శ్లోకంలో
ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ,
జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను !!"
అని గీతాచార్యుడు శ్రీకృష్ణభగవానుడు , చెప్పినట్టుగా,
సీతారాముల కష్టాలకు కారణం వారి
పూర్వజన్మల కర్మలే.
కాని మరెవరో కారకులు కాదు !! .
వారే కాదు , భూమిపై జన్మించిన ఏ ప్రాణీ కూడా కర్మలకు అతీతుడు కాడు.!
దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు.!.
మనం కర్మలు చేయవలసిందే! ,
ఆ కర్మల ఫలితం, సుఖమైనా, కష్టమైనా,
ఇష్టమున్నా లేకున్నా,
రాముడైనా, కృష్ణుడైనా అనుభవించ వలసినదే !!
వాలిని చెట్టు చాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి ,
కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో
ఒక వేటగాడి చేతిలో చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వస్తుంది !
అలా కృష్ణావతారం సుసంపన్నం అయ్యింది.!.
మరో దృష్టాంతము. !!
ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయంతో బాటు తమ కళ్ళ ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ,కృపాచార్యులు కూడా , జరిగిన పాపాన్ని పంచుకొక తప్పలేదు,,
భారత మహారంగంలో మిడతల వలె మాడి పోయారు. !
అలా అన్యాయం చేస్తున్నవారితో బాటు,
సమర్థత ఉండి, జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా, అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా
అంతే పాపాత్ములు,
శిక్షకు పాత్రులు. అవుతున్నారు !
ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా కూడా,
ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి కదా.!
అందుకే రామాయణ భారత భాగవతాలు,
సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు,, వస్తాయి అని !
సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించినప్పుడే కదా !
అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన
రెండు వరాలు ఒకటి జ్ఞానం! రెండు మాట్లాడే ప్రతిభ ! వీటిని తమ తమ జీవితాల్లో సత్ ప్రవర్తన,
సత్ చింతన తో, సద్వినియోగం చేసుకోవాలి! ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి !
ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా !
పరపీడనం పాపాన్ని తాపాన్ని,, కలిగిస్తుంది,,!,
ఏ చరిత్ర వినినా, ఏ జీవితం చూసినా,
అహింసా పరమో ధర్మః !
అనగా నవ్వులాటకైనా ఇతరులను,
ఏ ప్రాణిని హింసించరాదు, !
బాధ పెట్టరాదు.!
ఎందుకంటే ఆశరీరంలో ఉన్నది కూడా పరమాత్ముడే!,
అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ
అన్నీ గమనిస్తూ,, మనలోనే ఉంటూ
మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యం మరవకూడదు..
నీ ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెదకాలి..
అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి
నీ వంతు కృషి, మనసా వాచా కర్మణా,

సహాయం చేస్తూ ఉండాలి ,
ఇదే మానవ ధర్మం,
జీవన గీతం,
సృష్టి రహస్యం కూడా ఇదే !
ఇదే మానవ ధర్మం,
జీవన గీతం,
సృష్టి రహస్యం కూడా ఇదే !
Jai Srirama
Please submit your online counts of likitha and hanuman chalisa parayana at dallas hanuman.org .
Please send all likitha papers by July 10 th to :
The front desk , Karya Siddhi Hanuman temple , 12030 Independence parkway building B, frisco , TX .
We will be binding them and submit to HH Shri Swamiji as part of guru purnima.
Jai Hanuman
Hurry !! Last two days left

Jaisrirama
Since today is tholi ekadasi and followed by ashada dwadasi the day of vamanavatara plus ashada sukravara those of you who want to write and recite , you are most welcome .
Please submit likitha papers ASAP at front desk at karya siddhi hanuman temple .

Forwarded from Nagendra Bandaru -Frisco , TX
Jai srirama
We received over 3 million plus 30 lacs likitha count , we are getting a more late submissions . The last call is 12 pm today for submission at ksht ,frisco , TX . Please submit your counts online at dallashanuman.org .
Please continue chanting and writing . We will do this forever .
The next step we are applying balding to every paper before it turns into a bound volume

3 million + likitha papers and counting (30 lacs plus)
100,000 + hanuman chalisa paryana and counting