VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Transfer Guidelines 2025 .pdf
129.6 KB
🔴 *ఉద్యోగుల బదిలీలు మరియు నియామకాలు మార్గదర్శకాలు 2025* #TransferGuidelines2025
🔔 *ఉద్యోగుల బదిలీల సమాచారం :*

➥ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

➥ మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలను చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా, ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

➥ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే స్థానంలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

➥ అదేవిధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి.

➥ అయితే, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

➥ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది 2026 మే 31వ తేదీలోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుంది.

➥ దృష్టి లోపం కలిగిన ఉద్యోగులు కోరుకుంటే, వారి బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు, వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

➥ అంతేకాకుండా, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, వారు కోరిన పక్షంలో బదిలీల్లో ప్రాధాన్యత దక్కుతుంది.

➥ వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వితంతువులైన ఉద్యోగినులు వారి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం పొందుతారు.

➥ భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా వారి బదిలీలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

🔴 *ఉద్యోగుల బదిలీలు మరియు నియామకాలు మార్గదర్శకాలు 2025* #TransferGuidelines2025
👇👇
https://t.me/VolunteerConnection/16994
🔴 *అన్నదాత సుఖీభవ ≈ పేమెంట్ స్టేటస్ లింక్*

👇
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
2025GWS_MS4_E.pdf
62.7 KB
Department of GSWS – Village /Ward Secretariats – Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Grouping of Secretariats - Fixing of Positions to the Specific purpose (Technical) Functionaries based on the category of Village /Ward Secretariats -Orders – Issued.
------------------------------------------------------------
DEPARTMENT OF GRAMA SACHIVALAYAMS AND WARD SACHIVALAYAMS
G.O.MS.No. 4 Dated: 17-05-2025
2025-Transfer guidelines.pdf
128.3 KB
Transfers and postings of Transfers and postings of Employees of State, Zonal & District cadre of posts
2025GWS_36643_MS4_E.pdf
3.7 MB
Annexure - I A-Grouping of Village Secretariats

Annexure - 2 A-Specific Purpose Functionaries in Village Secretariats
🔔 *NIDHI WEBSITE Reminder : DDO పరిధిలోని అందరి ఉద్యోగుల Household Mapping పూర్తయితేనే మే నెల జీతం బిల్లు ఓపెన్ అవుతుంది. లేనిచో ఓపెన్ కాదు*
🚌 *ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిపిస్తున్నట్టు తెలిపిన సీఎం చంద్రబాబు* #WomenFreeBusRide
గ్రామ, వార్డు సచివాలయాల్లో జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ (టెక్ని కల్) ఫంక్షనరీల విభజన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యగా హేతుబద్ధీకరణకు సంబం ధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్ట ర్లకు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వనుంది.
General Transfer 2025 Guidelines.pdf
1010.2 KB
Transfer Guidelines - Land Administration Department
*విద్యాహక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు దరఖాస్తు ఆఖరి తేదీ నేడే!*

▪️ *ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు ఉచితంగా 25% సీట్లు.. ఒకటవ తరగతి నుంచే ఐబీ, సిబిఎస్సి, స్టేట్ సిలబస్ లో చదువుకునే అవకాశం.*

▪️ నేటితో ముగుస్తున్న ఆన్ లైన్ దరఖాస్తు గడువు.
▪️ మే 20 నుంచి 24 వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల పరిశీలన.
▪️ మే 29న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక.
▪️జూన్ 8న విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న పాఠశాలకు అడ్మిషన్ల ఖరారు.
రేపు(20.05.25) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం.. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్.. ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చ.. అన్నదాత సుఖీభవ.. తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్న కేబినెట్ #APCabinet
*✒️- నేడు ఏపీలో అతి భారీ వర్షాలు: IMD*

*ఆంధ్రప్రదేశ్‌లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే వర్షం స్టార్ట్ అయ్యింది. ఉదయం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షం కురుస్తోంది. రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు స్థాయిలో ప్రారంభమై, ఆ తర్వాత భారీ వర్షాలుగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని IMD వెల్లడించింది.*
👩🏼‍🍼 *ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం తిరిగి పునరుద్ధరణ:*

➥ 51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం.

➥ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.

✧ *బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి* ✧

➥ బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది.

➥ ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.
*ఏపీలో ఇక రేషన్ వ్యాన్లు ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేసే విధానం రద్దు : మంత్రి నాదెండ్ల మనోహర్*

ఏపీలో రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని,రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి వివరించారు. జూన్ 1వ తేదీ నుంచి 15 వరకు చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని, 66 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. రాష్టంలో మొత్తం 9,260 వాహనాలను ఉచితంగా ఆయా లబ్దిదారులకు బదలాయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
✅ *Rice card update ≈ రైస్ కార్డు యాడ్డింగ్ కి పెళ్లి ఐన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ మరియు ఫోటో రెండు కూడా అవసరం లేదు. నిన్నటి వరకు ఫోటో మరియు సర్టిఫికెట్ రెండు తప్పనిసరి. నేటి నుంచి మార్పులు వచ్చాయి గమనించగలరు*