VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📅 *నవంబర్ 2025 సెలవుల జాబితా*

🛑 సాధారణ సెలవులు (Regular Holidays):
2️⃣ - 02.11.2025 (ఆదివారం)
8️⃣ - 08.11.2025 (రెండో శనివారం)
9️⃣ - 09.11.2025 (ఆదివారం)
1️⃣6️⃣ - 16.11.2025 (ఆదివారం)
2️⃣3️⃣ - 23.11.2025 (ఆదివారం)
3️⃣0️⃣ - 30.11.2025 (ఆదివారం)

🌙 ఐచ్ఛిక సెలవులు (Optional Holidays):
🪔 05.11.2025 – కార్తీక పౌర్ణమి / గురు నానక్ జయంతి
🕌 06.11.2025 – హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పూర్ మెహ్దీ జయంతి
Dear All.
Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.
🌾 *ఏపీ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ కీలక నిర్ణయాలు (నవంబర్ 2025)*

☛ ధాన్యం కొనుగోలు ప్రారంభం: సోమవారం (నవంబర్ 3, 2025) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

☛ కొనుగోలు లక్ష్యం: 2025-2026 ఖరీఫ్‌లో మొత్తం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

☛ రైతు సేవా కేంద్రాలు: ఏపీవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

☛ కొనుగోలు కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

☛ చెల్లింపు సమయం: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత, కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లోపే ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమచేసేందుకు చర్యలు చేపట్టారు.

☛ రిజిస్ట్రేషన్ వాట్సాప్ నంబర్: రైతులు తమ ధాన్యం వివరాలను నమోదు చేసుకోవడానికి 7337359375 అనే వాట్సాప్‌ నంబర్‌ని ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
💰 *పెన్షన్ తాజా అప్‌డేట్ – నేటితో ముగింపు*

నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజుతో (నవంబర్ 3) ముగుస్తుంది. ఇప్పటికీ పెన్షన్ తీసుకోని వారు, ఈరోజే మీ సచివాలయంలో ఏ ఉద్యోగి వద్దనైనా పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది.

👩‍🦳 *భర్త మరణించిన పింఛన్ కేసులు:*

గత నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, వితంతు ఆధార్ కార్డు, దరఖాస్తుతో మీ గ్రామ / వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి సమర్పించండి. మీ పేరుతో Spouse Pension (వితంతు పెన్షన్) ప్రభుత్వ ఆదేశాల మేరకు మంజూరు అవుతుంది.
💼 *త్వరలో ఇంటర్వ్యూ లు - ఏపీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ — కౌశలం తాజా అప్‌డేట్*

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని సచివాలయాలకు మైక్‌లు మరియు వెబ్‌క్యామ్‌లు పంపిణీ చేసింది.

📢 రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అలర్ట్‌గా ఉండండి. ఇప్పటివరకు 17 లక్షలకుపైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని వారికి నవంబర్ 5 వరకు అవకాశం ఉంది.
⏳ *కౌశలం రిజిస్ట్రేషన్ చివరి తేదీ నవంబర్ 5* ⏳

💼 AP Work From Home (కౌశలం) Jobs
🎓 చదివిన ప్రతి ఒక్కరికీ అర్హత
👩‍💻 ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా అవకాశం

🕒 కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి

👉 వెంటనే Apply చేసుకోండి 👇
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
GSWS Inventory Tracking Portal

https://gswshms.ap.gov.in/
GSWS Employee Mobile App 9.13 Updated to Version
03.11.2025

Improved performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Dear All,

The GSWS Employee App is now compatible with lower Android versions (from Android 10 onwards).

Please check and ensure all pending GSWS surveys are completed at the earliest.
*IMPORTANT Notification* - Downtime of APOnline - SSP & ABDG Web Portals, Mobile APP, Aadhaar Services and Servers due to Planned Data Centre Migration and Scheduled activity

*Down time* : Friday 7th November 2025 at 9:00 PM to till Sunday 9th November 2025 at 9:00 PM.
SERVICE VERIFICATION CERTFICATE.pdf
142 KB
Service Verification Certificate File
📢 ముఖ్యమైన సమాచారం – కౌశలం & e-KYC పనులపై ఆదేశాలు

👨‍💼 గౌరవ డైరెక్టర్ గ్రామ/వార్డు సచివాలయాల ఆదేశాల మేరకు:
ఈరోజుకి కౌశలం పెండింగ్‌ను ZERO చేయవలసిందిగా సూచించారు.

📚 ఎందుకంటే వచ్చేనెల నుండి కౌశలం కార్యక్రమంలో రిజిస్టర్ అయిన వారికి Work From Home Exams నిర్వహించబడతాయి.
అందువల్ల ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ టాస్కులను పూర్తిచేయాలి.

💠 అదేవిధంగా సిటిజన్ e-KYC పనుల్లో కనీసం 50% పూర్తి చేయాలని ఆదేశించారు.

✅ అందరూ తక్షణమే చర్యలు తీసుకోగలరు.
🚩 *ముఖ్యాంశాలు – Gram Panchayat Reforms (G.O.Ms.No.91, 04-11-2025)*

1️⃣ ప్రభుత్వము గ్రామ పంచాయతీలను తిరిగి వర్గీకరించి, సిబ్బంది నమూనా (staffing pattern) నిర్ణయించింది.

2️⃣ ప్రస్తుత 7244 క్లస్టర్ సిస్టమ్ రద్దు, ఇప్పుడు ప్రతి 13351 గ్రామ పంచాయతి స్వతంత్ర యూనిట్ గా ఉంటుంది.

3️⃣ గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరించారు:
 - Rurban Panchayats – 359
 - Grade-I – 3082
 - Grade-II – 3163
 - Grade-III – 6747

4️⃣ 359 Grade-I Panchayat Secretaries పోస్టులు → Rurban Panchayat Development Officers (PDO) గా అప్‌గ్రేడ్.
 Pay Scale: ₹45,830 – ₹1,30,580

5️⃣ మిగిలిన పంచాయతీ సెక్రటరీ పోస్టులు 5 గ్రేడ్ల బదులుగా 3 గ్రేడ్లుగా విలీనం:
 - Grade-I – ₹44,570–1,27,480
 - Grade-II – ₹32,670–1,01,970
 - Grade-III – ₹28,280–89,720

6️⃣ పోస్ట్ పేరును మార్చి: Panchayat Secretary → Panchayat Development Officer (PDO)

7️⃣ Junior Assistant/JA-cum-Bill Collector (₹25,220–80,910) లోని 359 పోస్టులు Senior Assistant (₹34,580–1,07,210) గా అప్‌గ్రేడ్ చేసి Rurban Panchayats లో నియమిస్తారు.

8️⃣ ప్రతి పంచాయతీలో క్రింది సిబ్బంది విభాగాలు ఏర్పాటు:
 - Sanitation Wing
 - Water Supply Wing
 - Country Planning Wing
 - Street Lighting & Engineering Wing
 - Revenue Wing

9️⃣ Engineering Assistants, Digital Assistants లను Country Planning సహాయకులుగా ఉపయోగించడానికి అనుమతి.

🔟 Ministerial & Executive Cadre పోస్టుల మధ్య ప్రమోషన్ ఛానెల్ అనుమతించబడింది. Service rules మార్చబడతాయి.

1️⃣1️⃣ ఇంటర్ కాడర్ ట్రైనింగ్ తప్పనిసరి – 2 వారాల సంస్థాగత శిక్షణ + 1 సంవత్సరం ఆన్-జాబ్ ట్రైనింగ్.

1️⃣2️⃣ Deputy MPDOs ను కనీసం 3 సంవత్సరాలు Rurban PDOలుగా నియమిస్తారు (ఫీల్డ్ అనుభవం కోసం).

1️⃣3️⃣ డిజిటల్ వింగ్ ఏర్పాటు: అన్ని పంచాయతీల రికార్డుల డిజిటలైజేషన్ మరియు రియల్ టైమ్ మానిటరింగ్ కోసం.

1️⃣4️⃣ అన్ని ఖాళీ పోస్టులను 2025-26 ప్యానల్ ఇయర్‌లో భర్తీ చేసి తరువాత విలీనం చేయాలి.
💬 *మన మిత్ర కాంపెయిన్ సమాచారం*

☛ ప్రభుత్వం 2025 నవంబర్ 7 (శుక్రవారం)
నుండి “మనా మిత్ర” వాట్సాప్ ఆధారిత సేవలపై Door-to-Door Campaign ప్రారంభించాలని నిర్ణయించింది.

☛ ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని అన్ని గ్రామ & వార్డు సచివాలయాలలో కొనసాగుతుంది.

☛ ఉద్దేశ్యం — ప్రతి కుటుంబానికి మనా మిత్ర యాప్ సేవల అవగాహన కల్పించడం, వాట్సాప్ ద్వారా డిజిటల్ సేవల వినియోగాన్ని పెంచడం.

🔸 *అమలు మార్గదర్శకాలు:*

☛ అన్ని Village/Ward Secretariats ప్రతి శుక్రవారం Door-to-Door Awareness Campaign నిర్వహించాలి.

☛ *సిబ్బంది ఇంటింటికీ వెళ్లి* 👇

1. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలో ప్రదర్శన (Demonstration) చేయాలి.

2. Pamphlets పంపిణీ చేసి, QR కోడ్‌లను చూపించాలి.

3. కవరైన ఇళ్ళ సంఖ్య & నమోదైన పౌరుల వివరాలు నమోదు చేయాలి.


☛ Panchayat Secretary / Ward Administrative Secretary తగిన సమన్వయం చేసి, తమ పరిధిలోని అన్ని ఇళ్ళు కవరయ్యేలా చూడాలి.

☛ Village Revenue Officers (VROs), Survey Assistants / Ward Revenue Secretaries — రెవెన్యూ, ల్యాండ్ సంబంధిత సేవలపై అవగాహన కల్పించాలి.

☛ Energy Assistants / Energy Secretaries — విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులపై వాట్సాప్ సేవలను వివరించాలి.

☛ Agriculture, Horticulture, Sericulture, Veterinary, Fisheries, ANM / Ward Health Secretaries — శాఖల వారీగా వాట్సాప్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

☛ క్యాంపెయిన్ రోజు ఎవరూ లీవ్ తీసుకోకూడదు, అత్యవసర వైద్య కారణాలు మినహా.

☛ District GSWS Officers & DLDOs — కార్యక్రమ ప్రగతిని పర్యవేక్షించి, నవంబర్ 8 నాటికి రిపోర్ట్ పంపాలి.

☛ Municipal Commissioners / MPDOs — అవసరమైన లాజిస్టిక్స్, ప్రచారం, సపోర్ట్ అందించాలి.
వాట్సాప్_డోర్_to_డోర్_సర్వే_.jpg
469.5 KB
ప్రతీ శుక్రవారము వాట్సాప్ డోర్ to డోర్ సర్వే మరింత తీవ్రం గా ప్రచారం చేయాలి అని,పాంప్లెంట్ లు పంచాలి అని , ఆరోజు ఏ ఉద్యోగి కూడా సెలవు మంజూరు చేయరాదు అని GSWS డైరెక్టర్ వారి ఉత్తర్వులు👆👆
⏳ *కౌశలం స్కిల్ టెస్ట్ అప్డేట్* ⏳

📢 రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఏర్పాట్లు ప్రారంభం!
🧰 వీటి కోసం అవసరమైన పరికరాలు ఇప్పటికే సచివాలయాలకు పంపిణీ చేయబడ్డాయి.
📝 ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసిన వారికే అవకాశం ఉంటుంది.
⚠️ ఇంకా రిజిస్ట్రేషన్ చేయని వారు – ఇవాళే చివరి తేదీ!
✅ చదివిన ప్రతి ఒక్కరికీ అర్హత!

🕒 కేవలం 3 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి!

👉 *వెంటనే Apply చేయండి:*
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
*పేదల ఇళ్ల వెరిఫికేషన్ గడువు పెంపు*

▪️ఈనెల 30వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు.
▪️తొలుత ఈనెల 5 వరకు గడువు.. యాప్ పనిచేయనందున గడువు పెంపు.
▪️ఆప్షన్-3 ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలుపుదల.
▪️ఇళ్ల పొజిషన్ చూశాకే నిధుల విడుదల.
🔌⚡️ *విద్యుత్ బిల్లు మీరు లెక్కించుకోండి..!* ⚡️🔌

ఇకమీదట మీ ఇంటి బిల్లు ఎలాగో మీరు కూడా తెలుసుకోవచ్చు 👇

🏠 *గృహ విద్యుత్ ఛార్జీలు (Domestic Charges):*

1️⃣ 0 - 30 యూనిట్లు → ₹1.90 / యూనిట్
2️⃣ 31 - 75 యూనిట్లు → ₹3.00 / యూనిట్
3️⃣ 76 - 125 యూనిట్లు → ₹4.50 / యూనిట్
4️⃣ 126 - 225 యూనిట్లు → ₹6.00 / యూనిట్
5️⃣ 226 - 400 యూనిట్లు → ₹8.75 / యూనిట్
6️⃣ 400 పైగా → ₹9.75 / యూనిట్

🏢 *వాణిజ్య విద్యుత్ ఛార్జీలు (Commercial Charges):*

1️⃣ 0 - 50 యూనిట్లు → ₹5.40 / యూనిట్
2️⃣ 51 - 100 యూనిట్లు → ₹7.65 / యూనిట్
3️⃣ 101 - 300 యూనిట్లు → ₹9.05 / యూనిట్
4️⃣ 301 - 500 యూనిట్లు → ₹9.60 / యూనిట్
5️⃣ 500 పైగా → ₹10.15 / యూనిట్

🧮 *ఉదాహరణకు:*

రెడ్డి గారు అక్టోబర్ నెలలో 123 యూనిట్లు వాడుకున్నారు👇
✅ మొదటి 30 యూనిట్లు × ₹1.90 = ₹57
✅ తర్వాత 45 యూనిట్లు × ₹3.00 = ₹135
✅ మిగిలిన 48 యూనిట్లు × ₹4.50 = ₹216
➡️ మొత్తం ఎనర్జీ ఛార్జ్ = ₹408

💡 *గమనించండి:*

⚙️ పై బిల్లుకు అదనంగా —
• ఫిక్స్‌డ్ ఛార్జీలు
• కస్టమర్ ఛార్జీలు
• ఎలక్ట్రిసిటీ డ్యూటీ
• ట్రూఅప్, PPCA ఛార్జీలు
వీటిని కలిపి ఫైనల్ బిల్లు వస్తుంది ✅

📲 మీ యూనిట్లు చూసి ఈ పద్ధతిలో లెక్కిస్తే మీ బిల్లు సులభంగా తెలుసుకోవచ్చు! 💡
🚨 *క్లస్టర్ వ్యవస్థ రద్దు – పంచాయతీలకు స్వతంత్ర హోదా!* 🌿

📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది!
ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి,
19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. ✅

🏛 *ముఖ్య నిర్ణయాలు:*
🔹 పంచాయతీలను 4 గ్రేడులుగా విభజించారు
🔹 పంచాయతీ కార్యదర్శుల పేరును "పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)"గా మార్చారు
🔹 ప్రతి పంచాయతీలో ఇప్పుడు ఉండబోయే విభాగాలు 👇
 - పారిశుద్ధ్యం 🧹
 - తాగునీటి సరఫరా 💧
 - గ్రామీణ ప్రణాళిక 🏗
 - వీధి దీపాలు 💡
 - ఇంజినీరింగ్ 🧰
 - ఆదాయం & పన్ను వసూళ్లు 💰

👨‍💼 *సిబ్బంది మార్పులు:*
🔹 రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు
🔹 డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక IT విభాగం ఏర్పాటు
🔹 కార్యదర్శుల ఖాళీలను 2025-26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం

📜 ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేశారు.