VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదం
వస్తు సేవల పన్ను సవరణ బిల్లుకు ఆమోదం
దేవదాయశాఖ సవరణ బిల్లుకు ఆమోదం
వ్యాట్ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం #APAssembly
✅ *చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు సభలో ప్రతిపాదించిన మంత్రి నారాయణ** #APAssembly
✅ 2024వ సం|| నవంబర్, 22వ తేది, శుక్రవారం #APAssembly లో 71వ, 77వ ప్రశ్నలుగా *నిరుద్యోగ భృతి & ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #NirudyogaBruthi #WomenFreeBusRide

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
C_Q_22_11_2024_3.pdf
3.3 MB
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 22వ తేది శుక్రవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
A_Q_22_11_2024_2.pdf
925.4 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 22వ తేది,
శుక్రవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
✅ *ఈనెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి.* #APAssembly #apbudget2024
**శాసన మండలిలో 8 కీలక బిల్లులకు ఆమోదం**

*ఇప్పటికే శాసన సభలో ఆమోదం పొందిన బిల్లులకు ఆమోద ముద్ర వేసిన శాసన మండలి*

• చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసిన శాసన మండలి

• లోకాయుక్తా సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం

• గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024 కు శాసన మండలి ఆమోదం

• ఎపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం

• ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం

• ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
బిల్లుకు శాసన మండలి

• ఎపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ -2024 కు శాసనమండలి ఆమోదం

• పీడీ యాక్ట్ సవరణ బిల్లు -2024కు శాసన మండలి ఆమోదం #APAssembly
🔴 *ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా* #APAssembly
🔴 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు MOU పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు #APAssembly
🔵 తల్లికి వందనం (రూ.15,000), అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. #APAssembly
*రేపే AP బడ్జెట్.. కీలక పథకాలకు కేటాయింపులు*

✓ అసెంబ్లీలో రేపు(ఫిబ్రవరి 28) రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.

✓ ₹3L Crతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉ.9గంటలకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.

✓ దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

✓ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి. #APAssembly
🟣 *ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసనపరిషత్ - 2025వ నం॥ ఫిబ్రవరి 28వ తేదిన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు* #APAssembly
నేడు ఏపీ బడ్జెట్‌ 2025-26.. ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం.. శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర #APAssembly
🔴 *ఏపి బడ్జెట్ కేటాయింపులు*

మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్‌ ఫండ్‌ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..

▪️పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు
▪️వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు
▪️పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు
▪️జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు
▪️మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు
▪️విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు
▪️వ్యవసాయానికి రూ.11,636 కోట్లు
▪️సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
▪️ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు
▪️రవాణా శాఖకు రూ.8,785 కోట్లు
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులకు రూ.3,377 కోట్లు
▪️పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు,
▪️స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు
▪️ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు రూ.300 కోట్లు
▪️ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు
▪️మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు
▪️తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
▪️అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
▪️దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
▪️రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
▪️బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు
▪️పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు
▪️చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు
▪️RTGSకు రూ.101 కోట్లు
▪️ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు
▪️అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు
▪️పోలవరం కోసం రూ.6,705 కోట్లు
▪️జల్‌జీవన్‌ విషన్‌కు రూ.2,800 కోట్లు
▪️వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
▪️పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
▪️బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
▪️ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
▪️ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
▪️అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు
▪️మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు
▪️వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
▪️పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
▪️ఆర్‌ అండ్‌ బీకి రూ.8,785 కోట్లు
▪️యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
▪️తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
▪️నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
▪️డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
▪️రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.500 కోట్లు
▪️ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు
▪️ITI, IITల కోసం రూ.210 కోట్లు
▪️దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు
▪️రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ.10కోట్లు
▪️ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు
▪️ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు
▪️మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
▪️ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. #APAssembly
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లు విధుల్లో లేరు అన్నప్పుడు... వరదలు వచ్చినప్పుడు జీవో పాస్ చేసి వాళ్ళ చేత ఎందుకు సేవలు చేయించుకున్నారు - చంద్రశేఖర్ రెడ్డి #APVolunteers #APAssembly
వాలంటీర్లుకు గౌరవవేతనం పెంపుదల #APAssembly
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నేడు(మార్చి 17) #APAssembly సమక్షంలో వాలంటీర్లు గూర్చి మరొక్కసారి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి గారు ఇచ్చిన సమాధానం #APVolunteers
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి కూడా ఆమోదం.. అలాగే, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని ‘తాడిగడప పురపాలక సంఘం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. #APCabinet #APAssembly
నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం గూర్చి మరియు 20 లక్షలు ఉద్యోగాల కల్పన గూర్చిన ప్రశ్నలకు నేడు #APAssembly లో సమాధానం ఇవ్వనున్నారు.
నిరుద్యోగ భృతి గూర్చిన ప్రశ్నకు నేడు #APAssembly లో సమాధానం ఇవ్వనున్నారు.